APPSC: జగన్ మరో చరిత్రాత్మక నిర్ణయం... ఉద్యోగార్థులకు ఇంటర్వ్యూ విధానం రద్దు..

ఉద్యోగాల భర్తీలో ఇంటర్వ్యూల విధానాన్ని రద్దుచేయాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించారు. 2020 జనవరి నుంచి భర్తీచేసే ఉద్యోగాలకు ఈ విధానం అమల్లోకి రానుంది.

news18-telugu
Updated: October 17, 2019, 4:27 PM IST
APPSC: జగన్ మరో చరిత్రాత్మక నిర్ణయం... ఉద్యోగార్థులకు ఇంటర్వ్యూ విధానం రద్దు..
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: October 17, 2019, 4:27 PM IST
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. అమరావతిలో ఏపీపీఎస్సీపై అధికారులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఉద్యోగాల భర్తీలో ఇంటర్వ్యూల విధానాన్ని రద్దుచేయాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించారు. 2020 జనవరి నుంచి భర్తీచేసే ఉద్యోగాలకు ఇంటర్వ్యూ విధానం రద్దు చేయాలని అధికారులను ఆదేశించారు. అంత్యంత పారదర్శక విధానం ద్వారా ఏపీపీఎస్సీ ఉద్యోగాలను భర్తీ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రతి జనవరిలో ఉద్యోగాల భర్తీపై క్యాలెండర్‌ విడుదల చేయాలని సూచించారు. ఏపీపీఎస్సీ నిర్వహించే ప్రతి పరీక్షలో ప్రఖ్యాత ఐఐటీ, ఐఐఎం భాగస్వామ్యం తీసుకునేలా ఆలోచన చేయాలని సీఎం జగన్ అధికారులకు ఆదేశాలిచ్చారు. ఏపీపీఎస్సీ నిర్వహించే ప్రతి నోటిఫికేషన్‌ కోర్టు కేసులకు దారితీస్తుందని అధికారులు ముఖ్యమంత్రికి తెలియజేశారు. ఇకపై ఎలాంటి తప్పులు లేకుండా చూసుకోవాలని జగన్ ఆదేశించారు. అత్యవసర సర్వీసులు అందిస్తున్న విభాగాల్లో పోస్టుల భర్తీకి ప్రాధాన్యత ఇవ్వాలని ఏపీపీఎస్సీకి సీఎం జగన్ సూచించారు.

Video: పులి పిల్లను పట్టుకుని ఎలా హింసిస్తున్నారో చూడండి



First published: October 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...