నీతి ఆయోగ్(Niti Aayog) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్(Notification) వెల్లడించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 34 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం అయింది. దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీ అక్టోబర్ 12గా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. పూర్తి వివరాలకు అధికారిక వెబ్ సైట్ niti.gov.in సందర్శించి తెలుసుకోవచ్చు. వీటిని కాంట్రాక్ట్ బేసిస్ మీద నియమించనున్నారు.
పోస్టుల వివరాలు
యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు 28
కన్సల్టెంట్ పోస్టులు 06
అర్హతలు..
అభ్యర్థులు నోటిఫికేషన్ ప్రకారం గుర్తింపు పొందిన సంస్థ నుండి MBBS/LLB/BE/ B. Tech ఉత్తీర్ణులై ఉండాలి. అంతే కాకుండా అభ్యర్థికి కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.
వయోపరిమితి
కన్సల్టెంట్ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థి వయస్సు 45 ఏళ్లు మించకూడదు. యంగ్ ప్రొఫెషనల్ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల గరిష్ట వయస్సు 32 సంవత్సరాలుగా నిర్ణయించబడింది.
పే స్కేల్
ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.70 వేల నుండి రూ. 1 లక్ష 45 వేలుగా నిర్ణయించారు.
దరఖాస్తు ఇలా..
Step 1: ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి. దాని కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Step 2: ఆ తర్వాత అభ్యర్థి హోమ్‌పేజీలో వర్క్@పాలసీ ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
Step 3: ఇప్పుడు కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియమించబడిన యంగ్ ప్రొఫెషనల్ మరియు కన్సల్టెంట్ గ్రేడ్-I కోసం ప్రకటన లింక్‌పై క్లిక్ చేయండి.
Step 4: అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తుపై క్లిక్ చేసి.. నమోదు చేసి లాగిన్ చేయండి.
Step 5: అభ్యర్థి లాగిన్ అయిన తర్వాత అన్ని వివరాలను పూరించండి.
Step 6: చివరగా మీ దరఖాస్తు ఫారమ్ సమర్పించిన తర్వాత.. దానిని డౌన్ లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోండి.
నీతి ఆయోగ్ గురించి..
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో ప్రణాళికా సంఘం స్థానంలో 2015 జనవరి 1న నీతి ఆయోగ్ ఏర్పడింది. దని యొక్క ఫుల్ ఫామ.. నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. దీనికి అధ్యక్షుడుగా ప్రధానమంత్రి ఉంటాడు. దీనికి ఒక ఉపాధ్యక్షుడు, ఒక సీఈవో ఉంటారు. భారత్ లోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు దీని పాలకమండలిలో సభ్యులుగా ఉంటారు. దీనిలో ఐదుగురు పూర్తికాల సభ్యులు, ఇద్దరు పాక్షిక కాల సభ్యులుగా కొనసాగుతారు. వీరిద్దరినీ విశ్వవిద్యాలయాలు, పరిశోధన సంస్థల నుంచి ఎంపిక చేస్తారు. పదవిలో కొనసాగుతున్న కేంద్రమంత్రుల నుంచి నలుగురు దీనిలో సభ్యులుగా ఉంటారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, JOBS, Niti Aayog