Home /News /jobs /

NIT RECRUITMENT 2021 IS BEING CONDUCTED AT NIT JALANDHAR FOR 11 POSTS ON CONTRACTUAL BASIS HERE FULL DETAILS NS

NIT Recruitment 2021: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రూ. 31 వేల వేతనంతో ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన విద్యాసంస్థల్లో నేషనల్ ఇనిస్ట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(NIT) ఒకటన్న విషయం తెలిసిందే. అయితే ఈ ప్రతిష్టాత్మక విద్యాసంస్థ ఇటీవల పలు ఉద్యోగాలను భర్తీ చేయడానికి అనేక నోటిఫికేషన్లను విడుదల చేసింది.

    దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన విద్యాసంస్థల్లో నేషనల్ ఇనిస్ట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(NIT) ఒకటన్న విషయం తెలిసిందే. అయితే ఈ ప్రతిష్టాత్మక విద్యాసంస్థ ఇటీవల పలు ఉద్యోగాలను భర్తీ చేయడానికి అనేక నోటిఫికేషన్లను విడుదల చేసింది. తాజాగా NIT జలంధర్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 11 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులు మొదట ఏడాది పాటు కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేయాల్సి ఉంటుంది. ఆ కాంట్రాక్టును మరో మూడేళ్ల పాటు పొడిగించే అవకాశం ఉంది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 18 వేల నుంచి రూ. 31 వేల వరకు వేతనం చెల్లించనున్నారు.
    ఇంటర్, డిగ్రీ, డిప్లొమా అర్హతతో ఉద్యోగాలు.. ఎల్లుండే ఇంటర్వ్యూలు.. పూర్తి వివరాలివే
    నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రూ. 25 వేల వేతనంతో ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే

    ఖాళీలు, విద్యార్హతల వివరాలు..
    -ప్రాజెక్ట్ అసోసియేట్-1 విభాగంలో మొత్తం 6 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. కంప్యూటర్ సైన్స్, ఐటీ, బయోటెక్నాలజీ, మైక్రోబయోలజీ, లైఫ్ సైన్సెస్, బయోకెమికల్, కెమికల్, మైక్రోబయోలజీ, మెకానికల్, తదితర విభాగాల్లో డిగ్రీ లేదా పీజీ చేసిన వారు దరఖాస్తుకు అర్హులు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 31 వేల పాటు చెల్లించనున్నారు. ఇతర పూర్తి వివరాలను నోటిఫికేషన్లో చూసుకోవచ్చు.
    -అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ విభాగంలో రెండు ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏదైనా విభాగంలో డిగ్రీ చేసిన వారు దరఖాస్తుకు అర్హులు. ఈ పోస్టుకు ఎంపికైన వారికి నెలకు రూ. 18 వేల పాటు వేతనం చెల్లించనున్నారు.
    Field Assistant: ఈ విభాగంలో మొత్తం 3 ఖాళీలను భర్తీ చేయనున్నారు. బీఎస్సీ లేదా ఇంజనీరింగ్ లో మూడేళ్ల డిప్లొమా కోర్సు చేసిన వారు దరఖాస్తుకు అర్హులు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 20 వేల పాటు చెల్లించనున్నారు.
    Official Notification-Direct Link

    ఎలా అప్లై చేయాలంటే..
    అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు NIT Jalandhar websiteలో ఈ నెల 25లోగా అప్లై చేయాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఆ అప్లికేషన్ల హార్డ్ కాపీలను మార్చి ఒకటి లోగా పోస్టులో పంపించాల్సి ఉంటుంది. ఇతర పూర్తి వివరాలను నోటిఫికేషన్లో చూసుకోవచ్చు.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: CAREER, Govt Jobs 2021, JOBS, NIT

    తదుపరి వార్తలు