Jobs: బీటెక్ పాసైనవారికి 259 ఉద్యోగాలు... ఖాళీల వివరాలివే

NLCIL Recruitment 2020 | బీటెక్ పాసైనవారికి శుభవార్త. భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎన్ఎల్‌సీ ఇండియా లిమిటెడ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పూర్తి వివరాలు తెలుసుకోండి.

news18-telugu
Updated: March 18, 2020, 11:13 AM IST
Jobs: బీటెక్ పాసైనవారికి 259 ఉద్యోగాలు... ఖాళీల వివరాలివే
Jobs: బీటెక్ పాసైనవారికి 259 ఉద్యోగాలు... ఖాళీల వివరాలివే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
మీరు బీటెక్ పాసయ్యారా? ఇంజనీరింగ్ డిగ్రీ చేశారా? మంచి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా? ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎన్ఎల్‌సీ ఇండియా లిమిటెడ్-NLCIL ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. గ్రాడ్యుయేట్ ఎగ్జిక్యూటీవ్ ట్రైనీ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 259 ఖాళీలను ప్రకటించింది. దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో నిర్వహిస్తున్న ప్రాజెక్టుల్లో ఈ పోస్టుల్ని భర్తీ చేస్తారు. ఈ పోస్టులకు మార్చి 18న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తుకు ఏప్రిల్ 17 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను ఎన్ఎల్‌సీ ఇండియా లిమిటెడ్ అధికారిక వెబ్‌సైట్ https://www.nlcindia.com/ ఓపెన్ చేసి చూడొచ్చు.

NLCIL Recruitment 2020: ఖాళీల వివరాలివే...



మొత్తం ఖాళీలు- 259
మెకానికల్- 125
ఎలక్ట్రికల్ (ఈఈఈ)- 65
ఎలక్ట్రికల్ (ఈసీఈ)- 10
సివిల్- 5కంట్రోల్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్- 15
కంప్యూటర్- 5
మైనింగ్- 5
జియాలజీ- 5
ఫైనాన్స్- 14
హ్యూమన్ రీసోర్స్- 10

NLCIL Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2020 మార్చి 18
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 ఏప్రిల్ 17 రాత్రి 11.55 గంటలు
విద్యార్హత- సంబంధిత బ్రాంచ్‌లో ఫుల్‌టైమ్ లేదా పార్ట్ టైమ్ బ్యాచిలర్ డిగ్రీ 60% మార్కులతో పాస్ కావాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 50% మార్కులతో పాసైతే చాలు. జియాలజీ పోస్టుకు ఎంటెక్ లేదా ఎంఎస్సీ, ఫైనాన్స్ పోస్టుకు చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా క్వాలిఫికేషన్ లేదా ఎంబీఏ, హ్యూమన్ రీసోర్స్ పోస్టుకు సోషల్ వర్క్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, బిజినెస్ మేనేజ్‌మెంట్ స్పెషలైజేషన్‌తో డిగ్రీ.
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Job News: మరిన్ని జాబ్స్ &ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

DRDO Jobs: హైదరాబాద్‌ డీఆర్‌డీఓలో జాబ్స్... మార్చి 20 చివరి తేదీ

HAL Recruitment 2020: హిందుస్తాన్ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగాలు... మార్చి 23 చివరి తేదీ

ISRO Jobs: ఇస్రోలో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే
Published by: Santhosh Kumar S
First published: March 18, 2020, 11:13 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading