Jobs: ఎన్ఐటీలో 125 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

NIT Recruitment 2020 | నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-NIT నాన్ టీచింగ్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.

news18-telugu
Updated: July 27, 2020, 5:55 PM IST
Jobs: ఎన్ఐటీలో 125 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే
Jobs: ఎన్ఐటీలో 125 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే
  • Share this:
లాక్‌డౌన్ ఆంక్షల్ని సడలించిన తర్వాత జాబ్ నోటిఫికేషన్ల సందడి మళ్లీ మొదలైంది. లాక్‌డౌన్ కారణంగా పెండింగ్‌లో పడ్డ జాబ్ నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-NIT కాలికట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 125 నాన్ టీచింగ్ పోస్టుల్ని ప్రకటించింది. ఇంజనీర్లు ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ 2020 జూలై 20న ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2020 ఆగస్ట్ 5 చివరి తేదీ. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసి అప్లికేషన్ కాపీని నోటిఫికేషన్‌లో వెల్లడించిన అడ్రస్‌కు పంపాలి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను http://www.nitc.ac.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.

SBI Jobs: డిగ్రీ అర్హతతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 3850 ఉద్యోగాలు... తెలంగాణలోనూ ఖాళీలు

Jobs: హైదరాబాద్‌లోని కేంద్ర ప్రభుత్వ సంస్థ జాబ్ నోటిఫికేషన్... 510 ఉద్యోగాలు

NIT Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఇవే...


మొత్తం ఖాళీలు- 125
దరఖాస్తు ప్రారంభం- 2020 జూలై 20
ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు చివరి తేదీ- 2020 ఆగస్ట్ 5దరఖాస్తు కాపీలు పంపడానికి- 2020 ఆగస్ట్ 21
విద్యార్హత- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలు ఉన్నాయి. పూర్తి వివరాలను నోటిఫికేషన్‌లో తెలుసుకోవచ్చు.
దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్:
Assistant Registrar (Establishment)
NIT Calicut, NIT Campus PO
Kozhikode 673601.
Published by: Santhosh Kumar S
First published: July 27, 2020, 5:53 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading