హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

NIRF Ranking 2022: ఎన్‌ఐ‌ఆర్‌ఎఫ్ ర్యాకింగ్స్ విడుదల.. టాప్ 25 మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్స్ ఇవే..

NIRF Ranking 2022: ఎన్‌ఐ‌ఆర్‌ఎఫ్ ర్యాకింగ్స్ విడుదల.. టాప్ 25 మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్స్ ఇవే..

NIRF Ranking 2022: ఎన్‌ఐ‌ఆర్‌ఎఫ్ ర్యాకింగ్స్ విడుదల.. టాప్ 25 మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్స్ ఇవే..

NIRF Ranking 2022: ఎన్‌ఐ‌ఆర్‌ఎఫ్ ర్యాకింగ్స్ విడుదల.. టాప్ 25 మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్స్ ఇవే..

దేశంలో ఎక్కువ మంది పోటీపడే పరీక్షల్లో కామన్ అడ్మిషన్ టెస్ట్(CAT) ఒకటి. ఈ ప్రవేశపరీక్ష ద్వారా బిజినెస్ స్కూల్స్‌లో ప్రవేశాలు కల్పిస్తారు. క్యాట్-2022 పరీక్ష నవంబర్ 27న జరిగింది. దీంతో విద్యార్థులు ఎంబీఏ కోసం బెస్ట్ మేనేజ్‌మెంట్ కాలేజీలను వెతికే పనిలో పడ్డారు .

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Telangana, India

దేశంలో ఎక్కువ మంది పోటీపడే పరీక్షల్లో కామన్ అడ్మిషన్ టెస్ట్(CAT) ఒకటి. ఈ ప్రవేశపరీక్ష ద్వారా బిజినెస్ స్కూల్స్‌లో ప్రవేశాలు కల్పిస్తారు. క్యాట్-2022 పరీక్ష నవంబర్ 27న జరిగింది. దీంతో విద్యార్థులు ఎంబీఏ కోసం బెస్ట్ మేనేజ్‌మెంట్ కాలేజీలను వెతికే పనిలో పడ్డారు.NIRF(నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్) ర్యాంకింగ్స్-2022 ప్రకారం.. దేశంలోనే టాప్ మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్‌గా.. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్,అహ్మదాబాద్(IIM Ahmedabad) నిలిచింది. 2019 వరకు టాప్ మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్‌గా ఐఐఎం బెంగళూరు గుర్తింపు పొందింది. ఆ తరువాత 2020 నుంచి వరుసగా ఏటా ఐఐఎం అహ్మదాబాద్‌ మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంటూ వస్తోంది. ఈసారి ఐఐఎం బెంగళూరు రెండో స్థానంలో నిలిచింది. ఐఐటీ ఢిల్లీ నాలుగో స్థానంలో నిలువగా, ఐఐఎం కోల్‌కత్తా మూడో ర్యాంక్ సొంతం చేసుకుంది.

 NIRF-2022 ర్యాకింగ్ ప్రకారం టాప్-25 మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్స్

టాప్‌ 5 ర్యాంకులలో వరుసగా.. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్- అహ్మదాబాద్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్- బెంగళూరు, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్- కోల్‌కత్తా, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ- ఢిల్లీ , ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్- కోజికోడ్ సొంతం చేసుకున్నాయి.

6 నుంచి 10 ర్యాంకులను వరుసగా.. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్- లక్నో, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్- ఇండోర్, XLRI - జేవియర్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్-జంషెడ్ పూర్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్- ముంబై, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ- మద్రాస్ కైవసం చేసుకున్నాయి.

CTET 2022: ఓపెన్‌ అయిన సీటెట్-2022 కరెక్షన్ విండో.. అప్లికేషన్‌లో ఛేంజెస్‌ చేసుకునే అవకాశం..

11వ ర్యాంక్‌ నుంచి 20వ ర్యాంక్‌ వరకు వరుసగా.. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-బొంబాయి, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ- ఖరగ్‌పూర్, మేనేజ్‌మెంట్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్-గుర్గావ్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్- రాయ్‌పూర్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్- రాంచీ, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్- రోహ్‌తక్, సింబయాసిస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్‌మెంట్-పూణే, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్- తిరుచిరాపల్లి, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ- రూర్కీ, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ- కాన్పూర్ నిలిచాయి.

21వ ర్యాంక్‌ నుంచి 25వ ర్యాంక్‌ వరకు వరుసగా.. P.జైన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ & రీసెర్చ్-ముంబై, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్-ఉదయపూర్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్- కాశీపూర్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్-న్యూ ఢిల్లీ, SVKM నర్సీ మోంజీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్- ముంబై సొంతం చేసుకున్నాయి.

కొన్ని బి- స్కూల్స్‌లో ఇంటర్‌తో ప్రవేశం

దేశంలోని టాప్ మేనేజ్‌మెంట్ కాలేజీల పూర్తి జాబితాను NIRF అధికారిక సైట్‌ nirfindia.org ద్వారా చెక్ చేసుకోవచ్చు. దేశంలోని కొన్ని బిజినెస్ స్కూల్స్‌ల్లో క్యాట్‌తో సంబంధం లేకుండా ప్రవేశం పొందవచ్చు. కొన్ని బి- స్కూల్స్ 12వ తరగతి పూర్తి చేసిన విద్యార్థుల కోసం ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్ (IPM)ను కూడా అందిస్తున్నాయి. ఐదేళ్ల పాటు ఈ కోర్సులను చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అభ్యర్థులు రెండు డిగ్రీలను పొందడానికి అవకాశం ఉంటుంది. మేనేజ్‌మెంట్‌లో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సు ద్వారా BBA ప్లస్ MBA డిగ్రీని కూడా పూర్తిచేయవచ్చు.

First published:

Tags: Colleges, JOBS, Nirf

ఉత్తమ కథలు