Home /News /jobs /

NIT JAMSHEDPUR ENGINEERING CAN BE COMPLETED ANYTIME WITHIN 8 YEARS JAMSHEDPUR NIT NEW PROPOSAL GH VB

NIT Jamshedpur: 8 ఏళ్లలోపు ఎప్పుడైనా ఇంజనీరింగ్ పూర్తి చేయవచ్చు.. జంషెడ్‌పూర్ ఎన్‌ఐటీ కొత్త ప్రతిపాదన..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT), జంషెడ్‌పూర్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరి మధ్యలో వదిలేసినా.. ఎనిమిదేళ్ల వ్యవధి ముగిసేలోపు ఎప్పుడైనా కోర్సు కొనసాగించడానికి తమ విద్యార్థులకు అనుమతించాలని నిర్ణయించింది.

ఇంకా చదవండి ...
ఉన్నత విద్యాసంస్థలు పరిస్థితుల అనుగుణంగా మార్పులు చేర్పులు చేసుకుంటున్నాయి. విద్యార్థులకు సౌకర్యవంతంగా ఉండేందుకు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT), జంషెడ్‌పూర్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇంజనీరింగ్(Engineering) కోర్సుల్లో చేరి మధ్యలో వదిలేసినా.. ఎనిమిదేళ్ల వ్యవధి ముగిసేలోపు ఎప్పుడైనా కోర్సు(Course) కొనసాగించడానికి తమ విద్యార్థులకు అనుమతించాలని నిర్ణయించింది. చాలా మంది విద్యార్థులు ఇతర ప్రొఫెషనల్ డిగ్రీని(Professional Degree) చదవాలనుకోవడం లేదా వివిధ కారణాలతో తమ చదువును ఆపివేయాలని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నిట్(NIT) ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

దీంతో విద్యార్థులు తమ చదువును మధ్యలో వదిలేసినప్పటికీ వారికి ఎటువంటి నష్టం ఉండదు. ఇంజనీరింగ్ పూర్తి చేయడానికి వారు ఏ సమయంలోనైనా NITకి తిరిగి రావచ్చు. అయితే ఇక్కడ ఓ నిబంధన విధించింది. నిట్‌లో కనీంలో రెండేళ్ల పాటు చదువు పూర్తిచేసిన తరువాతనే ఇన్‌స్టిట్యూట్ నుంచి నిష్ర్కమించడానికి అర్హత సాధిస్తారు.

Imran Khan : పాక్ లో కొత్త పరిణామం..ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ కు రంగం సిద్ధం!

Livehindustan.com ప్రకారం.. యూనివర్సిటీల్లో తమ రెండేళ్ల చదువు పూర్తి చేసిన తర్వాతనే విద్యార్థులకు ‘వర్చువల్ అకడమిక్ క్రెడిట్ బ్యాంక్’లో రెండు సంవత్సరాల అధ్యయనానికి ‘అకడమిక్ పాయింట్లు’ క్రెడిట్ కానున్నాయి. ఆ తరువాత విద్యార్థులు తమకు నచ్చిన ఇతర ఇన్‌స్టిట్యూట్‌లో వేరే కోర్సు చేయడానికి నమోదు చేసుకోవచ్చు. భవిష్యత్తులో ఈ విద్యార్థులు తమ కోర్సును పూర్తి చేయడానికి NITకి తిరిగి వచ్చే అవకాశం ఉంది. కాగా, గతంలో ఇంజినీరింగ్‌ చదివి మూడేళ్లు మధ్యలో వదిలేస్తే మొత్తం అడ్మిషన్‌ రద్దయ్యే పరిస్థితి ఉండేది. ఇక ఈ పద్దతి అమల్లోకి వస్తే, అడ్మిషన్ రద్దయ్యే అవకాశం ఉండదు.

ఇటీవల NIT సెనేట్ 38వ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి డాక్టర్ కెకె శుక్లా అధ్యక్షత వహించారు. సభలో ప్రవేశపెట్టిన ఈ కొత్త తీర్మానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. అయితే బోర్డ్ ఆఫ్ స్టడీస్ (BOS)లో చర్చించిన తర్వాత దీన్ని అమలు చేయాలని తీర్మానించారు. అయితే ఈ కొత్త పద్ధతి ఒకేసారి అమలు చేయడం లేదని, దశలవారీగా అమలు చేయనున్నట్లు సమాచారం.

ఇది ఇలా ఉంటే మరోపక్క జేవియర్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (XLRI) జంషెడ్‌పూర్, ఫైనాన్స్‌‌లో రెండేళ్ల పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ప్రోగ్రామ్‌(PGDF)ను ప్రారంభించింది. దీన్ని ఆన్‌లైన్ మోడ్‌లో నిర్వహించనుంది. ఫైనాన్స్, మేనేజిరియల్ నైపుణ్యాలతో కెరీర్‌ను డెవలప్ చేసుకోవడంపై ఆసక్తి ఉన్న నిపుణులకు ఈ ప్రోగ్రామ్ చేపడుతున్నట్లు సంస్థ పేర్కొంది.

కోర్సు ప్రణాళికలో భాగంగా ఫైనాన్స్‌లో... సమ్మర్ ఇంటర్న్‌షిప్, పరిశ్రమ లీడర్ల వర్క్‌షాప్ సెషన్‌లు, క్యాప్‌స్టోన్ ప్రాజెక్ట్, అనుకరణ-ఆధారిత ట్రేడింగ్, వాల్యుయేషన్ మాడ్యూల్స్‌లలో 32 ఫౌండేషన్ అధునాతన స్థాయి కోర్సులు ఉన్నాయి. ఫిన్‌టెక్, డిజిటల్ ఫైనాన్స్, డేటా సైన్స్, ఫైనాన్స్‌కు వర్తించే మెషీన్ లెర్నింగ్ టూల్స్ డెవలప్‌మెంట్‌పై విద్యార్థులు లోతైన అవగాహనను పొందుతారని XLRI, జంషెడ్‌పూర్ తెలిపింది.

తరగతులను వారాంతాల్లో నిర్వహించనున్నారు. వర్కింగ్ డే తరువాత రోజు సాయంత్రం వీక్షించడానికి సెషన్‌ను రికార్డిండ్ చేసుకునే సదుపాయం కూడా కల్పించారు. ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంలో కొనసాగుతూనే ఈ ప్రోగ్రామ్‌లో పాల్గొనవచ్చు. ఈ కోర్సును ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నందున విద్యార్థులు ఎక్కడి నుంచైనా పాల్గొనవచ్చు.
Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, JOBS, Nit, Students

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు