Home /News /jobs /

NIRF 2022 LIST OF TOP DENTAL COLLEGES TO APPLY FOR AFTER NEET UMG GH

Dental College: నీట్ క్వాలిఫై తర్వాత విద్యార్థులు ఈ కాలేజీలు చూడండీ.. ఇండియా టాప్ ఇవే..!

డెంటల్ కాలేజీలో చేరాలా..?

డెంటల్ కాలేజీలో చేరాలా..?

భారతదేశంలోని విద్యాసంస్థలకు సంబంధించిన NIRF ర్యాంకింగ్‌లను మానవ వనరుల అభివృద్ధి శాఖ (MHRD) శుక్రవారం విడుదల చేసింది. ఈ సంవత్సరం ర్యాంకింగ్ ప్రకారం.. ఇండియాలో టాప్ డెంటల్ కాలేజీలు ఏవో చూద్దాం.

మెడికల్, డెంటల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ NEET ఈ ఆదివారం ముగిసింది. దీంతో విద్యార్థులు టాప్ కాలేజీలకు అప్లై చేసుకోవడంపై దృష్టి పెడుతున్నారు. అయితే BDS కోర్సులు లేదా డెంటల్ స్టడీస్ విభాగాల్లో అడ్మిషన్ పొందాలనుకునే వారికి ఈ ప్రక్రియ కొంతమేరకు సులభం కానుంది. కేంద్ర విద్యా శాఖ ఈ ఇన్‌స్టిట్యూట్స్‌ ర్యాంకింగ్స్‌ను ఇటీవల విడుదల చేసింది. బోధన, పరిశోధన, ఇతర ప్యారమీటర్స్‌తో ఇండియాలోని కాలేజీలను వడపోసి ఈ ర్యాంకింగ్స్ అందించారు. భారతదేశంలోని విద్యాసంస్థలకు సంబంధించిన NIRF ర్యాంకింగ్‌లను మానవ వనరుల అభివృద్ధి శాఖ (MHRD) శుక్రవారం విడుదల చేసింది. ఈ సంవత్సరం ర్యాంకింగ్ ప్రకారం.. ఇండియాలో టాప్ డెంటల్ కాలేజీలు ఏవో చూద్దాం.

* NIRF ర్యాంకింగ్ 2022 ప్రకారం.. ఇండియాలో టాప్ 20 డెంటల్ కాలేజీలు

ర్యాంక్ 1: సవీంత ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ టెక్నికల్ సైన్స్, చెన్నై

ర్యాంక్ 2: మణిపాల్ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్, మణిపాల్

ర్యాంక్ 3: డాక్టర్ D.Y పాటిల్ విద్యాపీఠ్, పూణే

ర్యాంక్ 4: మౌలానా ఆజాద్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్

ర్యాంక్ 5: కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ

ర్యాంక్ 6: A.B.శెట్టి మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్

ర్యాంక్ 7: మణిపాల్ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్, మంగళూరు

రాక్ 8: SRM డెంటల్ కాలేజ్

ర్యాంక్ 9: ప్రభుత్వ డెంటల్ కాలేజ్, నాగ్‌పూర్

ర్యాంక్ 10: శిక్ష `ఓ` అనుసంధన్

ర్యాంక్ 11: దత్తా మేఘే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్

ర్యాంక్ 12: JSS డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్

ర్యాంక్ 13: శ్రీ రామచంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్

ర్యాంక్ 14: M.S. రామయ్య యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ సైన్సెస్

ర్యాంక్ 15: పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్

ర్యాంక్ 16: జామియా మిలియా ఇస్లామియా, న్యూఢిల్లీ

ర్యాంక్ 17: నాయర్ హాస్పిటల్ డెంటల్ కాలేజ్

ర్యాంక్ 18: గవర్నమెంట్ డెంటల్ కాలేజ్, బెంగళూరు

ర్యాంక్ 19: అమృత విశ్వ విద్యాపీఠం

ర్యాంక్ 20: SDM కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ & హాస్పిటల్



కాగా, ‘ఫార్మసీ’ విభాగంలో న్యూఢిల్లీలోని జామియా హమ్‌దార్ద్‌ టాప్ ప్లేస్‌లో నిలిచింది. పరిశోధన విభాగంలో బెంగళూరులోని ఐఐఎస్సీ అగ్రస్థానంలో ఉండగా, ఐఐటీ మద్రాస్, ఐఐటీ ఢిల్లీ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ అండర్ గ్రాడ్యుయేట్ (NEET UG) జులై 17న జరిగింది. NEET 2022 గత సంవత్సరం కంటే ఎక్కువ కఠినంగా ఉన్నట్టు విద్యార్థులు, నిపుణులు చెబుతున్నారు. అన్ని విభాగాలలో సబ్జెక్టులపై లోతైన అవగాహన అవసరమయ్యే ప్రశ్నలు ఉన్నాయి. ఈ సంవత్సరం ఎగ్జామ్‌కు టైమ్ లిమిట్‌ను పెంచారు. 20 నిమిషాలు అదనంగా ఇచనప్పటికీ, టైమ్ తీసుకునే స్టేట్‌మెంట్-బేస్డ్ ప్రశ్నల సంఖ్య పెరిగింది. ఎగ్జామ్ రిజల్ట్ కోసం విద్యార్థులు ఎదురుచూస్తున్నారు.
Published by:Mahesh
First published:

Tags: Dental care, JOBS, Medicine, NEET 2022

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు