నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్(NIOS) విద్యార్థులకు గుడ్‌న్యూస్. ఏప్రిల్- మే 2023 సెషన్ 10, 12వ తరగతుల పరీక్షలు త్వరలో జరగనున్నాయి. తాజాగా పరీక్షల ఫీజు చెల్లించే గడువును ఎన్ఐఓఎస్ పొడిగించింది. ఒక్కో సబ్జెక్టుకు రూ.100 లేట్ పేమెంట్ ఛార్జీతో ఫిబ్రవరి 6 వరకు ఫీజు చెల్లించే అవకాశం కల్పించింది. ఎటువంటి లేట్ ఫీజు లేకుండా అప్లికేషన్ రిజిస్ట్రేషన్ గడువు జనవరి 17తో ముగిసిన సంగతి తెలిసిందే.
కన్సాలిడేటెడ్ లేట్ ఫీజు రూ.1500
ఫిబ్రవరి 6వ తేదీ లోపు కూడా ఫీజు చెల్లించలేకపోతే సబ్జెక్టుకు రూ.1,500 చొప్పున కన్సాలిడేటెడ్ లేట్ ఫీజును చెల్లించడానికి ఫిబ్రవరి 15 వరకు అవకాశం కల్పించారు. అభ్యర్థులు తమ దరఖాస్తు ఫారంను ఆలస్య రుసుముతో అధికారిక పోర్టల్ sdmis.nios.ac.in ద్వారా సమర్పించవచ్చు.
NIOS పరీక్ష ఫీజు 2023: సవరించిన షెడ్యూల్
ఒక్కొ థియరీ సబ్జెక్ట్‌కు ఎగ్జామ్ ఫీజు రూ.250గా NIOS నిర్ణయించింది. థియరీ, ప్రాక్టికల్ ఉన్న సబ్జెక్ట్‌ల్లో ప్రాక్టికల్ కోసం అదనపు రుసుము ఒక్కో సబ్జెక్టుకు రూ.120. ఒక్కో లావాదేవీకి రూ.50 అదనపు రుసుము వసూలు చేస్తారు. అర్హులైన అభ్యర్థులకు ప్రతి సబ్జెక్టుకు రూ.100 ఆలస్య రుసుముతో జనవరి 29 నుంచి ఫిబ్రవరి 6 వరకు అవకాశం కల్పించారు. ఆ తరువాత కూడా ఫీజు చెల్లించడానికి అవకాశం కల్పించారు. ఫిబ్రవరి 7 నుంచి ఫిబ్రవరి 15 వరకు రూ. 1,500 ఆలస్య రుసుముతో పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు.
రెండేళ్ల గ్యాప్ తప్పనిసరి
10, 12 తరగతుల ఉత్తీర్ణత విషయంలో కనీసం రెండేళ్ల గ్యాప్ ఉండాలని NIOS ప్రకటించింది. అక్టోబర్ 2021 లేదా ఏప్రిల్ 2023లో 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి, 12వ తరగతిలో హాజరు కావడానికి నమోదు చేసుకున్న వారు ఏప్రిల్-మే 2023 సెషన్‌లో జరిగే సీనియర్ సెకండరీ కోర్సుల పబ్లిక్ పరీక్షల కోసం 4 సబ్జెక్టులకు మించకుండా పరీక్ష ఫీజును సమర్పించాలని బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. అయితే రెండు సంవత్సరాల తప్పనిసరి గ్యాప్ పూర్తి కాకపోతే నాలుగు సబ్జెక్టుల కంటే ఎక్కువ ఫీజును సమర్పించిన అభ్యాసకుల ఫలితాలు ప్రకటించబోమని NIOS స్పష్టం చేసింది.
పరీక్ష ఫీజు చెల్లించే ప్రక్రియ
విద్యార్థులు NIOS ఫీజు -2023 క్రెడిట్ కార్డ్/డెబిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/UPI ద్వారా ఆన్‌లైన్‌లో చెల్లించవచ్చు. వారు ఏప్రిల్ -మే 2023 కోసం NIOS పరీక్ష ఫీజులను జాగ్రత్తగా చెల్లించాలి. ఒకసారి చెల్లించిన ఫీజును ఎట్టి పరిస్థితుల్లో వాపసు చేయరు. పరీక్ష ఫీజును చెల్లించడానికి ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి. ముందుగా అధికారిక వెబ్‌సైట్ sdmis.nios.ac.inను విజిట్ చేయాలి. హోమ్ పేజీలో ‘పే ఏప్రిల్ 2023 ఎగ్జామ్ ఫీజ్’ అనే లింక్‌పై క్లిక్ చేయండి. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ ఎన్‌రోల్ నంబర్ ను ఎంటర్ చేయండి. ఇప్పుడు సబ్జెక్ట్‌లను ఎంచుకుని, సబ్‌మిట్ బటన్‌పై క్లిక్ చేయండి. వెంటనే ఎన్ఐఓఎస్ ఫీజు 2023 విండో ఓపెన్ అవుతుంది. పరీక్ష ఫీజు చెల్లించి, హార్డ్ కాపీని సేవ్ చేసుకోండి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, JOBS, Open school