NISER Recruitment 2021: కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

NISER Recruitment 2021: కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే (ప్రతీకాత్మక చిత్రం)

NISER Recruitment 2021 | నిరుద్యోగులకు శుభవార్త. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్-NISER పలు ఖాళీలను భర్తీ చేస్తోంది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.

  • Share this:
    ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్-NISER ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సైంటిఫిక్ ఆఫీసర్ డీ, సైంటిఫిక్ ఆఫీసర్ సీ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. సెంటర్ ఫర్ మెడికల్ అండ్ రేడియేషన్ ఫిజిక్స్‌లో ఈ పోస్టులున్నాయి. మెడికల్ ఫిజిక్స్, ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్ లాంటి విభాగాల్లో మొత్తం 6 ఖాళీలున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లై చేయడానికి 2021 జూన్ 10 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ అధికారిక వెబ్‌సైట్ https://www.niser.ac.in/ లో తెలుసుకోవచ్చు. అభ్యర్థులు దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతలు తెలుసుకోవాలి.

    NISER Recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే...


    సైంటిఫిక్ ఆఫీసర్ డీ (మెడికల్ ఫిజిక్స్)- 1
    సైంటిఫిక్ ఆఫీసర్ డీ (ఫిజిక్స్)- 3
    సైంటిఫిక్ ఆఫీసర్ సీ (ఎలక్ట్రానిక్స్)- 1
    సైంటిఫిక్ ఆఫీసర్ సీ (రేడియేషన్ బయాలజీ, మెడికల్ ఫిజిక్స్, న్యూక్లియర్ మెడిసిన్)- 1

    TS Inter Admissions 2021: ఇంటర్ అడ్మిషన్లకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు... ఎలా అప్లై చేయాలంటే

    COVID-19 Online Courses: కరోనా పుట్టుక నుంచి చికిత్స వరకు... అన్ని అంశాలపై ఆన్​లైన్ కోర్సులు

    NISER Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


    దరఖాస్తుకు చివరి తేదీ- 2021 జూన్ 10
    విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. సంబంధిత సబ్జెక్ట్‌లో పీహెచ్‌డీ, బీఈ, బీటెక్ పాస్ అయినవారు అప్లై చేయొచ్చు.
    ఎంపిక విధానం- దరఖాస్తుల షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ
    వయస్సు- సైంటిఫిక్ ఆఫీసర్ డీ పోస్టుకు 40 ఏళ్లు, సైంటిఫిక్ ఆఫీసర్ సీ పోస్టుకు 36 ఏళ్లు

    Railway Jobs 2021: రైల్వేలో 3378 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

    UGC Online Courses: స్వయం పోర్టల్‌లో ఈ 123 యూజీ, పీజీ ఆన్‌లైన్ కోర్సులు ఉచితం

    NISER Recruitment 2021: దరఖాస్తు విధానం ఇదే


    అభ్యర్థులు ముందుగా https://www.niser.ac.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
    ఆ తర్వాత vacancies లింక్ పైన క్లిక్ చేయాలి.
    కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో Scientific Officer - C & D నోటిఫికేషన్ ఉంటుంది.
    Apply Online పైన క్లిక్ చేస్తే కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
    START REGISTRATION పైన క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేయాలి.
    ఆ తర్వాత దరఖాస్తు ఫామ్ పూర్తి చేయాలి.
    అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి.
    Published by:Santhosh Kumar S
    First published: