ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ అయిన నేషనల్ మైనింగ్ డవలప్మెంట్ కార్పొరేషన్ (NMDC) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు సంస్థ నుంచి తాజాగా జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదలైంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని ప్రకటనలో పేర్కొన్నారు. ఎగ్జిగ్యూటివ్ ట్రైనీ విభాగంలో 29 ఖాళీలు ఉన్నాయి. గేట్ 2021 స్కోర్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులకు ఏడాది పాటు శిక్షణ ఉంటుంది. శిక్షణ పూర్తయిన వారికి ఏడాది పాటు ప్రొహిబిషన్ పిరియడ్ ఉంటుంది. ట్రైనీలకు నెలకు రూ. 50 వేల వేతనం ఉంటుంది.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
ఎలక్ట్రికల్స్ | 6 |
మెటీరియల్ మేనేజ్మెంట్ | 9 |
మెకానికల్ | 10 |
మైనింగ్ | 4 |
మొత్తం: | 29 |
విద్యార్హతల వివరాలు: ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, పవర్ సిస్టమ్స్ అండ్ హై ఓల్టేజ్ ఇంజనీరింగ్, పవర్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, మెకానికల్ అండ్ ఆటోమేషన్ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ అండ్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్, మెకానికల్ ప్రొడక్షన్, ప్రొడక్షన్ ఇంజనీరింగ్, మైనింగ్ మిషనరీ, మైనింగ్ ఇంజనీరింగ్ లో బీఈ, బీటెక్ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు GATE-2021 పరీక్షకు హాజరై ఉండాలి.
ఎలా అప్లై చేసుకోవాలంటే..
- అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
- అభ్యర్థులు ముందుగా https://www.nmdc.co.in/ వెబ్ సైట్ ను ఓపెన్ చేయాలి.
- అనంతరం Careers ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
- అనంతరం Click here for Complete Notification/Apply Online. ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
- సూచించిన వివరాలను నమోదు చేసి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.