NIOS Recruitment 2021: ఎన్ఐఓఎస్‌లో 115 ఖాళీలు.. అర్హతలు వివరాలు

NIOS Recruitment 2021: ఎన్ఐఓఎస్‌లో 115 ఖాళీలు.. అర్హతలు వివరాలు

నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ (National Institute of Open Schooling) ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్(Notification) విడుదల చేసింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా స్టెనోగ్రాఫర్, డైరెక్టర్, ఇత‌ర విభాగాల్లో ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.

  • Share this:
    నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ (National Institute of Open Schooling) ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుదల చేసింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా స్టెనోగ్రాఫర్, డైరెక్టర్, ఇత‌ర విభాగాల్లో ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి అక్టోబ‌ర్ 10, 2021 వ‌ర‌కు అవ‌కాశం. కేవ‌లం ఆన్‌లైన్ ద్వారానే ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. గ్రూప్ A, B, C కేట‌గిరీల వారీగా మొత్తం 115 పోస్టులు భ‌ర్తీ చేయ‌నున్నారు. అభ్య‌ర్థి ఒక పోస్టుకు ఒక్క ద‌ర‌ఖాస్తు మాత్ర‌మే చేయ‌డానికి అర్హులు. అంత‌కంటే ఎక్కువ ద‌ర‌ఖాస్తులు చేస్తే తిర‌స్క‌రిస్తారు.

    అప్లికేషన్ ఫీజు వివరాలు..























    పోస్టు గ్రూప్ పరీక్ష ఫీజు
    గ్రూప్ A (UR, OBC) రూ.750
    గ్రూప్ B&C (UR, OBC) రూ.500
    గ్రూప్ A &B (Sc/St, EWS) రూ. 250
    గ్రూప్ C (Sc/St, EWS) రూ.150

    పోస్టుల వివరాలు.. అర్హతలు 





























































































    పోస్టు పేరు అర్హతలు ఖాళీలు
    డైరెక్టర్ 55 శాతం మార్కులతో మాస్టర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. 1
    జాయింట్ డైరెక్టర్ మాస్ కమ్యూనికేషన్లో మాస్టర్ డిగ్రీ లేదా రేడియో ప్రోగ్రామ్‌లు/ఫిల్మ్‌ల ఉత్పత్తిలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉండాలి. 1
    డిప్యూటీ డైరెక్టర్ బ్యాచలర్ డిగ్రీతోపాటు వృతి అనుభ‌వం ఉండాలి. 1
    అసిస్టెంట్ డైరెక్టర్ ఏదైనా రంగంలో బ్యాచలర్ డిగ్రీ చేసి ఉండాలి 2
    అకౌంట్స్  ఆఫీసర్ వివిధ సంస్థల్లో అకౌంట్  ఆఫీసర్గా పని చేసి ఉండాలి. 1
    అకాడమిక్ ఆఫీసర్ రక్షణ అధ్యయనంలో 55 శాతం మార్కులో మాస్టర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. 17
    రీసర్చ్ అండ్ ఎవల్యూషన్  ఆఫీసర్ విద్యా రంగంలో మాస్టర్ డిగ్రీ చేసి ఉండాలి. 1
    సెక్షన్  ఆఫీసర్ ఏదైనా విభాగంలో డిగ్రీ చేసి ఉండాలి. 7
    అసిస్టెంట్  ఇంజనీర్ సివిల్ రంగంలో  ఇంజనీరంగ్ చేసి ఉండాలి. 1
    హిందీ ఆఫీసర్ హిందీలో మాస్టర్ డిగ్రీచేసి ఉండాలి 1
    అసిస్టెంట్  ఆడిట్  ఆఫీసర్ ఆడిట్ రంగంలో వృతి అనుభ‌వం ఉండాలి. 1
    ఈడీపీ సూపర్ వైసర్ బ్యాచలర్ డిగ్రీ చేసి కంప్యూటర్లో పీజీ చేసి ఉండాలి 37
    జూనియర్  ఇంజనీర్ ఎలక్ట్రికల్  ఇంజనీరింగ్ చేసి ఉండాలి. 1
    అసిస్టెంట్ పదో తరగతి పాసై ఉండాలి, టైపింగ్ రావాలి 4
    స్టెనోగ్రాఫర్ పదో తరగతితోపాటు స్టెనోగ్రాఫి సర్టిఫికెట్ ఉండాలి 3
    జూనియర్ అసిస్టెంట్ పదో తరగతి పాసై టైపింగ్ వచ్చి ఉండాలి. 36
    మొత్తం 115

    UNWTO Best Tourism Villages: అంతర్జాతీయ బెస్ట్‌ టూరిజం విలేజ్‌ పోటీల్లో తెలంగాణ ప‌ల్లె


    ద‌ర‌ఖాస్తు చేసుకొనే విధానం
    - పూర్తిగా నోటిఫికేష‌న్ చ‌దివిన త‌రువాత అర్హ‌త ఉన్న పోస్టుకు అప్లే చేసుకోవాలి - (నోటిఫికేష‌న్ కోసం క్లిక్ చేయండి) 
    - ఒక్క సారి ద‌ర‌ఖాస్తుచేసుకొన్న త‌రువాత ఎడిట్ ఆప్ష‌న్ ఉండ‌దు
    - ఒకపోస్టుకు ఒక్క అప్లికేష‌న్ మాత్ర‌మే స్వీక‌రిస్తారు. ఎక్కువ‌గా ద‌ర‌ఖాస్తు చేసుకోకూడ‌దు.
    - ఆన్‌లైన్ ద్వారానే అప్లికేష‌న్‌లు పంపాలి

    ఎంపిక విధానం
    - ఎంపిక విధానం ఇంట‌ర్వ్యూ ద్వారా ఉంటుంది.
    - రాత ప‌రీక్ష‌, స్కిల్ టెస్ట్ పెట్టే అవకాశం ఉంది.
    - అంతిమ నిర్ణ‌యం ప‌రీక్ష నిర్వ‌హ‌ణ విభాగానికే ఉంటుంద‌ని నోటిఫికేష‌న్‌లో పేర్కొన్నారు.
    - అభ్య‌ర్థులు రాత ప‌రీక్ష‌కు కూడా సిద్ధంగా ఉండాలి
    Published by:Sharath Chandra
    First published: