హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

IIT Jobs : ఐఐటీలో 95 నాన్ టీచింగ్ ఉద్యోగాలు.. ద‌ర‌ఖాస్తుకు రెండు రోజులే అవ‌కాశం

IIT Jobs : ఐఐటీలో 95 నాన్ టీచింగ్ ఉద్యోగాలు.. ద‌ర‌ఖాస్తుకు రెండు రోజులే అవ‌కాశం

ఐఐటీ కాన్పూర్‌

ఐఐటీ కాన్పూర్‌

IIT Jobs : కాన్పూర్‌లోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ (Indian Institute of Technology Kanpur) ప‌లు పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది. ఈ పోస్టుల ద‌ర‌ఖాస్తుకు న‌వంబ‌ర్ 16, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.

కాన్పూర్‌లోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ (Indian Institute of Technology Kanpur) ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ (Notification) విడుద‌ల చేసింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా డిప్యూటీ రిజిస్ట్రార్‌, అసిస్టెంట్ రిజిస్ట్రార్, టెక్నిక‌ల్ సూప‌రింటెండెంట్‌ (Technical Superintendent), వంటి పలు విభాగాల్లో 95 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ పోస్టులకు ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్  ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ద‌ర‌ఖాస్తు చేసుకొనే వారు సంబంధిత‌ పోస్టుకు సంబంధించిన విద్యార్హ‌త‌తో పాటు ప‌లు పోస్టుల‌కు అనుభ‌వం ఉండాలి.  ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకొనే అభ్య‌ర్థుల వ‌యసు 21 ఏళ్ల నుంచి 51 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. ద‌ర‌ఖాస్తుకు న‌వంబ‌ర్ 16, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది. నోటిఫికేష‌న్‌, అర్హ‌త‌ల వివ‌రాల కోసం అధికారికి వెబ్‌సైట్ https://www.iitk.ac.in/ ను సంద‌ర్శించాల్సి ఉంటుంది.

పోస్టుల వివ‌రాలు.. అర్హ‌త‌లు

పోస్టుపేరుఅర్హ‌త‌లుఖాళీలు
డిప్యూటీ రిజిస్ట్రార్‌గుర్తింపు పొందిన యూనివ‌ర్సిటీల్లో 55శాతం మార్కుల‌తో మాస్ట‌ర్ డిగ్రీ చేసి ఉండాలి. సంబంధిత రంగంలో ప‌ని అనుభ‌వం ఉండాలి.03
అసిస్టెంట్ రిజిస్ట్రార్ (సెంట్ర‌ల్ లైబ్రరీ)గుర్తింపు పొందిన యూనివ‌ర్సిటీల్లో 55శాతం మార్కుల‌తో మాస్ట‌ర్ డిగ్రీ చేసి ఉండాలి.01
అసిస్టెంట్ రిజిస్ట్రార్‌గుర్తింపు పొందిన యూనివ‌ర్సిటీల్లో 55శాతం మార్కుల‌తో మాస్ట‌ర్ డిగ్రీ చేసి ఉండాలి.08
హిందీ ఆఫీస‌ర్‌గుర్తింపు పొందిన యూనివ‌ర్సిటీల్లో 55శాతం మార్కుల‌తో మాస్ట‌ర్ డిగ్రీ చేసి ఉండాలి. సంబంధిత రంగంలో 5 లేదా 3 ఏళ్ల ప‌ని అనుభ‌వం ఉండాలి.01
స్టూడెంట్ కౌన్సిల‌ర్‌సైకాల‌జీలో ఎంఫిల్ లేదా ఎంఏ చేసి ఉండాలి. 3 ఏళ్ల వృత్తి అనుభ‌వం ఉండాలి.01
జూనియ‌ర్ టెక్నిక‌ల్ సూప‌రింటెండెంట్‌ (ట్రాన్స్‌లేష‌న్‌)హిందీ లేదా ఇంగ్లీష్ లాగ్వేజ్‌ల‌లో మాస్ట‌ర్ డిగ్రీ చేసి ఉండాలి. మూడేళ్ల ప‌ని అనుభ‌వం ఉండాలి.01
జూనియ‌ర్ టెక్నిక‌ల్ సూప‌రింటెండెంట్‌సంబంధిత రంగంల ఎంటెక్‌, ఎంఈ, బీటెక్‌, బీఈ చేసి ఉండాలి. సంబంధిత రంగంలో మూడేళ్ల ప‌ని అనుభ‌వం ఉండాలి. కంప్యూట‌ర్ నాలెడ్జ్ అవ‌స‌రం.12
జూనియ‌ర్ సూప‌రింటెండెంట్ (నానో సైన్స్‌)సైన్స్‌లో మాస్ట‌ర్ డిగ్రీ చేసి 5 ఏళ్ల అనుభ‌వం ఉండాలి. లేదా గ్రాడ్యుయేష‌న్ చేసి 7 ఏళ్ల అనుభ‌వం ఉండాలి.01
జూనియ‌ర్ సూప‌రింటెండెంట్సైన్స్‌లో మాస్ట‌ర్ డిగ్రీ చేసి 5 ఏళ్ల అనుభ‌వం ఉండాలి. లేదా గ్రాడ్యుయేష‌న్ చేసి 7 ఏళ్ల అనుభ‌వం ఉండాలి.14
ఫిజిక‌ల్ ట్రైనింగ్ ఇన్‌స్ట్ర‌క్ట‌ర్ఫిజిక‌ల్ ఎడ్యుకేష‌న్‌లో గ్రాడ్యుయేష‌న్‌తోపాటు 4 ఏళ్ల వృత్తి అనుభ‌వం ఉండాలి.04
జూనియ‌ర్ టెక్నిషియ్‌సంబంధిత విభాగాల్లో బ్యాచ్‌ల‌ర్ డిగ్రీ చేసి. మూడేళ్ల సంబంధిత ప‌ని అనుభ‌వం ఉండాలి.17
జూనియ‌ర్ అసిస్టెంట్‌ఏదైనా రంగంలో బ్యాచ్‌ల‌ర్ డిగ్రీ. కంప్యూట‌ర్ ప‌రిజ్ఞానం ఉండాలి.31
డ్రైవ‌ర్ గ్రేడ్ -2ప‌దోత‌ర‌గ‌తి పాసై ఉండాలి. డ్రైవింగ్‌లో అనుభ‌వం ఉండాలి.01


RBI Internship : ఆర్‌బీఐలో ప‌ని చేయాల‌నుకొంటున్నారా..? అయితే ట్రై చేయండి


ఎంపిక విధానం..

Step 1 :  ద‌ర‌ఖాస్తు చేసుకొన్న అభ్య‌ర్థుల‌కు రాత ప‌రీక్ష నిర్వ‌హిస్తారు.

Step 2 :  ప‌లు విభాగాల‌కు సెమినార్ ప్ర‌జంటేష‌న్, స్కిల్ టెస్టు (Skill Test) నిర్వ‌హిస్తారు.

Step 3 :  ఈ రౌండ్‌ల‌లో పాసైన వారిని ఇంట‌ర్వ్యూ (Interview) నిర్వ‌హిస్తారు.


ద‌ర‌ఖాస్తు విధానం..

Step 1 :  ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ప‌ద్ధ‌తిలో ఉంటుంది.

Step 2 :  ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://www.iitk.ac.in/new/recruitment ను సంద‌ర్శించాలి.

Step 3 :  అనంత‌రం నోటిఫికేష‌న్ చ‌ద‌వాలి. (నోటిఫికేష‌న్ కోసం క్లిక్ చేయండి)

Step 4 :  అర్హ‌త ఉన్న పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి https://oag.iitk.ac.in/Oa_Rec_Pg/ లింక్‌లోకి వెళ్లి.

Step 5 :  అనంత‌రం Register NewUser ఆప్ష‌న్‌లోకి వెళ్లి ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

Step 6 :  ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ పూర్త‌యిన త‌రువాత పోస్టుల ఆధారంగా రూ.500, లేదా రూ.200 ఫీజు చెల్లించాలి.

Step 7 :  ఎస్సీ,ఎస్టీ, పీడ‌బ్ల్యూడీ, మ‌హిళా అభ్య‌ర్థులుకు ఫీజు మిన‌హాయింపు ఉంది.

Step 8 :  ద‌ర‌ఖాస్తు పూర్త‌యిన త‌రువాత అప్లికేష‌న్ ప్రింట్ తీసుకొని

Recruitment Section Room no. 224

Faculty Building 2nd Floor

IIT Kanpur (UP) -208016

అడ్ర‌స్‌కు పంపాలి.

Step 9 :  ద‌ర‌ఖాస్తుకు న‌వంబ‌ర్ 16, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.

First published:

Tags: Govt Jobs 2021, IIT, Job notification, JOBS

ఉత్తమ కథలు