హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

CET: విద్యార్థులకు అలర్ట్... ఈ ఏడాది ఆ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఉండదు

CET: విద్యార్థులకు అలర్ట్... ఈ ఏడాది ఆ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఉండదు

ఈ నిర్ణయం ద్వారా ఇంటర్‌లో 35శాతం కనీసం మార్కులతో పాసైన విద్యార్థులు సైతం ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ, లా సహా పలు కోర్సుల్లో ప్రవేశాలు పొందేందుకు అర్హులు అవుతారు.

ఈ నిర్ణయం ద్వారా ఇంటర్‌లో 35శాతం కనీసం మార్కులతో పాసైన విద్యార్థులు సైతం ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ, లా సహా పలు కోర్సుల్లో ప్రవేశాలు పొందేందుకు అర్హులు అవుతారు.

CUCET 2021 | సెంట్రల్ యూనివర్సిటీల్లో అడ్మిషన్ల కోసం సెంట్రల్ యూనివర్సిటీస్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్-CUCET నిర్వహించాలని భావించిన యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్-UGC ఈసారి ఈ పరీక్ష ఉండదని తెలిపింది.

కరోనా మహమ్మారి కారణంగా భారతదేశంలోని విద్యారంగం అస్తవ్యస్తంగా మారింది. పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు మూతపడటంతో విద్యార్థుల విలువైన సమయం వృథా అవుతోంది. కోవిడ్ దెబ్బకు దాదాపు అన్ని పరీక్షలు వాయిదా పడుతూ వస్తున్నాయి. తాజాగా సెంట్రల్ యూనివర్సిటీస్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ పరీక్షను (CUCET) ఈ ఏడాదిలో నిర్వహించబోమని యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) ప్రకటించింది. సీయూసెట్‌ను 2022-2023 విద్యాసంవత్సరంలో అమలు చేయొచ్చని జూలై 18వ తేదీన యూజీసీ తెలిపింది. కేంద్ర విశ్వవిద్యాలయాల్లో అడ్మిషన్ సాధించేందుకు విద్యార్థులు సెంట్రల్ యూనివర్సిటీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ రాయాల్సి ఉంటుంది. కానీ ఈ ఏడాది ప్రవేశపరీక్ష ఉండబోదని యూజీసీ ప్రకటించడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.

కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ గురించి యూజీసీ ట్విట్టర్ వేదికగా ఒక పోస్ట్ షేర్ చేసింది. 'కోవిడ్ 19 మహమ్మారి తీవ్రత దృష్ట్యా, 2021-22 విద్యా సంవత్సర సమయంలో కేంద్ర విశ్వవిద్యాలయాలలో ప్రవేశ ప్రక్రియ(అడ్మిషన్ ప్రాసెస్) గత పద్ధతి ప్రకారమే కొనసాగవచ్చు. సెంట్రల్ యూనివర్సిటీస్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (CUCET) 2022-23 విద్యా సంవత్సరం నుంచి అమలు చేయవచ్చు' అని యూజీసీ పేర్కొంది.

High Court Jobs: ఆంధ్రప్రదేశ్‌లోని హైకోర్టులో ఉద్యోగాలు... దరఖాస్తుకు రేపే చివరి తేదీ

Indian Navy Jobs 2021: ఇండియన్ నేవీలో జాబ్స్... పరీక్ష లేదు... విశాఖపట్నంలో ఇంటర్వ్యూలు

నూతన విద్యా విధానం (NEP)- 2020లో సెంట్రల్ యూనివర్సిటీస్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ను ప్రతిపాదించారు. కేంద్ర విశ్వవిద్యాలయాలలో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే సెంట్రల్ యూనివర్సిటీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ కోసం పద్ధతులను సిఫారసు చేయాలంటూ ఏడుగురు సభ్యులతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ ఏడాది పరీక్ష నిర్వహించాలని భావించినా సాధ్యపడలేదు.

ఇకపోతే, అక్టోబర్ ఒకటవ తేదీ నుంచి ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కోసం తరగతులు ప్రారంభించాలని అన్ని యూనివర్సిటీలు, కళాశాలలకు యూజీసీ శనివారం సూచించింది. అయితే విద్యార్థులు సెప్టెంబర్ 30వ తేదీ నాటికి యూజీ కోర్సుల్లో చేరాల్సి ఉంటుంది. ఆయా ప్రాంతాల్లో కరోనా తీవ్రతను బట్టి ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌లైన్ పద్ధతులలో ప్రవేశ ప్రక్రియను నిర్వహించాలని యూజీసీ వెల్లడించింది.

DRDO Jobs 2021: డీఆర్‌డీఓలో ఉద్యోగాలు... రేపటిలోగా అప్లై చేయండి

BSF Recruitment 2021: బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌లో 285 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

సీబీఎస్‌ఈ సహా అన్ని బోర్డులకు సంబంధించి 12వ తరగతి పరీక్ష ఫలితాలు ప్రకటించిన తర్వాతనే యూజీ కోర్సుల్లో అడ్మిషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలని యూజీసీ తెలిపింది. ఒకవేళ పరీక్ష ఫలితాలు విడుదల కావటం ఆలస్యమైతే అక్టోబర్ 18 నుంచి 2021-22 విద్యా సంవత్సరం ప్రారంభమవుతుందని యూజీసీ వెల్లడించింది.

First published:

Tags: CAREER, Exams, UGC, University exams, University Grants Commission

ఉత్తమ కథలు