NMDC RECRUITMENT INTERVIEWS ARE BEING CONDUCTED FOR 59 NEW APPRENTICE VACANCIES INTERVIEWS FROM JAN 20 NS
NMDC Recruitment 2021: ఎన్ఎండీసీలో జాబ్స్.. ఎలాంటి ఎగ్జామ్ లేదు.. రేపటి నుంచే ఇంటర్వ్యూలు
ప్రతీకాత్మక చిత్రం
నేషనల్ మైనింగ్ డవలప్మెంట్ కార్పొరేషన్ (NMDC) పలు ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులను మెరిట్ ఆధారంగా ఎంపిక చేయనున్నారు.
నేషనల్ మినరల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (NMDC) నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. అప్రంటీస్ ఖాళీలను (Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. మొత్తం 59 అప్రంటీస్ ఖాళీలను భర్తీ చేస్తున్నట్లు నోటిఫికేషన్లో(Job Notification) స్పష్టం చేశారు. వాక్-ఇన్-ఇంటర్వ్యూల ద్వారా ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నట్లు నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. ఈ ఉద్యోగాలకు అప్లై చేసిన అభ్యర్థులకు BIOM, Bacheli Complex, Bacheliలో ఇంటర్వ్యూలను నిర్వహించనున్నారు. ఎంపికైన అభ్యర్థులు ఏడాది పాటు అప్రంటీస్ విధానంలో పని చేయాల్సి ఉంటుంది. స్క్రూటినీ మరియు సెలక్షన్ కమిటీ ఆధ్వారంలో రూపొందించిన మెరిట్ లిస్ట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
ఎవరు అప్లై చేయాలంటే..
గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్/ NCVT నుంచి ఐటీఐ లేదా డిగ్రీ/డిప్లొమా చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. స్ట్రీమ్స్ వారీగా ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి..
కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ ఇన్ ప్రోగ్రామింగ్ అండ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్
30
మెకానికల్ ఇంజనీరింగ్
6
ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్
3
ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్
1
మైనింగ్ ఇంజనీరింగ్
4
సివిల్ ఇంజనీరింగ్
2
డిప్లొమా టెక్నీషియన్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్
5
డిప్లొమా టెక్నీషియన్ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్
2
డిప్లొమా టెక్నీషియన్ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్ ఇంజనీరింగ్
1
డిప్లొమా టెక్నీషియన్ ఇన్ మైనింగ్ ఇంజనీరింగ్
1
డిప్లొమా టెక్నీషియన్ ఇన్ మోడ్రన్ ఆఫీస్ మేనేజ్మెంట్(MOM)
3
డిప్లొమా ఇంజనీరింగ్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్
ఇంటర్వ్యూ, ఇతర పూర్తి వివరాలు..
-అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. ఇంటర్వ్యూలను జనవరి 20 నుంచి 25వ తేదీ వరకు నిర్వహించనున్నారు.
-గతంలో 10.05.2021న విడుదల చేసిన నోటిఫికేషన్ ద్వారా అప్లై చేసుకున్న అభ్యర్థులతో పాటు కొత్త అభ్యర్థులు సైతం ఇంటర్వ్యూలకు హాజరు కావొచ్చని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.
-ఇంటర్వ్యూలకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ ను నోటిఫికేషన్లో చూడొచ్చు. Central Railway recruitment 2022: నిరుద్యోగులకు పండుగ లాంటి వార్త.. రైల్వేలో 2422 ఖాళీలకు నోటిఫికేషన్.. పది పాసైతే చాలు..
-ఎంపికైన అభ్యర్థులకు ఏడాది పాటు అప్రంటీస్ గా పని చేసే అవకాశం ఉంటుంది.
-అయితే అప్రంటీస్ ట్రైనింగ్ ముగిసిన అనంతరం ఎలాంటి ఉద్యోగానికి సంబంధించిన అవకాశం ఉండదని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.
-అయితే.. NMDC లేదా ఇతర ఏ సంస్థలో అయినా అప్రంటీస్ ట్రైనింగ్ తీసుకుంటున్న అభ్యర్థులకు మరియు డిప్లొమా, డిగ్రీ, పీజీ తదితర కోర్సులు చేస్తున్న అభ్యర్థులకు అవకాశం లేదని సంస్థ స్పష్టం చేసింది.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.