నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT), ఆంధ్రప్రదేశ్ నానో మెటీరియల్స్ ఫర్ వాటర్ ట్రీట్మెంట్ అనే షార్ట్‌టర్మ్ ఆన్లైన్ కోర్సును ప్రారంభించింది. సివిల్ ఇంజనీరింగ్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, బయోకెమికల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్న విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, ఆర్ అండ్ డీ రీసెర్చ్, ప్రైవేట్ సంస్థలతో సహా ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న పరిశోధకులు, రిస్క్ అసెస్మెంట్పై ఆసక్తి గల ఇంజనీరింగ్, లైఫ్ సైన్సెస్ విభాగాల ఫ్యాకల్టీ సభ్యులు కూడా ఈ ఆన్లైన్ కోర్సులో చేరవచ్చు. ఈ కోర్సుకు గ్లోబల్ ఇనిషియేటివ్ ఫర్ అకడమిక్ నెట్వర్క్స్ (GIAN), కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ స్పాన్సర్ చేస్తుంది.
ఈ కోర్సు నానో మెటీరియల్స్, ప్రాపర్టీస్, వాటి క్యారెక్టరైజేషన్ టెక్నిక్‌లపై దృష్టి సారిస్తుంది. ఇది నీటిలో నానో మెటీరియల్స్ ఇంటరాక్షన్, వాటి ట్రాన్స్పోర్ట్ మెకానిజం, వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్, ఆక్సిడేషన్ ప్రాసెస్‌పై అవగాహన కల్పిస్తుంది. ‘‘నీరు జీవితానికి అమృతం లాంటింది. అయితే, నాణ్యమైన నీటిని పొందడం అనేది భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పెద్ద సవాలుగా మారింది. అందకే, భారత ప్రభుత్వం 2024 నాటికి ప్రతి ఇంటికి శుద్దమైన నీటిని అందించే లక్ష్యంతో 'జల శక్తి మిషన్'ను ప్రారంభించింది. అదేవిధంగా, ప్రతి ఇంటికి నాణ్యమైన నీరు అందించేలా తెలంగాణ ప్రభుత్వం 'మిషన్ భగీరథ'ను చేపట్టింది.
భారత ప్రభుత్వం కూడా తక్కువ ఖర్చుతో కూడిన నీటి శుద్ధి సాంకేతికత కోసం పరిశోధనలను ప్రోత్సహిస్తుంది. ప్రస్తుతం వడపోత, ఆక్సీకరణ, అధిశోషణం వంటి వివిధ సంప్రదాయ పద్ధతుల ద్వారా నీటిని శుద్ది చేస్తున్నాం. ఈ విధానంలో మార్పు తేవాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుంది.’’ అని నిట్ ఆంధ్ర ప్రదేశ్ డైరెక్టర్ ప్రొఫెసర్ సీఎస్పీ రావు చెప్పారు.
“కోర్సు ప్రధానంగా నానో మెటీరియల్స్, ప్రాపర్టీస్, క్యారెక్టరైజేషన్ టెక్నిక్‌లపై దృష్టి పెడుతుంది. దీనితో పాటు నీటిలో నానో మెటీరియల్స్ ఇంటరాక్షన్, ట్రాన్స్పోర్ట్ మెకానిజంను కవర్ చేస్తుంది. కోర్సు చివరి సెషన్లో నీరు, మురుగునీటి శుద్ధిలో నానో మెటీరియల్స్ అప్లికేషన్ గురించి వివరిస్తారు. ఆక్సీకరణ ప్రక్రియ పాత్ర గురించి కూడా చర్చిస్తారు.” అని నిట్ ఏపీ సివిల్ ఇంజనీరింగ్ విభాగం హెచ్ఓడీ డాక్టర్ బరణీధరన్ అన్నారు. వివిధ పర్యావరణ పరిస్థితుల్లో నానోమెటీరియల్స్ ఎలా ప్రవర్తిస్తాయో అర్థం చేసుకోవడం, నీటి శుద్ధిలో నానోమెటీరియల్స్ అప్లికేషన్, సంప్రదాయ ప్రక్రియలతో పోలిస్తే దీనితో ఉన్న ప్రయోజనాలు, నానోమెటీరియల్స్ ఆక్సీకరణ ప్రక్రియ, మురుగునీరు, పారిశ్రామిక జలాల్లో నానోమోటీరియల్స్ అప్లికేషన్‌పై అవగాహన కల్పించడమే ఈ కోర్సు ముఖ్య ఉద్దేశం.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.