Home /News /jobs /

NIOS TO OFFER SKILL COURSES FOR ITI GRADUATES HERE FULL DETAILS NS GH

Skill Courses: విద్యార్థులకు శుభవార్త.. NIOS ఆధ్వర్యంలో స్కిల్​ డెవలప్​మెంట్ కోర్సులు.. వివరాలివే

విద్యార్థులకు శుభవార్త.. NIOS ఆధ్వర్యంలో స్కిల్​ డెవలప్​మెంట్ కోర్సులు.. వివరాలివే

విద్యార్థులకు శుభవార్త.. NIOS ఆధ్వర్యంలో స్కిల్​ డెవలప్​మెంట్ కోర్సులు.. వివరాలివే

మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్‌మెంట్ (MSDE), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్ (NIOS) సంయుక్తంగా సరికొత్త స్కిల్ డెవలెప్​మెంట్​ ప్రోగ్రామ్​ను ప్రారంభించాయి. పాఠశాల విద్యార్థులు, ఐటీఐ (ITI) గ్రాడ్యుయేట్ల కోసం ఈ స్కిల్​ డెవలప్​మెంట్​ కోర్సును ఆఫర్ చేస్తున్నాయి.

ఇంకా చదవండి ...
మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్‌మెంట్ (MSDE), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్ (NIOS) సంయుక్తంగా సరికొత్త స్కిల్ డెవలెప్​మెంట్​ ప్రోగ్రామ్​ను ప్రారంభించాయి. పాఠశాల విద్యార్థులు, ఐటీఐ గ్రాడ్యుయేట్ల కోసం ఈ స్కిల్​ డెవలప్​మెంట్​ కోర్సును ఆఫర్ చేస్తున్నాయి. పాఠశాల విద్య, నైపుణ్యాభివృద్ధి మధ్య అంతరాలను తొలగించే లక్ష్యంతో దూరవిద్యా విధానంలో ఈ స్కిల్​ డెవలప్​మెంట్​ కోర్సును అందిస్తున్నాయి. ఇండస్ట్రియల్ ట్రైనింగ్​ ఇన్​స్టిట్యూట్​ (ITI) కోర్సులు (Courses) చేసిన వారిలో నైపుణ్యాలు పెంపొందించి ఉద్యోగావకాశాలు మెరుగుపర్చడమే లక్ష్యంగా ఈ ప్రోగ్రామ్​ను రూపొందించింది.

దీనికి సంబంధించి తాజాగా మినిస్ట్రీ ఆఫ్​ స్కిల్​ డెవలప్​మెంట్​ (ఎమ్​ఎస్​డీఈ) పరిధిలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్ (డీజీటీ), నేషనల్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ ఓపెన్​ స్కూల్​ (ఎన్​ఐఓఎస్)​ మధ్య అవగాహన ఒప్పందం జరిగింది. ఐటీఐ విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందించేందుకు నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ (ఎన్​ఎస్​టీఐ) గతంలో ప్రవేశపెట్టిన క్రాఫ్ట్స్‌మెన్ ట్రైనింగ్ స్కీమ్ (సీటీఎస్​) ద్వారా ఈ ప్రోగ్రామ్​ను ఆఫర్​ చేస్తోంది. ఈ స్కిల్ డెవలప్​మెంట్​ ప్రోగ్రామ్‌ మొత్తం రెండేళ్ల వ్యవధి కలిగి ఉంటుంది. దీనిలో ఏడాది ఐటీఐ, మరో ఏడాది అప్రెంటీస్​ శిక్షణ ఉంటుంది. అప్రెంటీస్ చట్టం, 1961 నియమ నిబంధనలకు అనుగుణంగా కోర్సును డిజైన్​ చేసింది.
Top Professional Courses: ఆన్​లైన్​ కోర్సులకు పెరిగిన డిమాండ్​... భారతీయులు ఎంచుకున్న టాప్ 10 ప్రొఫెషనల్ కోర్సులివే

ఐటీఐ చేయాలనుకునే విద్యార్థులకే కాకుండా అప్రెంటిస్‌షిప్ శిక్షణ పొందుతున్న వారికి కూడా ఈ ప్రోగ్రామ్​ ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే, అభ్యర్థులు వారి సెకండరీ కోర్సు, సీనియర్ సెకండరీ అర్హత కోసం ఎన్​ఐఓఎస్​ అందించే ల్వాంగ్వేజెస్​లో ఏదొ ఒక దాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది.
Meta Training: భారతీయ విద్యార్థులు, టీచర్లకు మోటా పాఠాలు... ఆగ్మెంటెడ్ రియాలిటీ, డిజిటల్ వెల్‌బీయింగ్‌లో శిక్షణ


యువత ఉద్యోగావకాశాలు మెరుగుపర్చేందుకే..
ఈ కొత్త ప్రోగ్రామ్​పై స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజేష్ అగర్వాల్ మాట్లాడుతూ.. “ఈ కొత్త ప్రోగ్రామ్​ పాఠశాల విద్య, నైపుణ్యాభివృద్ధి మధ్య అంతరాన్ని తగ్గిస్తుంది. విద్యార్థుల్లో నైపుణ్యాలను, ప్రాక్టికల్ నాలెడ్జ్​ను పెంచాలనే లక్ష్యంతో ఈ ప్రోగ్రామ్​ను ప్రవేశపెట్టాం. ఈ చొరవ ద్వారా విద్యాపరమైన సమానత్వం తీసుకురావొచ్చు. మన దేశంలోని అపారమైన యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా కోర్సును రూపొందించాం’’ అని చెప్పారు.
Job Oriented Courses: ఫ్రెష‌ర్స్‌కు ఫ్రీ కోచింగ్‌.. 15 రోజుల్లో జాబ్ స్కిల్స్ కోర్సులు.. వివ‌రాలు

ఈ ప్రోగ్రామ్​ ద్వారా ఐటీఐ, అప్రెంటిస్‌ విద్యార్థులు పరిశ్రమకు అవసరమైన నైపుణ్యాలు పెంపొందించుకోవచ్చని రాజేష్ చెప్పారు. డీజీటీ డైరెక్టర్ -జనరల్‌గా గత అనుభవాలతో అనేక సంస్కరణలు తీసుకొచ్చానన్నారు. ఈ కొత్త ప్రోగ్రామ్​ ద్వారా నిరుద్యోగాన్ని తగ్గించగలమని పేర్కొన్నారు.
Published by:Nikhil Kumar S
First published:

Tags: Career and Courses, Online classes, Students

తదుపరి వార్తలు