తమిళనాడు రాజధాని చెన్నైలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషియన్ టెక్నాలజీ-NIOT ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. మొత్తం 237 ఉద్యోగాలు ఉన్నాయి. ప్రాజెక్ట్ అవసరాలను బట్టి పోస్టుల సంఖ్య పెరగొచ్చు లేదా తగ్గొచ్చు. ప్రాజెక్ట్ సైంటిస్ట్, ప్రాజెక్ట్ టెక్నీషియన్, రీసెర్చ్ ఫెలో లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లై చేయడానికి 2021 సెప్టెంబర్ 13 చివరి తేదీ. టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ లాంటి కోర్సులు పాస్ అయినవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయొచ్చు. ఎంపికైనవారికి రూ.78,000 వరకు వేతనం లభిస్తుంది. దరఖాస్తు చేసేముందు అభ్యర్థులు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతల వివరాలు తెలుసుకోవాలి. ఖాళీల వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
మొత్తం ఖాళీలు | 237 |
ప్రాజెక్ట్ సైంటిస్ట్ 3 | 4 |
ప్రాజెక్ట్ సైంటిస్ట్ 2 | 30 |
ప్రాజెక్ట్ సైంటిస్ట్ 1 | 73 |
ప్రాజెక్ట్ సైంటిఫిక్ అసిస్టెంట్ | 64 |
ప్రాజెక్ట్ టెక్నీషియన్ | 28 |
ప్రాజెక్ట్ జూనియర్ అసిస్టెంట్ | 25 |
రీసెర్చ్ అసోసియేట్ | 3 |
సీనియర్ రీసెర్చ్ ఫెలో | 8 |
జూనియర్ రీసెర్చ్ ఫెలో | 2 |
Oil India Jobs 2021: ఆయిల్ ఇండియా లిమిటెడ్‌లో 535 ఉద్యోగాలు... అప్లై చేయండి ఇలా
దరఖాస్తు ప్రారంభం- 2021 ఆగస్ట్ 20
దరఖాస్తుకు చివరి తేదీ- 2021 సెప్టెంబర్ 13 సాయంత్రం 5 గంటలు
విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. టెన్త్, ఇంటర్, ఐటీఐ, బీటెక్ లాంటి కోర్సులు పాస్ అయినవారు దరఖాస్తు చేయొచ్చు.
వయస్సు- 28 ఏళ్ల నుంచి 50 ఏళ్లు
ఎంపిక విధానం- ప్రాజెక్ట్ సైంటిస్ట్, రీసెర్చ్ ఫెలో పోస్టులకు ఆన్లైన్ ఇంటర్వ్యూ లేదా ఆఫ్‌లైన్ ఇంటర్వ్యూ. ఇతర పోస్టులకు రాతపరీక్ష, ట్రేడ్ టెస్ట్, స్కిల్ టెస్ట్ ఉంటాయి. ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో టెస్టులు ఉంటాయి.
వేతనం- రూ.18,000 నుంచి రూ.78,000
NIACL Recruitment 2021: న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీలో 300 ఉద్యోగాలు... అప్లై చేయండిలా
Step 1- అభ్యర్థులు ముందుగా https://www.niot.res.in/niot1/recruitment.php వెబ్సైట్ ఓపెన్ చేయాలి.
Step 2- అందులో Click here to apply లింక్ పైన క్లిక్ చేయాలి.
Step 3- కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
Step 4- New User పైన క్లిక్ చేయాలి.
Step 5- పేరు, ఇమెయిల్ ఐడీ, పాస్‌వర్డ్‌తో రిజిస్టర్ చేయాలి.
Step 6- రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్‌వర్డ్‌తో లాగిన్ కావాలి.
Step 7- విద్యార్హతల వివరాలు, ఇతర వివరాలు ఎంటర్ చేయాలి.
Step 8- ఫోటో, సంతకం, అవసరమైన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి.
Step 9- చివరగా దరఖాస్తు ఫామ్ సబ్మిట్ చేయాలి.
Step 10- అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి.
ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.niot.res.in/niot1/recruitment.php లింక్‌లో తెలుసుకోవచ్చు. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ మాత్రమే ఫాలో కావాలి. ఈ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. అప్లై చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి. దరఖాస్తు ప్రక్రియలో ఏవైనా సందేహాలు, సమస్యలు ఉంటే recruitment@niot.res.in మెయిల్ ఐడీలో సంప్రదించాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CAREER, Govt Jobs 2021, Job notification, JOBS