Home /News /jobs /

NIT RECRUITMENT 2020 ONLINE APPLICATIONS INVITED FOR 93 VACANCIES SALARY UP TO RS 112400 NS

NIT Recruitment 2020: నిరుద్యోగులకు NIT శుభవార్త.. రూ. 1.12 లక్షల వేతనంతో ఉద్యోగాలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

నిరుద్యోగులకు నేషనల్ ఇనిస్ట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(NIT) శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. దాదాపు 93 పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.

    నిరుద్యోగులకు నేషనల్ ఇనిస్ట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(NIT) శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. దాదాపు 93 పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. టెక్నికల్ అసిస్టెంట్, SAS అసిస్టెంట్, జూనియర్ ఇంజినీర్, సీనియర్ టెక్నీషియన్, టెక్నీషియన్, జూనియర్, సీనియర్ అసిస్టెంట్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులు  Dr BR Ambedkar National Institute of Technology Jalandhar లో పని చేయాల్సి ఉంటుంది. పోస్టు ఆధారంగా వేతనాలు నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు. గరిష్ట వేతనం రూ. 1,12,240.

    ఎవరు దరఖాస్తు చేయాలంటే..
    Technical Assistant: ఈ కేటగిరీలో మొత్తం 23 పోస్టులను భర్తీ చేయనున్నారు. బయోటెక్నాలజీ, సివిల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇండస్ట్రీయల్ అండ్ ప్రొడక్షన్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, ఇనస్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, టెక్స్టైల్ టెక్నాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ తదితర కోర్సుల్లో బీఈ, బీటెక్, డిప్లొమా, బ్యాచలర్స్, మాస్టర్ డిగ్రీలను పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవాడానికి అర్హులు.
    Junior Engineer: ఈ కేటగిరీలో మొత్తం 3 పోస్టులను భర్తీ చేయనున్నారు. సివిల్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ బీఈ, బీటెక్, డిప్లొమోను నోటిఫికేషన్లో పేర్కొన్న సబ్జెక్టుల్లో పూర్తి చేసిన ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
    Senior Technician: మొత్తం 8 సీనియర్ టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. బీటెక్, బీఈ, డిప్లొమోలో ఫస్ట్ క్లాస్ లో పాసైన వారు దరఖాస్తు చేసుకోవాడనికి అర్హులు. మిగతా వివరాలను నోటిఫికేషన్ లో చూడొచ్చు.
    Technician: మొత్తం 26 పోస్టులను ఈ కేటగిరీలో భర్తీ చేయనున్నారు. బీఈ, బీటెక్, డిప్లొమో, బాస్టర్ డిగ్రీని నోటిఫికేషన్లో పేర్కొన్న సబ్జెక్టుల్లో పూర్తి చేసిన వారు దరఖాస్తుకు అర్హులు.
    Other Posts: జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, సీనియర్ స్టెనోగ్రాఫర్, ఆఫీస్ అటెండెంట్ తదితర విభాగాల్లో మరో 33 పోస్టులను భర్తీ చేయనున్నారు



    ఎలా దరఖాస్తు చేయాలంటే..
    ఆసక్తి కలిగిన అభ్యర్థులు NIT జలంధర్ అధికారిక వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుకు నవంబర్ 30 గడువుగా నిర్ణయించారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆరోజు అర్థరాత్రిలోగా దరఖాస్తు చేయాలి. దరఖాస్తు ఫీజుగా రూ. 500 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, PH అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.
    Official Website-Direct Link
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: JOBS, NIT

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు