నిరుద్యోగులకు నీతి ఆయోగ్ శుభవార్త చెప్పింది. పలు ఆఫీసర్ స్థాయి పోస్టుల ఉద్యోగాల నియామక ప్రక్రియను చేపట్టింది. ఈ మేరకు సంస్థ నోటిఫికేషన్ విడుదల చేసింది. సీనియర్ రీసెర్చ్ ఆఫీసర్, రీసెర్చ్ ఆఫీసిర్, ఎకనామిక్ ఆఫీసర్, డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ తదితర పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొంది. మొత్తం 30 ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవడానికి ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అప్లై చేయడానికి డిసెంబర్ 24ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఖాళీల వివరాలు..
ఎకనామిక్ ఆఫీసర్: 12 పోస్టులు
డైరెక్టర్: 11 పోస్టులు
సీనియర్ రీసెర్చ్ ఆఫీసర్/రీసెర్చ్ ఆఫీసర్: 13 పోస్టులు
డిప్యూటీ డెరెక్టర్-జనరల్-3 పోస్టులు
విద్యార్హతల వివరాలు..
Senior Research Officer/Research Officer: ఏదైనా సబ్జెక్టుల్లో మాస్టర్ డిగ్రీ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఎంబీబీఎస్, ఇంజనీరింగ్, డిగ్రీని ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీల్లో పూర్తి చేసిన వారు సైతం అర్హులు.
Economic Officer: ఎకనామిక్స్, అప్లైడ్ ఎకనామిక్స్, బిజినస్ ఎకనామిక్స్ లలో ఏదైనా యూనివర్సిటీ పీజీ చేసిన వారు ఈ పోస్టు కు దరఖాస్తు చేయడానికి అర్హులు. మిగతా వివరాలను అధికారిక నోటిఫికేషన్ లో చూడొచ్చు.
NITI Aayog Recruitment 2020 notification-Direct Link
ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..
-నీతి ఆయోగ్ అధికారిక వెబ్ సైట్ niti.gov.in ను ఓపెన్ చేయాలి.
-Work With NITI ఆప్షన్ పై క్లిక్ చేసి Vacancy Circular ఎంచుకుని దానిపై క్లిక్ చేయాలి.
-కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. దాంట్లో మనం దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్న రిక్రూట్మెంట్ ను ఎంపిక చేసుకుని ‘Apply online’పై క్లిక్ చేయాలి.
-తర్వాత రిజిస్టర్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోవాలి.
జీతాల వివరాలు..
-సీనియర్ రీసెర్చ్ అఫీసర్ పోస్టుకు ఎంపికైన వారికి రూ. 1.25 లక్షల వరకు వేతనం ఉంటుంది.
-రీసెర్చ్ ఆఫీసర్ పోస్టుకు ఎంపికైన వారికి రూ.1.05లక్షల వేతనం ఉంటుంది.
-ఎకనామిక్ ఆఫీసర్ పోస్టుకు ఎంపికైన వారికి రూ. 85 వేల వరకు వేతనం ఉంటుంది.
-డైరెక్టర్ పోస్టుకు ఎంపికైన వారికి రూ. 2,15,900 వరకు వేతనం ఉంటుంది.
-డిప్యూటీ డైరెక్టర్-జనరల్ పోస్టుకు ఎంపికైన వారికి రూ. 2.65 లక్షల వరకు వేతనం ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: JOBS, Niti Aayog