NO SIR MA AM IN KERALA SCHOOL STUDENTS TO USE GENDER NEUTRAL TERM TEACHER GH VB
Kerala School: కేరళ స్కూల్ చరిత్రాత్మక నిర్ణయం.. సార్, మేడమ్ అని పిలవడం నిషేధం.. మరి ఏమని పిలవాలంటే..
ప్రతీకాత్మక చిత్రం
భారతదేశంలోని అత్యధిక అక్షరాస్యత శాతం గల కేరళ (Kerala) రాష్ట్రం విద్యార్థుల ఆలోచన విధానాన్ని చిన్న వయసు నుంచే మార్చేస్తోంది. అభివృద్ధికి, వ్యక్తిత్వ వికాసానికి బీజాలు వేసే పాఠశాలల్లో లింగ వివక్షత, లింగ భేదం, లింగ అసమానతలకు తావులేకుండా కేరళ స్కూళ్లు (Kerala Schools) ప్రశంసనీయ నిర్ణయాలు తీసుకుంటున్నాయి.
భారతదేశంలోని అత్యధిక అక్షరాస్యత(Literacy) శాతం గల కేరళ (Kerala) రాష్ట్రం విద్యార్థుల ఆలోచన విధానాన్ని చిన్న వయసు నుంచే మార్చేస్తోంది. అభివృద్ధికి, వ్యక్తిత్వ వికాసానికి బీజాలు వేసే పాఠశాలల్లో లింగ వివక్షత, లింగ భేదం, లింగ అసమానతలకు తావులేకుండా కేరళ స్కూళ్లు (Kerala Schools) ప్రశంసనీయ నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే పాలక్కాడ్ (Palakkad) జిల్లాలోని ఒక పాఠశాల(School) యాజమాన్యం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఉపాధ్యాయులను 'సార్' లేదా 'మేడమ్' అని పిలవకూడదని, అందుకు బదులుగా 'టీచర్ (teacher)' అనే జెండర్ న్యూట్రల్ పదాన్ని ఉపయోగించాలని ఈ స్కూల్ తన విద్యార్థులను ఆదేశించింది. ఒలస్సేరి (Olassery) గ్రామంలోని సీనియర్ బేసిక్ స్కూల్ ఇలాంటి ఆదేశాలను తీసుకొచ్చింది. ఇక్కడ 300 మంది విద్యార్థులు చదువుకుంటుండగా.. తొమ్మిది మంది మహిళా ఉపాధ్యాయులు.. ఎనిమిది మంది పురుష ఉపాధ్యాయులు పాఠాలు బోధిస్తున్నారు.
ఇలా రాష్ట్రంలో భాషలో కూడా లింగ భేదం లేకుండా ఆదేశాలు తీసుకురావడంలో సీనియర్ బేసిక్ స్కూల్ (Senior Basic School)యే మొదటిది కావడం విశేషం. కేరళలోని అనేక పాఠశాలలు బాలబాలికలకు ఒకేరకమైన యూనిఫామ్‌లను తీసుకొచ్చాక బేసిక్ స్కూల్ ఈ నిర్ణయం తీసుకుంది. ఆడ, మగ తేడా లేకుండా అందరూ సమానమే అనే ఆలోచనలు విద్యార్థుల బుర్రనిండా నింపేందుకే ఒకేరకమైన యూనిఫామ్‌లను కేరళ స్కూళ్లు ఇటీవల తీసుకొచ్చాయి.
* కేరళ స్కూల్ ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది?
నివేదికల ప్రకారం, జెండర్-న్యూట్రల్ (gender-neutral) పదాలను ఉపయోగించి ఉపాధ్యాయులను సంబోధించాలని మొదట ఒక ఉపాధ్యాయుడు సూచించారు. ఈ ఉపాధ్యాయుడు పాలక్కాడ్‌కు చెందిన బోబన్ మట్టుమంత అనే ఒక సామాజిక కార్యకర్త పని నుంచి ప్రేరణ పొందారు. ఈ సామాజిక కార్యకర్త ప్రభుత్వ అధికారులను సార్ (Sir) సంబోధించే పద్ధతిని తొలగించాలని ఒక క్యాంపెయిన్ చేస్తున్నారు. ఐఏఎస్, ఐపీఎస్ ఇలా ఏ అధికారినైనా సార్, మేడం అని పిలవకుండా పదవీ పేరుతో పిలవాలి అని ఆయన ప్రచారం మొదలెట్టారు. అలా అతన్ని చూసి ప్రేరణ పొందిన సదరు ఉపాధ్యాయుడు తమ పాఠశాలలో ఇలాంటి విధానాన్ని తీసుకురావాలని సూచించారు.
అలాగే గతేడాది కేరళ పాఠశాల నుంచి 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న మాథూర్ పంచాయతీ.. పంచాయతీ సిబ్బందిని వారి హోదాతో పిలవడానికి అనుకూలంగా 'సర్', 'మేడమ్' అని పిలిచే పద్ధతిని తొలగించింది. ఈ రెండు సందర్భాలు.. లింగ భేదం లేని పదాలను పరిచయం చేసేలా స్కూల్ ఉపాధ్యాయులను ప్రేరేపించాయి. ఈ పద్ధతిని తల్లిదండ్రులు స్వాగతించారు. మొదట కాస్త ఇబ్బంది పడినా ఆ తర్వాత విద్యార్థులు ఉపాధ్యాయులను సంబోధించే విధానాన్ని కూడా మార్చారు. ఉపాధ్యాయులను టీచర్ అని సంబోధించడం అనేది ఓ కొత్త మార్గంలా విద్యార్థులలో లింగ సమానత్వం గురించి మరింత అవగాహన పెంచడంలో సహాయపడుతుందని స్కూల్ యాజమాన్యం తెలిపింది.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.