NIRDPR RECRUITMENT 2022 NATIONAL INSTITUTE OF RURAL DEVELOPMENT AND PANCHAYATI RAJ HYDERABAD RELEASED JOB NOTIFICATION FOR VARIOUS VACANCIES SS
NIRDPR Recruitment 2022: హైదరాబాద్‌లోని కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు
NIRDPR Recruitment 2022: హైదరాబాద్‌లోని కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు
(ప్రతీకాత్మక చిత్రం)
NIRDPR Recruitment 2022 | హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ (NIRD&PR) పలు ఖాళీలను భర్తీ చేస్తోంది. ఈ జాబ్ నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.
కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖకు చెందిన స్వయంప్రతిపత్తిగల సంస్థ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ (NIRD&PR) ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. రీసెర్చ్ అసోసియేట్, డేటా అనలిస్ట్, ప్రాజెక్ట్ అసోసియేట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఖాళీల సంఖ్య వెల్లడించలేదు. హైదరాబాద్‌తోపాటు గువాహతిలో ఈ పోస్టులు ఉన్నాయి. ఇవి ఒక ఏడాది గడువు ఉన్న కాంట్రాక్ట్ పోస్టులు మాత్రమే. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2022 జనవరి 26 చివరి తేదీ. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేయాలి. వేర్వేరు పోస్టులకు వేర్వేరు దరఖాస్తు లింక్స్ ఉన్నాయి. ఖాళీల వివరాలు, దరఖాస్తు విధానం గురించి తెలుసుకోండి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.