నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (National Institutes of Technology) పుదుచ్చెరిలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ పోస్టుల దరఖాస్తు చేసుకోవాలనుకొనే వారు అధికారిక వెబ్సైట్ http://nitpy.ac.in/oppurtunities/index.html ను సందర్శించి నోటిఫికేషన్ను పూర్తిగా చదివి దరఖాస్తు చేసుకోవాలి. పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అక్టోబర్ 18, 2021 వరకు అవకాశం ఉంది. ఈసీఈ, సివిల్, మెకానికల్(Mechanical), ఈఈఈ, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్,(Mathematics) ఫిజిక్స్ విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. అధ్యాపకుల ఎంపిక కాంట్రాక్టు ప్రాతిపదికన ఉంటుందని నోటిఫికేషన్లో తెలిపారు. మెరుగైన అకాడమిక్ రికార్డు ఉన్నవారు పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్(Notification)లో పేర్కొన్నారు. ఖాళీల వివరాలు, పోస్టుల అర్హతలు తెలుసుకొనేందుకు చదవండి.
అర్హతలు.. ఖాళీల వివరాలు
పోస్టు పేరు | అర్హతలు |
అసిస్టెంట్ ప్రొఫెసర్ (సివిల్) | సివిల్ ఇంజనీరింగ్ లో బీఈ, బీటెక్ చేసి ఉండాలి. స్ట్రక్చరల్, ట్రాన్స్ పోర్టేషన్, ఎన్విరాన్మెంట్ విభాగంలో ఎంటెక్ చేసి ఉండాలి. సివిల్ ఇంజనీరింగ్ (Engineering) సంబంధిత రంగంలో పీహెచ్ డీ చేసి ఉండాలి. |
అసిస్టెంట్ ప్రొఫెసర్ (ఎలక్ట్రికల్) | ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో బీఈ, బీటెక్ చేసి ఉండాలి. పవర్ సిస్టమ్, పవర్ ఎలక్ట్రానిక్స్ లో ఎంటెక్ చేసి ఉండాలి. సంబంధిత రంగంలో పీహెచ్ డీ (PhD) చేసి ఉండాలి. |
అసిస్టెంట్ ప్రొఫెసర్ (కంప్యూటర్ సైన్స్) | కంప్యూటర్ సైన్స్ రంగంలో బీటెక్(BTech) పూర్తి చేయాలి. డేలా అనలిస్ట్, కంప్యూటర్ సైన్స్ లో ఎంటెక్ చేసి ఉండాలి. సంబంధిత రంగలో పీహెచ్ డీ చేసి ఉండాలి. |
అసిస్టెంట్ ప్రొఫెసర్ (మెకానికల్) | మెకానికల్ రంగంలో బీటెక్ పూర్తి చేసి ఉండాలి. డిజైన్, థర్మల్, మ్యానిఫాక్చర్ రంగంలో ఎంటెక్ పూర్తి చేయాలి. సంబంధిత రంగలో పీహెచ్ డీ చేసి ఉండాలి. |
అసిస్టెంట్ ప్రొఫెసర్ (మ్యాథమెటిక్స్) | బీఎస్సీ మ్యాథమెటిక్స్ అండ్ ఎమ్మెస్సీ (MSc) మ్యాథమెటిక్స్, సంబంధిత రంగలో పీహెచ్ డీ చేసి ఉండాలి. |
అసిస్టెంట్ ప్రొఫెసర్ (కెమిస్ట్రీ) | బీఎస్సీ కెమిస్ట్రీ అండ్ ఎమ్మెస్సీ కెమిస్ట్రీతోపాటు సంబంధిత రంగలో పీహెచ్ డీ చేసి ఉండాలి. |
అసిస్టెంట్ ప్రొఫెసర్ (ఫిజిక్స్) | బీఎస్సీ ఫిజిక్స్ అండ్ ఎమ్మెస్సీ ఫిజిక్స్ తోపాటు సంబంధిత రంగలో పీహెచ్ డీ చేసి ఉండాలి. |
అసిస్టెంట్ ప్రొఫెసర్ (ఎలక్ట్రానిక్స్) | ఎలక్ట్రానిక్స్ లో బీటెక్ చేసి ఉండాలి. వీఎల్ఎస్, ఎంబెడెడ్, అప్లేయిడ్ ఫిజిక్స్ లో ఎంటెక్ (MTech) చేసి ఉండాలి. సంబంధిత రంగలో పీహెచ్ డీ చేసి ఉండాలి. |
ఎంపిక విధానం..
- ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక విధానం ఉంఉంది.
- దరఖాస్తు చేసుకొన్న అభ్యర్థుల అకాడమిక్, అర్హతల వివరాల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు.
- షార్ట్ లిస్ట్ చేసుకొన్న అభ్యర్థులను ఇంటర్వ్యూ (Interviews) లకు ఆహ్వానిస్తారు.
UCIL Recruitment 2021: యూసీఐఎల్లో ఉద్యోగాలు.. అర్హతలు ఇవే
దరఖాస్తు చేసుకొనే విధానం
- ముందుగా అధికారిక వెబ్సైట్ http://nitpy.ac.in/oppurtunities/index.html ను సందర్శించాలి.
- నోటిఫికేషన్ పూర్తిగా చదివి అర్హత ఉన్న పోస్టుకే దరఖాస్తు చేసుకోవాలి.
- వెబ్సైట్లో అప్లికేషన్ ఫాం డౌన్లోడ్ చేసుకొని నింపాలి.
- నింపిన అప్లికేషన్ ఫాం సాఫ్ట్ కాపీని pa-registrar@nitpy.ac.in మెయిల్ ఐడీకి పంపాలి.
- హార్డ్ కాపీలను The Registrar (i/c), NIT Puducherry – 609 609 పంపాలి.
- ఫీజు చెల్లింపు https://www.onlinesbi.com/sbicollect/icollecthome.htm పోర్టల్ ద్వారా చెల్లించి రశీదును దరఖాస్తుతోపాటు అటాచ్ చేయాలి.
- దరఖాస్తుకు చివరి తేదీ అక్టోబర్ 18, 2021
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CAREER, Government jobs, Govt Jobs 2021, Job notification, JOBS