Home /News /jobs /

NO LONG SLEEVES NO SHOES CHECK DRESS CODE FOR MEDICAL ENTRANCE EXAM NEET 2022 UMG GH

NEET 2022: ఎగ్జామ్‌కి అవేసుకుని పోతే అంతే.. మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ డ్రెస్ కోడ్ వివరాలు ఇవే..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఈ ఏడాది నీట్‌కు హాజరయ్యే విద్యార్థులు NTA సూచనల ప్రకారం పొడవాటి చేతులు ఉండే దుస్తులను ధరించకూడదు. ఒక అభ్యర్థి సాంస్కృతిక, సంప్రదాయ దుస్తులలో పరీక్ష కేంద్రానికి వస్తే.. వారు చివరి రిపోర్టింగ్ టైమ్‌కు కనీసం ఒక గంట ముందు రిపోర్ట్ చేయాలి.

ఇంకా చదవండి ...
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) 2022 జులై 17న జరగాల్సి ఉంది. ఎగ్జామ్ వాయిదా వేయాలనే డిమాండ్లు, నిరసనలు కొనసాగుతున్నా, అధికారులు మాత్రం పరీక్ష తేదీలను ఇంకా మార్చలేదు. మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసం రిజిస్టర్ చేసుకున్న 18 లక్షల మంది విద్యార్థులు ఒకే సమయంలో పెన్, పేపర్ విధానంలో పరీక్ష రాయనున్నారు. ఈ ఏడాదిలో ఇదే అతిపెద్ద పరీక్ష కానుంది. అందువల్ల పరీక్షలో సేఫ్టీ, కచ్చితత్వాన్ని నిర్ధారించడానికి డ్రెస్‌ కోడ్‌ సహా మరెన్నో కఠినమైన నియమాలను అధికారులు అనుసరిస్తున్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ- NTA ఎగ్జామ్ కోసం అన్ని ఏర్పాట్లు చేస్తోంది.

ఈ ఏడాది నీట్‌కు హాజరయ్యే విద్యార్థులు NTA సూచనల ప్రకారం పొడవాటి చేతులు ఉండే దుస్తులను ధరించకూడదు. ఒక అభ్యర్థి సాంస్కృతిక, సంప్రదాయ దుస్తులలో పరీక్ష కేంద్రానికి వస్తే.. వారు చివరి రిపోర్టింగ్ టైమ్‌కు కనీసం ఒక గంట ముందు రిపోర్ట్ చేయాలి. సాధారణంగా ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ లాస్ట్ రిపోర్టింగ్ టైమ్ మధ్యాహ్నం 12.30. అంటే సంప్రదాయ, మతపరమైన దుస్తులు ధరించిన విద్యార్థులు 11:30 లోపు ఎగ్జామ్ సెంటర్‌లో రిపోర్టింగ్ చేయాలి. పరీక్ష నిబంధనలు, కచ్చితత్వాన్ని కొనసాగిస్తూ అభ్యర్థికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా సరైన పరిశీలన కోసం తగినంత సమయం ఉండేలా ఈ రూల్ తెచ్చినట్లు NTA తెలిపింది.

 ఇదీ చదవండి: కొవ్వొత్తి, అగ్గిపెట్టె ఉందని కేసు..! కోర్టులో పోలీసులకు దిమ్మతిరిగే ట్విస్ట్.. అసలేం జరిగిందంటే..?


తక్కువ మడమల చెప్పులు, చెప్పులతో వచ్చిన వారిని అనుమతిస్తారు. కానీ ఎగ్జామ్ హాలుకు బూట్లను అనుమతించరు. పరీక్షలో అవకతవకలకు పాల్పడే మార్గాలను నిరోధించేందుకు ఎన్‌టీఏ ఈ నిబంధనలు రూపొందించింది. వీటితో పాటు ఆభరణాలు, లోహ వస్తువులు, గడియారం, బ్రాస్‌లెట్, కెమెరా వంటి వాటిని ఎగ్జామ్ సెంటర్‌కు అనుమతించరు. విద్యార్థులు వాలెట్, గాగుల్స్, హ్యాండ్‌బ్యాగ్‌లు, బెల్ట్‌లు, క్యాప్ వంటి వస్తువులను ధరించకూడదు. ఎవరైనా వీటిని ధరించినట్లు కనిపిస్తే, నిబంధనల ప్రకారం వాటిని తీసివేయమని అధికారులు సూచిస్తారు. మహిళా అభ్యర్థులను తనిఖీ చేయడానికి ఎగ్జామ్ సెంటర్లలో మహిళా సిబ్బందితో పాటు స్పెషల్ ఎన్‌క్లోజర్‌ను అధికారులు ఏర్పాటు చేస్తారు.



నీట్ 2022 జులై 17న జరగాల్సి ఉంది. ఈ పరీక్షను వాయిదా వేయాలనే డిమాండ్లు కొనసాగుతున్నా, ఈ సంవత్సరంలో అతిపెద్ద ప్రవేశ పరీక్షను నిర్వహించడానికి అధికారులు సిద్ధమయ్యారు. నీట్ 2022 దేశవ్యాప్తంగా 546 నగరాల్లో, భారతదేశం వెలుపల 14 నగరాల్లో జరగనుంది. పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:20 గంటల వరకు జరుగుతుంది. ఈ ఏడాది పరీక్షకు 20 నిమిషాలు అదనంగా కేటాయించారు. ఈ ఎక్స్‌ట్రా టైమ్ స్టూడెంట్స్‌కు గేమ్-ఛేంజర్‌గా మారుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
Published by:Mahesh
First published:

Tags: Entrance exams, JOBS, NEET, NEET 2022

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు