Home /News /jobs /

NIOS WILL BE THE FIRST TO OFFER ONLINE BOARDS FROM 2022 GH VB

Online Exams: ఇక ఆ పరీక్షలన్నీ ఆన్​లైన్​లోనే .. దేశంలో తొలిసారి అమలు.. పూర్తి వివరాలివే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

NIOS Online board: దేశంలోనే తొలిసారిగా ఓ ఎడ్యుకేషనల్ బోర్డు 2022 నుంచి బోర్డు పరీక్షలను ఆన్​లైన్​లోనే నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. నేషనల్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ (NIOS) ఈ ఆన్​లైన్ బోర్డు విధానాన్నితీసుకురానుంది. వర్చువల్ స్కూల్​ను దేశంలో తొలిసారి అమలు చేయనుంది.

ఇంకా చదవండి ...
దేశంలోనే తొలిసారిగా ఓ ఎడ్యుకేషనల్ బోర్డు 2022 నుంచి బోర్డు పరీక్షలను ఆన్​లైన్​లోనే నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. నేషనల్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ (NIOS) ఈ ఆన్​లైన్ బోర్డు విధానాన్నితీసుకురానుంది. వర్చువల్ స్కూల్​ను దేశంలో తొలిసారి అమలు చేయనుంది. కరోనా(Corona) కారణంగా వ్యక్తిగత తరగతులు నిర్వహించడం కష్టంగా మారడం, భవిష్యత్తులో పరీక్షలకు ఎలాంటి అడ్డంకులు రాకుండా ఉండేందుకు ఆన్​లైన్ బోర్డు విధానాన్ని అనుసరించనుంది. అలాగే, తమ బోర్డు పరిధిలోని 40 లక్షల విద్యార్థులకు విద్యాసంవత్సరం నష్టం కాకుండా చర్యలు చేపట్టనుంది. ఈ వర్చువల్​ స్కూల్​లో విద్యాభ్యాసం, ప్రాక్టికల్స్​ అన్నీ జరుగుతాయి. వర్చువల్ ల్యాబ్స్ సాయంతో వీటిని నిర్వహించనున్నారు. మెటీరియల్స్​, ఆన్​లైన్​ పరీక్షల(Online Exams) నిర్వహణ కోసం డిజిటల్ లైబ్రరీని(Digital Library) సైతం ఏర్పాటు చేయనున్నారు. ఈ సరికొత్త విధానంపై ఎన్​ఐఓఎస్ డైరెక్టర్ (అకాడమిక్స్​) డాక్టర్ రాజీవ్ కుమార్ సింగ్ మాట్లాడుతూ“డిజిటల్ డివైడ్ కారణంగా ఆఫ్​లైన్ పరీక్షఆప్షన్​ను కూడా ఉంచుతున్నాం.

NIT Warangal: రూ.500తో ఆన్ లైన్ కోర్సు.. అర్హత, దరఖాస్తు చేసుకునే వివరాలు ఇలా..

దేశంలో దాదాపు ఆరు లక్షల గ్రామాలు ఉండగా.. ఇప్పటికీ 25వేల గ్రామాలకు ఇప్పటికీ ఇంటర్నెట్ సౌకర్యం లేదు. ఇప్పటికీ దేశంలోని కొన్ని మారుమూల ప్రాంతాల్లో ఇంటర్నెట్​ సేవలు అందుబాటులో లేవు. అందుకే, కేవలం 11శాతం మంది పిల్లలు మాత్రమే ఆన్​లైన్ విద్యను పొందగలుగుతున్నారు. అయితే, కరోనా పరిస్థితుల దృష్ట్యా విద్యా సంవత్సరం నష్టపోకూడదనే ఉద్దేశ్యంతో బోర్డు పరీక్షలను ఆన్​లైన్ దిశగా మార్చాలని నిర్ణయించాం. దీనితో పాటు ఆఫ్​లైన్​ పరీక్షలు కూడా యథావిధిగా కొనసాగుతాయి.

AICTE Saksham Scholarship: ఆ విద్యార్థులకు ఏఐసీటీఈ సాక్షం స్కాలర్‌షిప్.. ఎంపికైతే ఏటా రూ.50 వేలు స్టైఫండ్..

విద్యార్థులు వారికి ఇష్టమున్న విధానాన్ని ఎంచుకోవచ్చు.” అని తెలిపారు. కాగా, సెకండరీ, సీనియర్ సెకండరీ విద్యను 14 భాషల్లో అభ్యసించేందుకు అవకాశం కల్పిస్తున్న దేశంలోనే ఏకైక బోర్డుగా ఎన్​ఐఓఎస్​కు పేరుంది. కరోనా కారణంగా 2020, 2021లో ఎన్​ఐఓఎస్ పరీక్షలను నిర్వహించలేకపోయింది. సంవత్సరానికి దాదాపు 5 లక్షల మంది దాకా ఈ బోర్డు పరీక్షల్లో పాల్గొంటున్నారు.

డౌట్స్​ క్లారిఫై చేసేందుకు ఆన్​లైన్​ మెంటార్స్​..
సాంకేతిక పరిజ్ఞాన్ని పూర్తిస్థాయిలో వినియోగించి ఆన్​లైన్ పరీక్షల నిర్వహణ ద్వారా విద్యార్థి పర్ఫార్మెన్స్​ను ఎన్​ఐఓస్​ నిర్ణయించనుంది. ఫిజికల్ క్లాసులు నిర్వహించేందుకు పరిస్థితులు ఎప్పుడు అనుకూలిస్తాయో తెలియని పరిస్థితుల్లో ఈ విధానం చాలా ఉపయోగపడుతుందని సింగ్ స్పష్టం చేశారు. అలాగే విద్యార్థుల డౌట్లను తీర్చుకునేందుకు స్టడీ సెంటర్లలో మెంటార్ల నియామకం ఉంటుందని రాజీవ్ కుమార్ సింగ్ (Rajiv Kumra Singh) తెలిపారు.

Central Government: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. వారి పెన్షన్ పెంచుతూ నిర్ణయం.. వివరాలివే..

ఎన్​ఐఓఎస్​ వర్చువల్ ఓపెన్ స్కూల్​లో ఇది కీలకమైన ఫీచర్​గా ఉంటుందని తెలిపారు. డైనమిక్ వర్చువల్ స్కూలింగ్ సిస్టం.. కేవలం సబ్జెక్టులు నేర్చుకోవడం మాత్రమే కాకుండా ప్రశ్నలను లేవనెత్తేందుకు మెంటార్లను కూడా ఏర్పాటు చేస్తుందని సింగ్ అన్నారు. అన్ని డౌట్లను తీర్చే విధంగా మెంటార్లు ఉంటారని వెల్లడించారు.

సెల్ఫ్ లెర్నింగ్(Self Learning) మెటీరియల్​ వీడియో, ఆడియో మీడియమ్స్​లో అందుబాటులో ఉంటాయని తెలిపారు. కాగా, కరోనా వైరస్ ప్రభావం క్రమంగా తగ్గుతుండడంతో విద్యాసంస్థలు ఇప్పుడిప్పుడే తెరుచుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్​లో ఆగస్టు 16న విద్యాసంస్థలు ప్రారంభమవగా.. తెలంగాణలో సెప్టెంబర్​ 1 నుంచి బడి గంటలు మోగాయి. వీటితో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే విద్యా సంస్థలు ప్రారంభమయ్యాయి.
Published by:Veera Babu
First published:

Tags: EDUCATION, Exams, Online Education

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు