హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

NIT Warangal: కెరీర్‌కు బూస్టప్.. నిట్ వరంగల్ పైథాన్ ప్రోగ్రామింగ్‌పై ​ఆన్‌లైన్ కోర్స్‌.. వివ‌రాలు ఇవే

NIT Warangal: కెరీర్‌కు బూస్టప్.. నిట్ వరంగల్ పైథాన్ ప్రోగ్రామింగ్‌పై ​ఆన్‌లైన్ కోర్స్‌.. వివ‌రాలు ఇవే

ఎన్ఐటీ వ‌రంగ‌ల్‌

ఎన్ఐటీ వ‌రంగ‌ల్‌

NIT Warangal : వరంగల్​లోని నేషనల్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ టెక్నాలజీ (నిట్​) బిగినర్స్​ కోసం ‘‘పైథాన్ ప్రోగ్రామింగ్ యూజింగ్​ ఆర్టిఫీషియల్​ ఇంటెలిజెన్స్​ అండ్​ మెషిన్​ లెర్నింగ్​" అనే కొత్త ఆన్‌లైన్ కోర్సును ప్రారంభించింది. ఆసక్తిగల విద్యార్థులు (Students) , వర్కింగ్​ ప్రొఫెషనల్స్ (Working Professionals) ​ నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

ఇంకా చదవండి ...

నేటి టెక్నాలజీ (Technology) యుగానికి తగ్గట్లు జాబ్​ ఓరియెంటెడ్ కోర్సుల (Job Oriented) ను ప్రారంభిస్తున్నాయి ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు. తాజాగా వరంగల్​లోని నేషనల్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ టెక్నాలజీ (National Institute of Technology​) బిగినర్స్​ కోసం పైథాన్ ప్రోగ్రామింగ్ యూజింగ్​ ఆర్టిఫీషియల్​ ఇంటెలిజెన్స్​ అండ్​ మెషిన్​ లెర్నింగ్ (Python Programming for Beginners using Artificial Intelligence and Machine Learning) అనే కొత్త ఆన్‌లైన్ కోర్సును ప్రారంభించింది. ఆసక్తిగల విద్యార్థులు, వర్కింగ్​ ప్రొఫెషనల్స్​(Working Professionals) నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ ఆన్​లైన్​ సెషన్లను ఐఐటి, ఎన్‌ఐటి, యుఎస్ విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్లతో నిర్వహిస్తారు. ఈ సెషన్లలో ఇండస్ట్రీ ఎక్స్​పర్ట్స్​ను కూడా భాగస్వామ్యం చేస్తున్నారు.

ఈ కోర్సులో పాల్గొనే వారికి ఆర్టిఫీషియల్​ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence) ​, మెషిన్​ లెర్నింగ్​, డీప్​ లెర్నింగ్ విభాగాల​పై టూల్స్​, టెక్నిక్స్​తో పాటు జూపిటర్​ నోట్‌బుక్స్​, టెన్సర్‌ఫ్లో, CUDA వంటి సాఫ్ట్‌వేర్లపై కూడా అవగాహన కల్పిస్తారు. కోర్సును విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులకు ఎన్​ఐటీ వరంగల్ ఈ-సర్టిఫికేట్ అందజేస్తుంది.

పైథాన్ ప్రోగ్రామింగ్‌లో కవర్​ అయ్యే అంశాలు..

- ఈ కొత్త ఆన్​లైన్​ కోర్సులో అనేక అంశాలపై అవగాహన కల్పిస్తారు. అవేంటో చూద్దాం.

- పైథాన్ ఉపయోగించి నంపి,​ పాండాల సాఫ్ట్​వేర్​ డిజైన్​.

- డేటా ప్రీ ప్రాసెసింగ్ అండ్​ విజువలైజేషన్.

Amazon Recruitment 2021 : అమెజాన్‌లో ఉద్యోగాలు.. అప్లికేష‌న్ ప్రాసెస్‌, ప‌రీక్ష విధానం వివ‌రాలు


- సింపుల్​ అండ్​ మల్టిపుల్​ లీనియర్ రిగ్రెషన్.

- పైథాన్​ ఇంట్రడక్షన్​, పైథాన్ ప్రోగ్రామింగ్, డేటా టైప్స్​ అండ్​ ఆపరేటర్స్​, కంట్రోల్​ ఫ్లో, ఫంక్షన్లు, స్క్రిప్టింగ్, క్లాసెస్​, రిగ్రెస్సన్​ థ్రూ గ్రేడియెంట్​ డీసెంట్​, పార్టికల్​ స్వార్మ్​ ఆప్టిమైజేషన్​, టీచింగ్ లెర్నింగ్ బేస్డ్ ఆప్టిమైజేషన్ అంశాలపై అవగాహన కల్పిస్తారు.

- మెటా హ్యూరిస్టిక్ టెక్నిక్స్ ద్వారా ఆప్టిమైజేషన్.

- డీసెంట్ టెక్నిక్ సహాయంతో లీనియర్, నాన్-లీనియర్ రిగ్రెషన్ గ్రేడియంట్, ఎన్‌ఎల్‌పి టెక్నిక్‌లను ఉపయోగించి మల్టీ లాంగ్వేజ్ మెషిన్ ట్రాన్స్‌లేషన్.

- డిసిషన్​ ట్రీ, సపోర్ట్​ వెక్టర్ రిగ్రెషన్‌ సపోర్ట్​.

- ఇంట్రడక్షన్​ టు డీప్​ లెర్నింగ్ (Deep Learning).

- ANN ఉపయోగించి పైథాన్‌ ప్రోగ్రామింగ్ ​.

- ఓపెన్ సీవీ, డీఎన్​ఎన్​ ఉపయోగించి రియల్ టైమ్ ఆబ్జెక్ట్ డిటెక్షన్ (Time Object Detection)

- పైథాన్ ఉపయోగించి టెన్సర్ ఫ్లో, కేరాస్.

- టెన్సర్ ఫ్లో, కేరాస్, డీప్ ఆర్​ఎన్​ఎన్​, బై డైరెక్షనల్ ఎల్​ఎస్​టీఎం ఉపయోగించి ఫేస్ మాస్క్ రికగ్నిషన్ సిస్టమ్.

HDFC Scholarship : రూ.75,000 స్కాల‌ర్‌షిప్ పొందే అవ‌కాశం.. ద‌ర‌ఖాస్తు వివ‌రాలు


ఎలా దరఖాస్తు చేయాలి?

ఆసక్తి గల ఫ్యాకల్టీ, రీసెర్చ్ స్కాలర్స్ (Research Scholar), ఇండస్ట్రీ ప్రొఫెషనల్స్, ఎంసీఏ, ఎంబీఏ, డిగ్రీ, పాలిటెక్నిక్ విద్యార్థులు అక్టోబర్ 24లోపు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. గూగుల్​ ఫారం (Google Form) ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తులను సమర్పించాలి. 10 రోజుల వ్యవధి గల ఈ కోర్సును అక్టోబర్ 25 నుంచి నవంబర్ 3 వరకు నిర్వహిస్తారు. ఫ్యాకల్టీ, విద్యార్థులు, రీసెర్చ్​ స్కాలర్లు రూ.1000, వర్కింగ్​ ప్రొఫెషనల్స్​ రూ.2000 కోర్సు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. మరింత సమాచారం కోసం ఎన్​ఐటీ వరంగల్​ అధికారిక వెబ్​సైట్  https://www.nitw.ac.in/ ​ను సందర్శించాలని వర్సిటీ కోరింది.

Published by:Sharath Chandra
First published:

Tags: EDUCATION, New course, Online Education, Python, Warangal

ఉత్తమ కథలు