NIRDPR RECRUITMENT 2020 FRESH NOTIFICATION RELEASED FOR 510 POSTS IN NATIONAL INSTITUTE OF RURAL DEVELOPMENT AND PANCHAYATI RAJ HYDERABAD SS
NIRD & PR Recruitment 2020: హైదరాబాద్‌లోని కేంద్ర ప్రభుత్వ సంస్థలో 510 ఉద్యోగాలు
NIRD & PR Recruitment 2020: హైదరాబాద్‌లోని కేంద్ర ప్రభుత్వ సంస్థలో 510 ఉద్యోగాలు
(ప్రతీకాత్మక చిత్రం)
NIRD & PR Recruitment 2020 | నిరుద్యోగులకు గుడ్ న్యూస్. హైదరాబాద్‌లోని కేంద్ర ప్రభుత్వ సంస్థ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పూర్తి వివరాలు తెలుసుకోండి.
నిరుద్యోగులకు శుభవార్త. హైదరాబాద్‌లోని కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్-NIRD & PR పలు ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 510 పోస్టుల్ని భర్తీ చేస్తోంది. వాస్తవానికి ఈ నోటిఫికేషన్ గతంలోనే విడుదల చేసింది NIRD & PR. ఈ నోటిఫికేషన్‌కు 2020 ఆగస్ట్ 10 వరకు దరఖాస్తుల్ని స్వీకరిస్తామని ప్రకటించింది. అయితే పరిపాలనాపరమైన కారణాల వల్ల నోటిఫికేషన్ రద్దు చేసింది. అయితే అదే నోటిఫికేషన్‌ను తాజాగా మళ్లీ విడుదల చేసింది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్-NIRD & PR. కొత్త నోటిఫికేషన్లో కూడా 510 పోస్టుల్ని ప్రకటించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా స్టేట్ ప్రోగ్రామ్ కో-ఆర్డినేటర్, యంగ్ ఫెలోస్, క్లస్టర్ లెవెల్ రీసోర్స్ పర్సన్ పోస్టుల్ని భర్తీ చేస్తున్నట్టు ప్రకటించింది. తెలంగాణలో కూడా ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టుల గడువు ఏడాది మాత్రమే. ఆ తర్వాత పనితీరు, అవసరాలను బట్టి గడువును పొడిగించే అవకాశం ఉంది. ఈ పోస్టులకు అప్లై చేయడానికి 2020 డిసెంబర్ 29 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను http://nirdpr.org.in/ వెబ్సైట్లో తెలుసుకోవచ్చు. అభ్యర్థులు ఆన్లైన్లోనే దరఖాస్తు చేయాలి.
NIRDPR Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 డిసెంబర్ 29
విద్యార్హతలు- స్టేట్ ప్రోగ్రామ్ కో-ఆర్డినేటర్, యంగ్ ఫెలోస్ పోస్టులకు ఎకనమిక్స్, రూరల్ డెవలప్మెంట్, రూరల్ మేనేజ్మెంట్, పొలిటికల్ సైన్స్, సోషియాలజీ, సోషల్ వర్క్, డెవలప్మెంట్ స్టడీస్ లాంటి సబ్జెక్ట్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ పాస్ కావాలి. క్లస్టర్ లెవెల్ రీసోర్స్ పర్సన్ పోస్టులకు ఏదైనా డిగ్రీ పాస్ కావాలి.
వయస్సు- స్టేట్ ప్రోగ్రామ్ కో-ఆర్డినేటర్ పోస్టుకు 30 నుంచి 50 ఏళ్లు, యంగ్ ఫెలోస్ పోస్టుకు 25 నుంచి 30 ఏళ్లు, క్లస్టర్ లెవెల్ రీసోర్స్ పర్సన్ పోస్టుకు 40 ఏళ్లలోపు.
వేతనం- స్టేట్ ప్రోగ్రామ్ కో-ఆర్డినేటర్‌కు రూ.55,000, యంగ్ ఫెలోస్‌కు రూ.35,000, క్లస్టర్ లెవెల్ రీసోర్స్ పర్సన్‌కు రూ.12,500.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.