NIOS CLASSES 10 12 BOARD EXAM DATESHEET ANNOUNCED TO BEGIN FROM APRIL 6 NIOS AC IN GH VB
Exam Dates: ఏప్రిల్ 4 నుంచి NIOS 10, 12వ తరగతి పరీక్షలు.. ఎగ్జామ్ షెడ్యూల్, అడ్మిట్ కార్డ్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే..
ప్రతీకాత్మక చిత్రం
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ (NIOS) 10, 12 తరగతుల బోర్డ్ ఎగ్జామ్స్(Board Exams) పరీక్ష తేదీలు(Exam Dates) విడుదలయ్యాయి. ఈ పరీక్షలు ఏప్రిల్‌లో జరగనున్నాయి.
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ (NIOS) 10, 12 తరగతుల బోర్డ్ ఎగ్జామ్స్(Board Exams) పరీక్ష తేదీలు(Exam Dates) విడుదలయ్యాయి. ఈ పరీక్షలు ఏప్రిల్‌లో జరగనున్నాయి. దేశ వ్యాప్తంగా అనేక మంది విద్యార్థులు ఈ థియరీ ఎగ్జామ్స్ రాయనున్నారు. ఏప్రిల్ 4వ తేదీ నుంచి ఈ పరీక్షలు ప్రారంభమవుతాయని NIOS వెల్లడించింది. విద్యార్థులు పూర్తి ఎగ్జామ్ టైమ్ టేబుల్‌ను nios.ac.in వెబ్సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. జనవరి 1 నుంచి 10, 12వ తరగతులకు పరీక్ష ఫీజుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను NIOS ప్రారంభించింది. ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఎటువంటి లేటు ఫీజు లేకుండా జనవరి 31 వరకు కొనసాగింది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత నెల రోజులకు బోర్డు అధికారులు పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేశారు.
ఏడాదికి రెండుసార్లు పరీక్ష..
NIOS పరీక్షను బోర్డు సంవత్సరానికి రెండు సార్లు నిర్వహిస్తుంది. రెగ్యులర్ విధానంలో చదవుకోలేని ఎంతోమంది అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. ప్రతి ఏడాది మొదటి విడతలో నిర్వహించే పరీక్ష ఏప్రిల్, మే నెలలో జరుగుతుంది. రెండో విడత పరీక్షలను NIOS అక్టోబర్, నవంబర్ నెలలో నిర్వహిస్తుంది.
పరీక్షల షెడ్యూల్‌ను డౌన్లోడ్ చేసుకోవడమెలా..
అభ్యర్థులు ఈ పరీక్షల పూర్తి షెడ్యూల్‌ను డౌన్లోడ్ చేసుకునేందుకు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది. కొన్ని సింపుల్ స్టెప్స్‌లో డేట్ షీట్‌ను విద్యార్థులు డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
స్టెప్ 1- విద్యార్థులు ముందు nios.ac.in వెబ్సైట్ ఓపెన్ చేయాలి. sdmis.nios.ac.in సైట్ ద్వారా కూడా షెడ్యూల్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.
స్టెప్ 2- వెబ్సైట్ హోమ్ పేజీలో సెకండరీ, సీనియర్ సెకండరీ బోర్డ్ ఎగ్జామ్స్ డేట్స్ లింక్ కనిపిస్తుంది.
స్టెప్ 3- ఈ లింక్ పై క్లిక్ చేస్తే NIOS ఏప్రిల్-మే సెషన్ షెడ్యూల్ ఓపెన్ అవుతుంది.
స్టెప్ 4- ఈ పీడీఎఫ్ డాక్యుమెంట్‌ను డౌన్‌లోన్ చేసుకోవచ్చు.
హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడమెలా?
అభ్యర్థులు పరీక్షల సమయంలో తమ హాల్ టికెట్‌ను డౌన్లోడ్ చేసుకునేందుకు కూడా అధికారిక వెబ్సైట్లో ఆప్షన్ ఇచ్చారు. హాల్ టికెట్ కోసం అభ్యర్థులు వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ నెంబర్, ఇతర వివరాలను ఎంటర్ చేసి.. డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అడ్మిట్ కార్డుపై పేర్కొన్న నియమ, నిబంధనలను అభ్యర్థులు తప్పనిసరిగా పాటించాలని NIOS పేర్కొంది. కరోనా నేపథ్యంలో కోవిడ్ మార్గదర్శకాలు తప్పనిసరిగా పాటించాలని సూచించింది. అడ్మిట్ కార్డు విషయంలో ఏవైనా అభ్యంతరాలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని NIOS సూచించింది.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.