హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

NIT Recruitment 2022: వరంగల్ NITలో 100 ఫ్యాకల్టీ ఖాళీలు.. ప్రారంభమైన దరఖాస్తులు.. ఇలా అప్లై చేసుకోండి

NIT Recruitment 2022: వరంగల్ NITలో 100 ఫ్యాకల్టీ ఖాళీలు.. ప్రారంభమైన దరఖాస్తులు.. ఇలా అప్లై చేసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

దేశంలోని ప్రముఖ విద్యాసంస్థల్లో వరంగల్ లోని నిట్ (నేషనల్ ఇనిస్ట్యూట్ ఇఫ్ టెక్నాలజీ) ఒకటన్న విషయం తెలిసిందే. ఈ పేరొందిన విద్యాసంస్థ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Vijayawada

దేశంలోని ప్రముఖ విద్యాసంస్థల్లో వరంగల్ లోని నిట్ (నేషనల్ ఇనిస్ట్యూట్ ఇఫ్ టెక్నాలజీ) ఒకటన్న విషయం తెలిసిందే. ఈ పేరొందిన విద్యాసంస్థ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. 100 ఉద్యోగాలను (NIT Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు నోటిఫికేషన్ (NIT Job Notification) విడుదల చేసింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని ప్రకటనలో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్ 27న ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకోవడానికి జనవరి 25ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేయాల్సి ఉంటుంది.

పోస్టులు:

ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ విభాగాల్లో ఖాళీలు ఉన్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు.

విభాగాలు:

మాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సివిల్, ఎలక్ట్రికల్, మెటలార్జికల్, ఎలక్ట్సానిక్స్ అండ్ కమ్యూనికేషన్, కెమికల్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ తదితర విభాగాల్లో ఖాళీలు ఉన్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు.

CRPF Recruitment 2022: సీఆర్పీఎఫ్ నుంచి మరో జాబ్ నోటిఫికేషన్ .. భారీగా ఖాళీలు.. పూర్తి వివరాలివే

విద్యార్హతల వివరాలు:

వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలను నిర్ణయించారు. పోస్టుల ఆధారంగా సంబంధిత విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో బీఏ/బీఎస్సీ/బీకామ్/బీఈ/ఎంఈ/ఎంటెక్/ఎంఎస్/ఎంఎస్సీ/పీజీ/Ph.D చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. వయస్సు 35-50 ఏళ్లు ఉండాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.

అభ్యర్థుల ఎంపిక:

మొదట దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు రాత పరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహించి అందులో అభ్యర్థులు సాధించిన మెరిట్ ఆధారంగా తుది ఎంపిక చేపడతారు.

ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే?

Step 1: అభ్యర్థులు ముందుగా ఈ డైరెక్ట్ లింక్ (https://recruit.nitw.ac.in/register/?next=/) పై క్లిక్ చేయాలి.

Step 2: అనంతరం రిజిస్టర్ చేసుకోవాలి.

Step 3: తర్వాత అప్లికేషన్ ఐడీ, పాస్వర్డ్ తో లాగిన్ అవ్వాలి.

Step 4: ఓపెన్ అయిన అప్లికేషన్ ఫామ్ లో వివరాలని నింపిన తర్వాత సబ్మిట్ పై క్లిక్ చేసి దరఖాస్తును సమర్పించాలి.

Step 5: భవిష్యత్ అవసరాల కోసం అప్లికేషన్ ఫామ్ ను భద్రపరుచుకోవాలి.

First published:

Tags: Central Government Jobs, JOBS, Nit

ఉత్తమ కథలు