Home /News /jobs /

NIT SILCHAR HAS INVITED APPLICATIONS FOR THE VARIOUS NON TEACHING POSITIONS NS

NIT Silchar Recruitment 2021: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. NITలో నాన్ టీచింగ్ జాబ్స్.. ఇలా అప్లై చేయండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

నేషనల్ ఇనిస్ట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సిల్చార్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

    దేశంలోని ప్రతిష్టాత్మక యూనివర్సిటీల్లో నేషనల్ ఇనిస్ట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) ఒకటన్న విషయం తెలిసిందే. తాజాగా ఎన్ఐటీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఎన్ఐటీ సిల్చార్(NIT - Silchar)లో నాన్ టీచింగ్ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్లో అప్లై చేయాల్సి ఉంటుంది. అనంతరం అప్లికేషన్ ఫామ్ స్కానింగ్ కాపీని nfapt_21@nits.ac.inకు మెయిల్ చేయాల్సి ఉంటుంది. సబ్జెక్ట్ లో పోస్టు, అప్లికెంట్ పేరు రాయాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి జూలై 2ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అభ్యర్థులు ఆ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్లో సూచించారు.
    Online Training: డిగ్రీ చేసిన అభ్యర్థులకు గుడ్ న్యూస్.. డిజిటల్ మార్కెటింగ్ పై ఆన్లైన్లో ఉచిత శిక్షణ.. ఇలా రిజిస్టర్ చేసుకోండి
    ECIL Recruitment 2021: విశాఖపట్నం ఈసీఐఎల్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక.. వివరాలివే
    Mazagon Dock Recruitment 2021: నిరుద్యోగులకు శుభవార్త.. మజగాన్‌ డాక్‌ షిప్‌బిల్డర్స్ లో 1388 ఉద్యోగాలు.. ఇలా అప్లై చేయండి

    ఖాళీలు, విద్యార్హతల వివరాలు..
    మొత్తం 55 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఇందులో రిజిస్ట్రార్, డిప్యూటీ రిజిస్ట్రార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, లైబ్రేరియన్, మెడికల్ ఆఫీసర్, హిందీ ఆఫీసర్, జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ విభాగంలో ఒక్కో ఖాళీ చొప్పున ఉన్నాయి. సూపరింటెండెంట్ విభాగంలో 7 ఖాళీలు ఉన్నాయి. Technical Assistant / SAS Assistant / Junior Engineer విభాగాల్లో 37 ఖాళీలు ఉన్నాయి. సీనియర్ అసిస్టెంట్ విభాగంలో 4 ఖాళీలు ఉన్నాయి.
    Official Notification - Direct Link

    వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలను నిర్ణయించారు. ఆ వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు. అప్లై చేసుకున్న అభ్యర్థులను ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూకు హాజరయ్యే సమయంలో అభ్యర్థులు అప్లికేషన్ ఫామ్ తో పాటు సంబంధిత ధ్రువ పత్రాలను వెంట తీసుకురావాల్సి ఉంటుంది.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Govt Jobs 2021, Job notification, JOBS, NIT

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు