Home /News /jobs /

NMDC RECRUITMENT NOTIFICATION RELEASED FOR 59 NEW APPRENTICE VACANCIES FOLLOW THESE STEPS TO APPLY NS

NMDC Recruitment 2021: నిరుద్యోగులకు అలర్ట్.. NMDCలో జాబ్స్.. ఇలా అప్లై చేయండి

నిరుద్యోగులకు అలర్ట్.. NMDCలో జాబ్స్.. ఇలా అప్లై చేయండి

నిరుద్యోగులకు అలర్ట్.. NMDCలో జాబ్స్.. ఇలా అప్లై చేయండి

నేషనల్ మైనింగ్ డవలప్మెంట్ కార్పొరేషన్ (NMDC) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరు కాావాల్సి ఉంటుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    నేషనల్ మినరల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (NMDC) నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. అప్రంటీస్ ఖాళీలను (Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. మొత్తం 59 అప్రంటీస్ ఖాళీలను భర్తీ చేస్తున్నట్లు నోటిఫికేషన్లో(Job Notification) స్పష్టం చేశారు. వాక్-ఇన్-ఇంటర్వ్యూల ద్వారా ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నట్లు నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. ఈ ఉద్యోగాలకు అప్లై చేసిన అభ్యర్థులకు BIOM, Bacheli Complex, Bacheliలో ఇంటర్వ్యూలను నిర్వహించనున్నారు. ఎంపికైన అభ్యర్థులు ఏడాది పాటు అప్రంటీస్ విధానంలో పని చేయాల్సి ఉంటుంది. స్క్రూటినీ మరియు సెలక్షన్ కమిటీ ఆధ్వారంలో రూపొందించిన మెరిట్ లిస్ట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

    ఎవరు అప్లై చేయాలంటే..
    గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్/ NCVT నుంచి ఐటీఐ లేదా డిగ్రీ/డిప్లొమా చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు.
    స్ట్రీమ్స్ వారీగా ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి.
























































    కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ ఇన్ ప్రోగ్రామింగ్ అండ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్30
    మెకానికల్ ఇంజనీరింగ్6
    ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్3
    ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్1
    మైనింగ్ ఇంజనీరింగ్4
    సివిల్ ఇంజనీరింగ్2
    డిప్లొమా టెక్నీషియన్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్5
    డిప్లొమా టెక్నీషియన్ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్2
    డిప్లొమా టెక్నీషియన్ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్ ఇంజనీరింగ్1
    డిప్లొమా టెక్నీషియన్ ఇన్ మైనింగ్ ఇంజనీరింగ్1
    డిప్లొమా టెక్నీషియన్ ఇన్ మోడ్రన్ ఆఫీస్ మేనేజ్మెంట్(MOM)3
    డిప్లొమా ఇంజనీరింగ్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్1
    మొత్తం:59

    BOI Recruitment 2021: డిగ్రీ చేసిన వారికి బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు రేపటి వరకే ఛాన్స్.. ఇలా అప్లై చేయండి

    ఇంటర్వ్యూ, ఇతర పూర్తి వివరాలు..
    -అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. ఇంటర్వ్యూలను జనవరి 20 నుంచి 25వ తేదీ వరకు నిర్వహించనున్నారు.
    -గతంలో 10.05.2021న విడుదల చేసిన నోటిఫికేషన్ ద్వారా అప్లై చేసుకున్న అభ్యర్థులతో పాటు కొత్త అభ్యర్థులు సైతం ఇంటర్వ్యూలకు హాజరు కావొచ్చని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.
    -ఇంటర్వ్యూలకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ ను నోటిఫికేషన్లో చూడొచ్చు.
    Mega Job Drive in AP: ఏపీలో రేపు మెగా జాబ్ మేళా.. KIA Motors, Amazon, Amararaja, Jio, Airtel తదితర సంస్థల్లో ఉద్యోగాలు.. రూ. 18 వేల వరకు వేతనం



    -ఎంపికైన అభ్యర్థులకు ఏడాది పాటు అప్రంటీస్ గా పని చేసే అవకాశం ఉంటుంది.
    -అయితే అప్రంటీస్ ట్రైనింగ్ ముగిసిన అనంతరం ఎలాంటి ఉద్యోగానికి సంబంధించిన అవకాశం ఉండదని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.
    -అయితే.. NMDC లేదా ఇతర ఏ సంస్థలో అయినా అప్రంటీస్ ట్రైనింగ్ తీసుకుంటున్న అభ్యర్థులకు మరియు డిప్లొమా, డిగ్రీ, పీజీ తదితర కోర్సులు చేస్తున్న అభ్యర్థులకు అవకాశం లేదని సంస్థ స్పష్టం చేసింది.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Central Government Jobs, Job notification, JOBS

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు