Home /News /jobs /

NLC RECRUITMENT 2022 NLC INDIA LIMITED RELEASED JOB NOTIFICATION FOR 550 POSTS KNOW HOW TO APPLY SS

NLC Recruitment 2022: ఎన్ఎల్‌సీ ఇండియా జాబ్ నోటిఫికేషన్... తెలంగాణ, ఏపీ అభ్యర్థులకు అవకాశం

NLC Recruitment 2022: ఎన్ఎల్‌సీ ఇండియా జాబ్ నోటిఫికేషన్... తెలంగాణ, ఏపీ అభ్యర్థులకు అవకాశం
(image: NLC India)

NLC Recruitment 2022: ఎన్ఎల్‌సీ ఇండియా జాబ్ నోటిఫికేషన్... తెలంగాణ, ఏపీ అభ్యర్థులకు అవకాశం (image: NLC India)

NLC Recruitment 2022 | ఇంజనీరింగ్ డిగ్రీ, డిప్లొమా పాస్ అయినవారికి అలర్ట్. కేంద్ర ప్రభుత్వ సంస్థ భారీగా ఖాళీలను భర్తీ చేస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేయొచ్చు. ఈ జాబ్ నోటిఫికేషన్ (Job Notification) వివరాలు తెలుసుకోండి.

ఇంకా చదవండి ...
    కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖకు చెందిన నవరత్న కంపెనీ ఎన్ఎల్‌సీ ఇండియా లిమిటెడ్ (NLC India Limited) ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. గ్రాడ్యుయేట్ అప్రెంటీస్, టెక్నీషియన్ అప్రెంటీస్ పోస్టుల్ని (Apprentice Jobs) భర్తీ చేస్తోంది. మొత్తం 550 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు 2022 ఫిబ్రవరి 1న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. అప్లై చేయడానికి 2022 ఫిబ్రవరి 10 చివరి తేదీ. ఆన్‌లైన్‌లో అప్లై చేసిన తర్వాత దరఖాస్తు ఫామ్‌ను పోస్టులో 2022 ఫిబ్రవరి 15 తేదీలోగా చేరేలా పంపాలి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు తమిళ్ నాడు, కేరళ, కర్నాటక రాష్ట్రాల్లో, పాండిచ్చెరి, లక్షద్వీప్ కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్, డిప్లొమా పాస్ అయినవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. ఈ జాబ్ నోటిఫికేషన్ వివరాలు, దరఖాస్తు విధానం గురించి తెలుసుకోండి.

    NLC Recruitment 2022: గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ ఖాళీల వివరాలు ఇవే...









































    గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ ఖాళీలు250
    ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్70
    ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్10
    ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్10
    సివిల్ ఇంజనీరింగ్35
    మెకానికల్ ఇంజనీరింగ్75
    కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్20
    కెమికల్ ఇంజనీరింగ్10
    మైనింగ్ ఇంజనీరింగ్20

    Railway Jobs 2022: రైల్వేలో ఉద్యోగాలకు నేరుగా ఇంటర్వ్యూ... నోటిఫికేషన్ వివరాలివే

    NLC Recruitment 2022: టెక్నీషియన్ అప్రెంటీస్ ఖాళీల వివరాలు ఇవే...









































    టెక్నీషియన్ అప్రెంటీస్ ఖాళీలు300
    ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్85
    ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్10
    ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్10
    సివిల్ ఇంజనీరింగ్35
    మెకానికల్ ఇంజనీరింగ్90
    కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్25
    మైనింగ్ ఇంజనీరింగ్30
    ఫార్మసీ15

    NLC Recruitment 2022: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


    దరఖాస్తు ప్రారంభం- 2022 ఫిబ్రవరి 1 ఉదయం 10 గంటల నుంచి

    దరఖాస్తుకు చివరి తేదీ- 2022 ఫిబ్రవరి 10 సాయంత్రం 5 గంటలు

    దరఖాస్తులు పంపడానికి చివరి తేదీ- 2022 ఫిబ్రవరి 15 సాయంత్రం 5 గంటలు

    విద్యార్హతలు- గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ అప్రెంటీస్ అభ్యర్థులు సంబంధిత సబ్జెక్ట్‌లో బీటెక్ లేదా బీఈ పాస్ కావాలి. టెక్నీషియన్ అప్రెంటీస్ అభ్యర్థులు సంబంధిత సబ్జెక్ట్‌లో డిప్లొమా పాస్ కావాలి.

    ఇతర నిబంధనలు- 2019, 2020, 2021 సంవత్సరాల్లో గ్రాడ్యుయేషన్, డిప్లొమా పాస్ అయినవారికి మాత్రమే అవకాశం.

    ఎంపిక విధానం- మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

    దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్- The General Manager, Learning & Development Centre, N.L.C India Limited, Block:20, Neyveli- 607 803.

    ఈ జాబ్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

    దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

    Constable Jobs 2022: నిరుద్యోగులకు అలర్ట్... 1149 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్


    NLC Recruitment 2022: అప్లై చేయండి ఇలా


    Step 1- అభ్యర్థులు ముందుగా నేషనల్ అప్రెంటీస్‌షిప్ పోర్టల్ http://www.mhrdnats.gov.in/ ఓపెన్ చేయాలి.

    Step 2- Enroll పైన క్లిక్ చేసి అభ్యర్థి వివరాలతో రిజిస్ట్రేషన్ చేయాలి.

    Step 3- అప్రెంటీస్‌షిప్ పోర్టల్‌లో ఎన్‌రోల్‌మెంట్ నెంబర్ జనరేట్ అయిన తర్వాత https://www.nlcindia.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.

    Step 4- కెరీర్స్ సెక్షన్‌లో Trainees & Apprentices సెక్షన్‌లోకి వెళ్లాలి.

    Step 5- ఆన్‌లైన్ అప్లికేషన్ లింక్ క్లిక్ చేసి దరఖాస్తు ప్రాసెస్ పూర్తి చేయాలి.

    Step 6- ఆ తర్వాత అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకొని నోటిఫికేషన్‌లో వెల్లడించిన అడ్రస్‌కు 2022 ఫిబ్రవరి 15 సాయంత్రం 5 గంటల్లోగా చేరేలా పంపాలి.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: CAREER, Central Government Jobs, Govt Jobs 2022, Job notification, JOBS

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు