Jobs: హైదరాబాద్‌లోని కేంద్ర ప్రభుత్వ సంస్థ జాబ్ నోటిఫికేషన్... 510 ఉద్యోగాలు

NIRDPR Recruitment 2020 | నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీరాజ్-NIRDPR ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఖాళీల వివరాలు తెలుసుకోండి.

news18-telugu
Updated: July 27, 2020, 11:15 AM IST
Jobs: హైదరాబాద్‌లోని కేంద్ర ప్రభుత్వ సంస్థ జాబ్ నోటిఫికేషన్... 510 ఉద్యోగాలు
Jobs: హైదరాబాద్‌లోని కేంద్ర ప్రభుత్వ సంస్థ జాబ్ నోటిఫికేషన్... 510 ఉద్యోగాలు (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీరాజ్-NIRDPR భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 510 ఖాళీలను ప్రకటించింది. స్టేట్ ప్రోగ్రామ్ కో-ఆర్డినేటర్, యంగ్ ఫెలోస్, క్లస్టర్ లెవెల్ రీసోర్స్ పర్సన్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. డిగ్రీ, పీజీ పూర్తిచేసినవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయొచ్చు. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 250 క్లర్టర్స్‌లో వీరిని నియమించనుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా ఖాళీల భర్తీ ఉంటుంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2020 ఆగస్ట్ 10 చివరి తేదీ. ఆసక్తిన గల అభ్యర్థులు ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను http://nirdpr.org.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.

SBI Jobs: డిగ్రీ అర్హతతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 3850 ఉద్యోగాలు... తెలంగాణలోనూ ఖాళీలు

RBI Jobs: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

NIRDPR Recruitment 2020: ఖాళీల వివరాలు ఇవే...


మొత్తం ఖాళీలు- 510
స్టేట్ ప్రోగ్రామ్ కో-ఆర్డినేటర్- 10
యంగ్ ఫెలోస్- 250క్లస్టర్ లెవెల్ రీసోర్స్ పర్సన్- 250

NIRDPR Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


దరఖాస్తుకు చివరి తేదీ- 2020 ఆగస్ట్ 10
విద్యార్హతలు- స్టేట్ ప్రోగ్రామ్ కో-ఆర్డినేటర్, యంగ్ ఫెలోస్ పోస్టులకు ఎకనమిక్స్, రూరల్ డెవలప్‌మెంట్, రూరల్ మేనేజ్‌మెంట్, పొలిటికల్ సైన్స్, సోషియాలజీ, సోషల్ వర్క్, డెవలప్‌మెంట్ స్టడీస్ లాంటి సబ్జెక్ట్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ పాస్ కావాలి. క్లస్టర్ లెవెల్ రీసోర్స్ పర్సన్ పోస్టులకు ఏదైనా డిగ్రీ పాస్ కావాలి.
వయస్సు- స్టేట్ ప్రోగ్రామ్ కో-ఆర్డినేటర్ పోస్టుకు 30 నుంచి 50 ఏళ్లు, యంగ్ ఫెలోస్ పోస్టుకు 25 నుంచి 30 ఏళ్లు, క్లస్టర్ లెవెల్ రీసోర్స్ పర్సన్ పోస్టుకు 40 ఏళ్లలోపు.
వేతనం- స్టేట్ ప్రోగ్రామ్ కో-ఆర్డినేటర్‌కు రూ.55,000, యంగ్ ఫెలోస్‌కు రూ.35,000, క్లస్టర్ లెవెల్ రీసోర్స్ పర్సన్‌కు రూ.12,500.
Published by: Santhosh Kumar S
First published: July 27, 2020, 11:15 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading