హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

NIT Agarthala: ఎన్ఐటీ అగర్తలాలో నాన్ టీచింగ్ ఉద్యోగాలు.. అర్హ‌త‌లు ఇవే

NIT Agarthala: ఎన్ఐటీ అగర్తలాలో నాన్ టీచింగ్ ఉద్యోగాలు.. అర్హ‌త‌లు ఇవే

ఎన్ఐటీ అగర్త‌

ఎన్ఐటీ అగర్త‌

నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ ( National Institute of Technology) అగ‌ర్త‌లో ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఈ నోటిఫికేష‌న్ (Notification) ద్వారా గ్రూప్‌-ఏ విభాగంలో ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. కేవలం ఇంటర్వ్యూ(Interview) ద్వారానే అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

ఇంకా చదవండి ...

నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ ( National Institute of Technology) అగర్తలాలో ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఈ నోటిఫికేష‌న్ (Notification) ద్వారా గ్రూప్‌-ఏ విభాగంలో ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ పోస్టుల సెప్టెంబ‌ర్ 30, 2021 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకొనే అవ‌కాశం ఉంది. డిప్యూటీ రిజిస్ట్రార్‌, డిప్యూటీ లైబ్రేరియ‌న్‌, అసిస్టెంట్ రిజిస్ట్రార్‌, అసిస్టెంట్ లైబ్రేరియ‌న్‌, ఎగ్జిక్యూటీవ్ ఇంజ‌నీర్‌, సీనియ‌ర్ మెడిక‌ల్ ఆఫీస‌ర్ త‌దిత‌ర పోస్టులు భ‌ర్తీ చేయ‌నున్నారు. ద‌ర‌ఖాస్తు చేసుకోనే అభ్య‌ర్థులు అధికారికి నోటిఫికేష‌న్‌ను చూడాలి. ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి ప‌రీక్ష ఫీజు రూ.1000 ఉంది. ఎస్సీ/ ఎస్టీ అభ్య‌ర్థులకు రూ.500 చెల్లిస్తే స‌రిపోతుంది. పూర్తి అర్హ‌త‌లు వివ‌రాలు ఇలా ఉన్నాయి.  అభ్యర్థులను  ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.

అర్హతలు.. ఖాళీల సమాచారం

పోస్టు పేరుఅర్హతలుఖాళీలు
డిప్యూటీ రిజిస్ట్రార్55శాతం మార్కులతో ఏదైనా విభాగంలో మాస్టర్ డిగ్రీ చేసి ఉండాలి. అంతే కాకుండా  విద్యారంగం అడ్మినిస్ట్రేషన్(Administration)లో మూడు సంవత్సరాలు, బోధనా రంగంలో తొమ్మిది సంవత్సరాల అనుభవం ఉండాలి.  లేదా ఐదు సంవత్సరాలు విద్యారంగం అడ్మినిస్ట్రేషన్లో పని చేసిన అనుభవం ఉండాలి. వయసు 50 ఏళ్లు మించి ఉండకూడదు.04
డిప్యూటీ లైబ్రేరియన్6.5జీపీఏ లేదా 60 శాతం మార్కులతో లైబ్రేరియన్ సైన్స్ లో మాస్టర్ డిగ్రీ చేసి ఉండాలి. నెట్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.  ఐదు సంవత్సరాల అనుభవం ఉండాలి. వయసు 50 ఏళ్లు మించి ఉండకూడదు.01
అసిస్టెంట్ రిజిస్ట్రార్55శాతం మార్కులతో ేఏదైనా విభాగంలో మాస్టర్ డిగ్రీ చేసి ఉండాలి.  లేదా ప్రైవేటు రంగంలో సూపరింటెండెంట్ గా పని చేసి అనుభవం(Experience) ఉండాలి.  వయసు 35  ఏళ్లకు మించి ఉండకూడదు.02
అసిస్టెంట్ లైబ్రేరియన్6.5జీపీఏ లేదా 60 శాతం మార్కుల(Marks)తో లైబ్రేరియన్ సైన్స్ లో మాస్టర్ డిగ్రీ చేసి ఉండాలి. నెట్(Net) ఉత్తీర్ణత సాధించి ఉండాలి.   వయసు 35 ఏళ్లు మించి ఉండకూడదు.01
ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ (సివిల్)సివల్, ఎలక్ట్రికల్  విభాగంలో బీఈ లేదా బీటెక్(BTech) చేసి ఉండాలి. మెరుగైన అకాడమిక్(Academic) రికార్డు ఉండాలి. వయసు 35  ఏళ్లు మించి ఉండకూడదు.01
సీనియర్ మెడికల్  ఆఫీసర్ఎంబీబీఎస్ చదివి పది సంవత్సరాల పని అనుభవం ఉండాలి. లేదా పోస్టుగ్రాడ్యుయేట్ మెడికల్(Medical) లో ఎండీ చేసి  ఐదు సంవత్సాల పని అనుభవం ఉండాలి. వయసు 50  ఏళ్లు మించి ఉండకూడదు.01
మెడికల్ ఆఫీసర్ఎంబీబీఎస్ లేదా పోస్టుగ్రాడ్యుయేట్ (Post Graduate) మెడికల్ లో ఎండీ  చేసి ఉండాలి వయసు 35 సంవత్సరాలు మించి ఉండకూడదు.02
ఎస్ఏఎస్  ఆఫీసర్60శాతం మార్కులతో ఫిజికల్(Physical) విభాగంలో మాస్టర్ డిగ్రీ చేసి ఉండాలి వయసు 35  ఏళ్లు మించి ఉండకూడదు.02
సైన్టిఫిక్ టెక్నికల్ ఆఫీసర్ ఫస్ట్ క్లాస్(First Class) మార్కులతో బీఈ/ బీటెక్/  ఎమ్మెస్సీ /  ఎంసీఏ పాసై ఉండాలి.03


ఎంపిక విధానం..

- ఇంట‌ర్వ్యూ ద్వారా అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తారు.

- ద‌ర‌ఖాస్తు చేసుకొన్న అభ్య‌ర్థుల‌ను అక‌డామిక్, వృత్తి అనుభ‌వం ఆధారంగా ఎంపిక చేస్తారు.

- ఎంపికైన అభ్య‌ర్థులు ఇంట‌ర్వ్యూకి హాజ‌రుకావాల్సి ఉంటుంది.

- ఇంట‌ర్వ్యూ(Interview) కు హాజ‌రయ్యే అభ్య‌ర్థుల‌కు ఎటువంటి టీఏ/డీఏ(TA/DA) చెల్లించ‌రు. అభ్య‌ర్థులు సొంత ఖ‌ర్చుల‌తో హాజ‌రు అవ్వాలి.

MG University: న‌ల్గొండ మ‌హాత్మాగాంధీ యూనిర్సిటీలో ఉద్యోగాలు


ద‌ర‌ఖాస్తు చేసుకొనే విధానం..

- ముందుగా అభ్య‌ర్థులు అధికారిక నోటిఫికేష‌న్ చ‌ద‌వాలి (నోటిఫికేష‌న్ కోసం క్లిక్ చేయండి)

- అనంత‌రం ద‌ర‌ఖాస్తు కోసం https://mis.nita.ac.in/recruitment/ వెబ్‌సైట్‌కు వెళ్లాలి.

- అక్క‌డ మీ మెయిల్ ఐడీ, మొబైల్ నంబ‌ర్(Mobile Number) ద్వారా రిజిస్ట‌ర్ చేసుకోవాలి.

- అనంత‌రం మీరు ఏ పోస్టుకు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌నుకొంటున్నారో ఆ పోస్టుకు ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

- ద‌ర‌ఖాస్తు అనంత‌రం ఓ అప్లికేష‌న్(Application) హార్డు కాపీని మీ వ‌ద్ద దాచుకోవాలి.

- ద‌ర‌ఖాస్తు రుసం రూ.1000, ఎస్సీ ఎస్టీ అభ్య‌ర్థులు రూ.500 చెల్లించాలి.

- అప్లే చేసుకోవ‌డానికి ఆఖ‌రు తేదీ(Last Date) సెప్టెంబ‌ర్ 30, 2021

First published:

Tags: CAREER, Government jobs, Govt Jobs 2021, Job notification, JOBS