Home /News /jobs /

NMDC TRADE APPRENTICE RECRUITMENT 2022 INTERVIEW ON 25 AUGUST 30 AUGUST KNOW THE FULL DETAILS HERE VB

NMDC Recruitment 2022: NMDCలో ఖాళీలు.. ఎలాంటి రాత పరీక్ష లేదు.. నేరుగా ఇంటర్వ్యూ ద్వారా ఎంపికలు..

NMDC Recruitment 2022: NMDCలో ఖాళీలు.. ఎలాంటి రాత పరీక్ష లేదు.. నేరుగా ఇంటర్వ్యూ ద్వారా ఎంపికలు..

NMDC Recruitment 2022: NMDCలో ఖాళీలు.. ఎలాంటి రాత పరీక్ష లేదు.. నేరుగా ఇంటర్వ్యూ ద్వారా ఎంపికలు..

NMDC Recruitment 2022: నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (NMDC)లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా వివిధ విభాగాల్లో ఉన్న ఖాళీ పోస్టులను భర్తీ చేయనుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (NMDC)లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌(Notification) విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా వివిధ విభాగాల్లో ఉన్న ఖాళీ పోస్టులను భర్తీ చేయనుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. NMDC లిమిటెడ్ ట్రేడ్ అప్రెంటీస్ పోస్టుల కోసం ఈ నియామకాలను చేపట్టనుంది. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ nmdc.co.inని సందర్శించడం పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా అనేక ట్రేడ్ అప్రెంటీస్ పోస్టులను భర్తీ చేస్తారు. అభ్యర్థులు అధికారిక సైట్ apprenticeshipindia.org సందర్శించి దరఖాస్తులను చేసుకోవచ్చు.

SSC CPO Recruitment 2022: మీరు డిగ్రీ పూర్తి చేశారా.. అయితే ఈ ఉద్యోగాలు మీ కోసమే.. SSC ద్వారా ఎంపిక..


పోస్టుల వివరాలు
25 మెకానిక్ డీజిల్, 20 ఫిట్టర్ పోస్టులు, 30 ఎలక్ట్రీషియన్ పోస్టులు, 20 వెల్డర్ పోస్టులు, 20 మెకానిక్ పోస్టులు, 2 ఆటో ఎలక్ట్రీషియన్ పోస్టులు, 5 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటితో పాటు.. మెషినిస్ట్ , కెమికల్ ల్యాబ్ అసిస్టెంట్ 2, మెడికల్ ల్యాబ్ అసిస్టెంట్ 2, మైనింగ్ మేట్ 2, బ్లాస్టర్ 2 పోస్టులను భర్తీ చేస్తారు.



రిక్రూట్‌మెంట్ డ్రైవ్ కింద కెమికల్ ల్యాబ్ అసిస్టెంట్ ట్రేడ్ అప్రెంటీస్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఫిజిక్స్ మరియు కెమిస్ట్రీ సబ్జెక్టులతో B.Sc కలిగి ఉండాలి. మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ 12వ తరగతి పాస్ అండ్ 10వ తరగతి పాస్ అయిన అభ్యర్థులు మైనింగ్ మేట్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర ట్రేడ్‌ల కోసం.. అభ్యర్థి తప్పనిసరిగా సంబంధిత సబ్జెక్టులో ITI సర్టిఫికేట్ కలిగి ఉండాలి.

Police Jobs Recruitment 2022: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 4300 పోలీస్ కొలువులకు నోటిఫికేషన్..


ఎంపిక ప్రక్రియ..
ఇంటర్వ్యూ ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులు ఎంపిక చేయనున్నారు.

ఇంటర్వ్యూ ఎప్పుడు ఉంటుంది
నోటిఫికేషన్ ప్రకారం.. ఆగస్టు 25 నుండి ఆగస్టు 30, 2022 వరకు ఇంటర్వ్యూలు జరగనున్నాయి. నోటిఫికేషన్‌లో ఇచ్చిన చిరునామాలో అవసరమైన పత్రాలతో ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు నోటిఫికేషన్ లో చూడవచ్చు.
Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, Central Government Jobs, JOBS, Nmdc, Private Jobs

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు