Home /News /jobs /

NO EXAM HIRING AT RAILWAYS FOR 12TH PASS APPLY ONLINE UMG GH

Railway Jobs: పోటీ పరీక్ష లేకుండానే రైల్వేలో ఉద్యోగాలు.. ఇవిగో ఫుల్ డీటైల్స్..!

పరీక్ష లేకుండానే రైల్వేలో ఉద్యోగాలు

పరీక్ష లేకుండానే రైల్వేలో ఉద్యోగాలు

నిరుద్యోగులకు ఇండియన్ రైల్వేస్ (Railways) గుడ్ న్యూస్ (Good News) చెప్పింది. ఎలాంటి పోటీ పరీక్ష (Exam) లేకుండానే నేరుగా నియామకాలను నిర్వహిస్తోంది రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (RRC), నార్త్ సెంట్రల్ రైల్వే (NCR). అప్రెంటిస్‌ పోస్టుల కోసం తాజా రిక్రూట్‌మెంట్ డ్రైవ్ జరుగుతోంది.

ఇంకా చదవండి ...
నిరుద్యోగులకు ఇండియన్ రైల్వేస్ (Indian Railways) గుడ్ న్యూస్ (Good News) చెప్పింది. ఎలాంటి పోటీ పరీక్ష (Exam) లేకుండానే నేరుగా నియామకాలను నిర్వహిస్తోంది రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (RRC), నార్త్ సెంట్రల్ రైల్వే (NCR). అప్రెంటిస్‌ పోస్టుల కోసం తాజా రిక్రూట్‌మెంట్ డ్రైవ్ జరుగుతోంది. ఆసక్తి ఉన్నవారు అధికారిక వెబ్‌సైట్ rrcpryj.org ద్వారా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్లు సమర్పించడానికి చివరి తేదీ ఆగస్టు 1. ఫిట్టర్, వెల్డర్ (G&E), ఆర్మేచర్ విండర్, మెషినిస్ట్, కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, పెయింటర్ (జనరల్), మెకానిక్ (DSL), ప్లంబర్ మొదలైన ట్రేడ్‌లలో అప్రెంటిస్‌షిప్స్ అవకాశాలు ఉన్నాయి.

ఉద్యోగాలకు అర్హత పొందేందుకు దరఖాస్తుదారులు ఎలాంటి పరీక్షలు రాయాల్సిన అవసరం లేదు. అప్రెంటీస్ చట్టం, 1961 ప్రకారం.. దరఖాస్తుదారులను ఎంపిక చేసి, శిక్షణ అందించడానికి మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు. మెరిట్ లిస్ట్‌లో అభ్యర్థులు మెట్రిక్యులేషన్‌లో (కనీసం 50% అగ్రిగేట్ మార్కులతో) సాధించిన మార్కుల శాతాన్ని, ITI పరీక్షకు సమానమైన వెయిటేజీని పరిగణనలోకి తీసుకుంటారు.

ఇదీ చదవండి: నేవీ అగ్నిపథ్‌కు మహిళా అభ్యర్థుల నుంచి మంచి రెస్పాన్స్.. మూడు రోజుల్లోనే 10వేలకు పైగా దరఖాస్తులు


* అర్హత వివరాలు..
ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్: అభ్యర్థులు తప్పనిసరిగా SSC/మెట్రిక్యులేషన్/10వ తరగతి పరీక్ష లేదా దానికి సమానమైన (10+2 పరీక్ష విధానంలో) తరగతిలో ఉత్తీర్ణులై ఉండాలి. గుర్తింపు పొందిన బోర్డు నుంచి కనీసం 50 శాతం మార్కులు సాధించి ఉండాలి. NCVT/SCVT జారీ చేసిన సంబంధిత ట్రేడ్‌లో ITI ఉత్తీర్ణులై ఉండాలి.

టెక్నికల్ క్వాలిఫికేషన్: సంబంధిత ట్రేడ్‌లో ITI సర్టిఫికేట్/ NCVT/SCVTతో నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ తప్పనిసరి.

వయో పరిమితి: దరఖాస్తుదారుల కనీస వయసు 15 సంవత్సరాలు. ఆగస్టు 1, 2022 నాటికి 24 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉండాలి. రిజర్వ్‌డ్ వర్గాలకు వయో పరిమితులపై సడలింపులు ఉంటాయి.

* ఎలా దరఖాస్తు చేయాలి?
స్టెప్ 1: అధికారిక వెబ్‌సైట్‌ www.rrcpryj.org ఓపెన్ చేయండి.
స్టెప్ 2: హోమ్‌పేజీలో ‘Act Apprentices’ విభాగాన్ని చూడండి.
స్టెప్ 3: దాని కింద ఆన్‌లైన్ ఫారమ్‌ లింక్ ఉంటుంది.
స్టెప్ 4: అర్హత, ఆసక్తి ఉన్న పోస్ట్ కోసం రిజిస్టర్ చేసుకోండి, ఆ తర్వాత అప్లికేషన్ ఫారమ్‌ను సమర్పించండి.

* ఫీజు ఎంత?
జనరల్ అభ్యర్థులు రూ. 100 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. అయితే SC/ST/PWD/మహిళా అభ్యర్థులు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. మొత్తం 1,659 అప్రెంటీస్ పోస్టుల కోసం నార్త్ సెంట్రల్ రైల్వే తాజా రిక్రూట్‌మెంట్ డ్రైవ్ చేపడుతోంది.



మరోవైపు, రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) గ్రూప్ D, 2019 పే లెవల్ 1 పరీక్ష కోసం రిక్రూట్‌మెంట్ పరీక్షలను నిర్వహించడానికి సిద్ధంగా ఉంది. గ్రూప్ డి కేటగిరీ కింద 1,03,769 ఖాళీల భర్తీకి పరీక్ష తేదీని జూలై 1, 2022న ప్రకటించింది. ఆగస్టు 17 నుంచి ఈ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.
Published by:Mahesh
First published:

Tags: Central Government Jobs, Government jobs, JOBS, Railway jobs

తదుపరి వార్తలు