బీటెక్ పాసైనవారికి శుభవార్త. 259 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు గడువును పొడిగించింది ఎన్ఎల్సీ ఇండియా లిమిటెడ్-NLCIL. ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి ఏప్రిల్ 17 చివరి తేదీ అని నోటిఫికేషన్లో వెల్లడించింది ఎన్ఎల్సీఐఎల్. అయితే కరోనా వైరస్ సంక్షోభం కారణంగా దరఖాస్తు గడువును నెల రోజులు పొడిగించింది. అభ్యర్థులు 2020 మే 17 లోగా దరఖాస్తు చేయొచ్చు. ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎన్ఎల్సీ ఇండియా లిమిటెడ్-NLCIL మొత్తం 259 గ్రాడ్యుయేట్ ఎగ్జిక్యూటీవ్ ట్రైనీ పోస్టుల్ని దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో నిర్వహిస్తున్న ప్రాజెక్టుల్లో వీరిని నియమించనుంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఎన్ఎల్సీ ఇండియా లిమిటెడ్ అధికారిక వెబ్సైట్ https://www.nlcindia.com/ చూడొచ్చు.
NLCIL Recruitment 2020: ఖాళీల వివరాలివే...
మొత్తం ఖాళీలు- 259
మెకానికల్- 125
ఎలక్ట్రికల్ (ఈఈఈ)- 65
ఎలక్ట్రికల్ (ఈసీఈ)- 10
సివిల్- 5
కంట్రోల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్- 15
కంప్యూటర్- 5
మైనింగ్- 5
జియాలజీ- 5
ఫైనాన్స్- 14
హ్యూమన్ రీసోర్స్- 10
NLCIL Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం- 2020 మార్చి 18
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 మే 17
విద్యార్హత- సంబంధిత బ్రాంచ్‌లో ఫుల్‌టైమ్ లేదా పార్ట్ టైమ్ బ్యాచిలర్ డిగ్రీ 60% మార్కులతో పాస్ కావాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 50% మార్కులతో పాసైతే చాలు. జియాలజీ పోస్టుకు ఎంటెక్ లేదా ఎంఎస్సీ, ఫైనాన్స్ పోస్టుకు చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా క్వాలిఫికేషన్ లేదా ఎంబీఏ, హ్యూమన్ రీసోర్స్ పోస్టుకు సోషల్ వర్క్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, బిజినెస్ మేనేజ్మెంట్ స్పెషలైజేషన్‌తో డిగ్రీ.
నోటిఫికేషన్ కోసం
ఇక్కడ క్లిక్ చేయండి.
దరఖాస్తు చేయడానికి
ఇక్కడ క్లిక్ చేయండి.
Job News: మరిన్ని జాబ్స్ &ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇవి కూడా చదవండి:
Free Course: సాఫ్ట్వేర్ జాబ్ మీ కలా? ఈ ఫ్రీ కోర్సు చేయండి
IOCL Jobs: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో అసిస్టెంట్ ఆఫీసర్ ఉద్యోగాలు
RBI Jobs: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాల భర్తీ వాయిదాPublished by:Santhosh Kumar S
First published:April 09, 2020, 12:39 IST