• Home
  • »
  • News
  • »
  • jobs
  • »
  • NIT WARANGAL OFFERS 5 DAY ONLINE COURSE ON ARTIFICIAL INTELLIGENCE AT RS 500 HERE FULL DETAILS NS

NIT Warangal: రూ. 500కే వరంగల్ ఎన్ఐటీ నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సు.. ఇలా రిజిస్టర్ చేసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ఎన్ఐటీ వరంగల్ రూ. 500లకే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కోర్సు అందించనున్నట్లు ప్రకటించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  • Share this:
    కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ఆన్లైన్ కోర్సులకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. వివిధ ప్రముఖ విద్యా సంస్థలు సైతం ఆన్లైన్ కోర్సులను అందిస్తున్నాయి. తాజాగా దేశంలోనే ప్రముఖ విద్యా సంస్థ అయిన ఎన్ఐటీ వరంగల్(NIT Warangal) ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ అండ్ డీప్ లెర్నింగ్ అప్లికేషన్స్(Artificial Intelligence and Deep Learning Applications) కోర్సును అందిస్తోంది. ఇందు కోసం కేవలం రూ. 500లను మాత్రమే ఫీజుగా నిర్ణయించింది. అయితే కేవలం 50 సీట్లు మాత్రమే ఉన్నట్లు అధికారులు అధికారులు తెలిపారు. మొదటగా రిజిస్టర్ చేసుకున్న వారికి మాత్రమే అవకాశం ఉంటుందన్నారు. కోర్సును విజయవంతంగా పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ఈ-సర్టిఫికేట్ ను సైతం అందించనున్నారు. ఫాకల్టీ, స్టూడెంట్స్, రీసెర్చ్ స్కాలర్స్ ఎవరైనా ఈ కోర్సు కోసం అప్లై చేసుకోవచ్చు. ఐఐటీ, ఎన్ఐటీ, సెట్రల్ యూనివర్సిటీ తో పాటు USAకు చెందిన వివిధ యూనివర్సిటీలకు చెందిన నిపుణులు అభ్యర్థులకు కోర్సుపై బోధించనున్నారు. ఈ కోర్సు జులై 5న ప్రారంభం కానుండగా జులై 9 వరకు కొనసాగనుంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు జులై 4లోగా రిజిస్టర్ చేసుకోవాలని ప్రకటనలో పేర్కొన్నారు.
    ISRO online courses: ఉచితంగా ఆన్‌లైన్‌ కోర్సులను అందించనున్న ఇస్రో.. దరఖాస్తు ఎలా చేయాలంటే..
    IISc Bangalore: ఐఐఎస్సీ బెంగళూరు బంపరాఫర్​.. IOTపై ఉచిత ఆన్​లైన్​ కోర్సు

    ఐదు రోజుల పాటు కొనసాగనున్న ఈ కోర్సులో ఈ కింది టాపిక్స్ ను కవర్ చేయనున్నారు..
    1. Introduction to AI and its applications in real world.
    2. Hands on to implementation of supervised and un supervised methods.
    3. Introduction to Deep learning methods and applications
    4. CNN, RNN applications. Back Propagation.
    5. Hands on to implementation of supervised and unsupervised methods.
    Course Brochure - Direct Link

    ఎలా రిజిస్టర్ చేసుకోవాలంటే..
    అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. గూగుల్ ఫామ్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్న ఫామ్ ను cce@nitw.ac.in, raju@nitw.ac.in కు జులై 4లోగా మెయిల్ చేయాల్సి ఉంటుంది. ఏమైనా సందేహాలుంటే 9700553922, 8332969733 నంబర్లను సంప్రదించవచ్చు. cce@nitw.ac.in, raju@nitw.ac.inకు మెయిల్ చేయొచ్చు. పూర్తి వివరాలను పైన ఇచ్చిన లింక్ ద్వారా కోర్సు బ్రోచర్ ను ఓపెన్ చేసి తెలుసుకోవచ్చు.
    Published by:Nikhil Kumar S
    First published: