నిమ్స్.. హైదరాబాద్ లోని నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(NIMS)పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ (Notification) విడుదల చేసింది. పూర్తిగా కాంట్రాక్ట్ విధానంలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. మెడికల్ జెనెటిక్స్ ల్యాబ్స్ విభాగంలో ఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
మొత్తం రెండు కేటగిరీల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.
1.టెక్నికల్ అసిస్టెంట్(సైటోజెనెటిక్స్)
2. టెక్నీషియన్ (సైటో జెనెటిక్స్)
అర్హతలు..
టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఎమ్మెస్సీ జెనెటిక్స్ లేదా ఎమ్మెస్సీ బయోటెక్నాలజీ లేదా ఎమ్మెస్సీ మాలిక్యూలర్ బయోలజీ లో పీజీ పూర్తి చేసి ఉండాలి. దీంతో పాటు.. ఒక సంవత్సరం హ్యూమన్ జెనెటిక్స్ లో వర్క్ చేసిన అనుభవం ఉండాలి.
మీరు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారా.. అయితే, మీ కోసమే ఈ కరెంట్ అఫైర్స్..
టెక్నీషియన్ ఉద్యోగాలకు.. బీఎస్సీ లైఫ్ సైన్స్ తోపాటు.. ఎమ్మెల్టీ (పీజీడీఎంఎల్టీ) లేదా బీఎస్సీ ఎంఎల్టీ లో రెండు సంవత్సరాలు అనుభవం ఉన్నవాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి..
టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలర్థుల వయస్సు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.
టెక్నీషియన్ ఉద్యోగాలకు అభ్యర్థి యొక్క వయ్ససు 18 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.
కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ ఫలితాలు విడుదల ఎప్పుడంటే.. పూర్తి వివరాలివే..
జీతం
టెక్నికల్ అసిస్టెంట్లకు నెలకు రూ.35,000
టెక్నీషియన్ పోస్టులకు నెలకు రూ. 25,000 చెల్లించనున్నారు.
దరఖాస్తు ఇలా..
అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. సంబంధిత సర్టిఫికేట్లతో దరఖాస్తులను డీన్, నిమ్స్, పంజాగుట్ట, హైదరాబాద్ అడ్రస్ కు ఆగస్టు 26 లోపు పంపించాలని తెలిపారు.
ఎంపిక..
వీటికి ఎలాంటి రాత పరీక్ష ఉండదు. పూర్తిగా ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికలు జరుగుతాయి. ఇంటర్వ్యూ తేదీని ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ కు సందేశం ద్వారా తెలియజేయనున్నారు.
పూర్తి వివరాలకు అధికారికి వెబ్ సైట్ https://www.nims.edu.in/indexను సందర్శించి తెలుసుకోవచ్చు. నోటిఫికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోండి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, JOBS, Nims, Telangana