• Home
  • »
  • News
  • »
  • jobs
  • »
  • NMMC PLANS TO GIVE RS 500 TO EACH STUDENT TO PURCHASE INTERNET FOR ONLINE CLASSES NS

Online Classes: ఇంటర్ నెట్ కోసం ప్రతీ విద్యార్థికి రూ.500.. నేరుగా పేరెంట్స్ ఖాతాల్లోకి నగదు.. వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

ఇంటర్ నెట్ కొనుగోలు శక్తి లేక ఆన్లైన్ క్లాసులకు అనేక మంది విద్యార్థులు హాజరు కాకపోవడంతో అక్కడి అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతీ విద్యార్థికి రూ. 500 అందించనున్నట్లు ప్రకటించారు.

  • Share this:
    కరోనా నేపథ్యంలో గతేడాది నుంచి విద్యాసంస్థలు మూతబడ్డాయి. అయితే కేసులు తగ్గినట్లే తగ్గి మళ్లీ విజృంభిస్తుండడంతో ఈ ఏడాది కూడా మళ్లీ పాఠశాలలు తిరిగి ప్రారంభించే పరిస్థితి లేదు. దీంతో ఈ సారి కూడా ఆన్లైన్ క్లాసులే నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఇంటర్ నెట్ సమస్య అనేక మంది విద్యార్థులను వేధిస్తోంది. చాలా మంది విద్యార్థుల తల్లిదండ్రులకు స్మార్ట్ ఫోన్లు ఉన్నా కూడా ఇంటర్ నెట్ బిల్లులు కట్టలేని పరిస్థితి ఉంది. దీంతో అనేక మంది పిల్లలు ఆన్లైన్ క్లాసులకు హాజరు కాలేని దుస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో నావీ ముంబాయి మున్సిపల్ కార్పొరేషన్(NMMC) కీలక నిర్ణయం తీసుకుంది. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నిర్వహిస్తున్న స్కూళ్లలో చదివే విద్యార్థులకు ఇంటర్ నెట్ రీఛార్జ్ కోసం రూ. 500 అందించాలని నిర్ణయించింది. ఈ స్కూళ్లలో చదివే అత్యధిక మంది మధ్యతరగతి వారే కావడంతో వారి ప్రయోజనం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు నావీ ముంబాయి మున్సిపల్ కార్పొరేషన్ ముఖ్య అధికారి అభిజిత్ తెలిపారు. తమ మున్సిపల్ కొర్పొరేషన్ ఆధ్వర్యంలో నడిచే స్కూళ్లలో మొత్తం 40 వేల విద్యార్థులు చదువుతున్నారని ఆయన వెల్లడించారు.
    Exams Cancelled: ఆ బోర్డు 12వ తరగతి పరీక్షలు రద్దు.. కేంద్రం మరో కీలక నిర్ణయం.. వివరాలివే

    ఇందులో దాదాపు 1600 మంది విద్యార్థుల తల్లిదండ్రులకు అసలు స్మార్ట్ ఫోన్ కూడా లేదని గుర్తించినట్లు చెప్పారు. వారి సమస్యను కూడా గుర్తించి పరిష్కరించనున్నట్లు ఆయన వెల్లడించారు. అయితే త్వరలో స్కూళ్లు ప్రారంభం కానున్న నేపథ్యంలో స్మార్ట్ ఫోన్ ఉన్న విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లో రూ. 500 జమ చేయనున్నట్లు చెప్పారు. ఈ డబ్బులతో విద్యార్థులు మూడు నెలల పాటు ఇంటర్ నెట్ కొనుగోలు చేసి ఆన్లైన్ క్లాసులకు హాజరు కావొచ్చని ఆయన చెప్పారు.

    ఇదిలా ఉంటే.. ఇండియాలో కొత్తగా 1,20,529 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 2,86,94,879కి చేరింది. కొత్తగా మొన్న 2,713 మంది చనిపోగా... నిన్న 3,380 మంది కరోనా కారణంగా ప్రాణాలు వదిలారు. ఈ లెక్కలతో కలిపి దేశంలో మొత్తం మరణాల సంఖ్య 3,44,082కు చేరింది. దేశంలో మరణాల రేటు 1.2 శాతంగా ఉంది. ప్రపంచ దేశాల్లో ఇది 2.15 శాతంగా ఉంది. ఇండియాలో తాజాగా 1,97,894 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 2,67,95,549కి చేరింది.

    రికవరీ రేటు శనివారం 93.1 శాతం నుంచి 93.4 శాతానికి పెరిగడం కాస్త ఊరటనిచ్చే వార్తగా చెప్పవచ్చు. ప్రస్తుతం భారత్‌లో 15,55,248 యాక్టివ్ కేసులు ఉన్నాయి. యాక్టివ్ కేసులు రోజూ లక్ష దాకా తగ్గుతున్నాయి. దేశవ్యాప్తంగా కొత్తగా 20,84,421 టెస్టులు చేశారు. భారత్‌లో ఇప్పటివరకు 36 కోట్ల 11 లక్షల 74 వేల 142 టెస్టులు చేశారు. కొత్తగా 36,50,080 మందికి వ్యాక్సిన్లు వేశారు. ఇప్పటివరకు 22కోట్ల 78లక్షల 60వేల 317మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు.
    Published by:Nikhil Kumar S
    First published: