Home /News /jobs /

NLC INDIA APPRENTICE RECRUITMENT FOR TRAINEE POSTS HERE HOW TO APPLY AND KNOW OTHER DETAILS ALSO VB

NLC Recruitment 2022: నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ లో ఉద్యోగాలు.. ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ అభ్యర్థులకు అవకాశం..

NLC Recruitment 2022: నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ లో ఉద్యోగాలు.. ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ అభ్యర్థులకు అవకాశం..

NLC Recruitment 2022: నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ లో ఉద్యోగాలు.. ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ అభ్యర్థులకు అవకాశం..

NLC Recruitment 2022: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ ఇండియా (NLC) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Secunderabad, India
    ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ ఇండియా (NLC) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు NLC అధికారిక వెబ్‌సైట్ nlcindia.in సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఆగస్టు 24, 2022. ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటీస్, నాన్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ మరియు టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటీస్ కోసం మొత్తం 481 పోస్టులను ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా భర్తీ చేస్తారు. ఖాళీలకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

    Post Office Scheme: ప్రతి నెల కేవలం రూ.1200 పొదుపు చేస్తే.. రూ.1 కోటి లాభం పొందొచ్చు..


    ఖాళీల వివరాలు



















    పోస్టు విభాగంఖాళీల సంఖ్య
    ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటీస్201 పోస్టులు
    నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటీస్105 పోస్టులు
    టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటీస్175 పోస్టులు

    ఇంజనీరింగ్ గ్రాడ్యూయేట్ అప్రెంటీస్ లకు అభ్యర్థుల యొక్క డిప్లొమా/డిగ్రీలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ పోస్టులకు 12వ తరగతిలో వచ్చిన మార్కలు ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.

    స్టైపెండ్
    ఇంజనీరింగ్ అప్రెంటీస్ అభ్యర్థులకు నెలకు రూ . 15,028, నాన్ -ఇంజనీరింగ్ అభ్యర్థులకు రూ. 12,524 చెల్లిస్తారు.

    దరఖాస్తు ప్రక్రియ ఇలా..

    -ముందుగా అధికారిక వెబ్‌సైట్ nlcindia.in కి వెళ్లండి.

    -దీని తర్వాత వెబ్‌సైట్‌లో ఇచ్చిన CAREERS ట్యాబ్‌పై క్లిక్ చేయండి.

    -ఇప్పుడు ట్రైనీలు & అప్రెంటిస్‌ల విభాగానికి వెళ్లండి.

    - తర్వాత Advt No. కింద ఆన్‌లైన్ అప్లికేషన్ లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తులను సమర్పించవచ్చు.

    -దరఖాస్తు ప్రక్రియ ముగిసన తర్వాత అప్లికేషన్ ఫారమ్ ను ప్రింట్ తీసుకోవాలి.

    ఈ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ ఆగస్టు 10 నుంచి ప్రారంభం అయ్యాయి. దరఖాస్తులకు చివరి తేదీ ఆగస్టు 24 సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది.

    దరఖాస్తు చేసుకున్న ఫారమ్ ను ప్రింట్ తీసుకొని.. దానిపై సంతకం చేసిన క్రింద ఇవ్వబడిన చిరునామాకు పంపాలి. ఫారమ్ ఆగస్ట్ 31 నాటికి చేరుకోవాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. అడ్రస్.. జనరల్ మేనేజర్ కార్యాలయం, ల్యాండ్ అక్విజిషన్ డిపార్ట్‌మెంట్, NLC ఇండియా లిమిటెడ్, నెయ్వేలి – 607 803.
    Published by:Veera Babu
    First published:

    Tags: Career and Courses, Central Government Jobs, JOBS, Recruitment

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు