ఓపెన్ డిగ్రీ విధానంలో వివిధ కోర్సులు ఆఫర్ చేస్తోన్న నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్ (ఎన్ఐఓఎస్) తాజాగా 10, 12వ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల చేసింది. 2022 ఏప్రిల్ లేదా మే నెలలో సెకండరీ, సీనియర్ సెకండరీ పబ్లిక్ పరీక్షలను నిర్వహిస్తామని తెలిపింది. జనవరి 1 నుంచి పరీక్షలకు రిజిస్ట్రేషన్లు ప్రారంభించనున్నట్లు తెలిపింది. రెగ్యులర్ విద్యార్థులతో పాటు గతంలో ఫెయిలైన విద్యార్థులు కూడా ఈ పరీక్షలకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరింది. అభ్యర్థులు ఎన్ఐఓఎస్ అధికారిక వెబ్‌సైట్ www.nios.ac.in ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించింది. రెగ్యులర్ విద్యార్థులకు జనవరి 1 నుంచి రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుండగా.. అక్టోబర్/నవంబర్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించని సప్లిమెంటరీ విద్యార్థుల కోసం జనవరి 16 నుంచి జనవరి 31 వరకు రిజిస్ట్రేషన్ విండో తెరిచి ఉంటుందని స్పష్టం చేసింది.
అయితే రిజిస్ట్రేషన్ సమయంలోనే పూర్తి ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ఫీజు చెల్లించడంలో ఆలస్యమైతే లేట్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 10 మధ్య రూ.100 ఆలస్య రుసుము చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపింది. ఫిబ్రవరి 11 నుంచి ఫిబ్రవరి 20 మధ్య రిజిస్ట్రేషన్ చేసుకునే వారు రూ.1500 ఆలస్య రుసుము చెల్లించాలని పేర్కొంది.
The next Public Exam for Secondary & Sr.Secondary courses is schedule to be conducted during April/May 2022. To know more about the schedule for registration and payment of exam fee,kindly read the notification or visit https://t.co/qYIbmwSeI2.@ANI @PTI_News @PibLucknow @PIBHRD pic.twitter.com/4dmsuxtuyC
— NIOS (@niostwit) December 22, 2021
వర్చువల్ స్కూల్ విధానంలో విద్యాబోధన..
దేశంలోనే ప్రతిష్టాత్మక ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ (ఎన్ఐఓఎస్) ఒకేషనల్, D.El.Ed కోర్సులకు సంబంధించిన థియరీ పరీక్షలు జనవరి 3న ప్రారంభమవుతాయని సంస్థ ప్రకటించింది. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు నేడు (డిసెంబర్ 24)న అడ్మిట్ కార్డులు విడుదల చేస్తారు. రిజిస్ట్రేషన్ వివరాలను ఉపయోగించి ఎన్ఐఓఎస్ అధికారిక వెబ్‌సైట్ నుంచి అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు అధికారిక వెబ్‌సైట్ సందర్శించవచ్చు.
NIOS సెకండరీ, సీనియర్ సెకండరీ స్థాయిలో జనరల్, అకడమిక్ కోర్సులతో పాటు అనేక వృత్తి, లైఫ్ ఎన్‌రిచ్‌మెంట్, కమ్యూనిటీ ఓరియెంటెడ్ కోర్సులను అందిస్తోంది. ఓపెన్ బేసిక్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్‌ల (OBE) ద్వారా ఎలిమెంటరీ స్థాయి కోర్సులను కూడా అందిస్తోంది. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ ఇటీవలే వర్చువల్ స్కూల్‌ను ప్రారంభించింది.
వర్చువల్ స్కూల్ పద్ధతిలో వర్చువల్ క్లాస్ రూమ్‌లు, వర్చువల్ ల్యాబ్‌ల ద్వారా విద్యాబోధన ఉంటుందని స్పష్టం చేసింది. వర్చువల్ స్కూల్ విధానంలో విద్యాబోధన ప్రారంభించడం ఇదే మొదటిసారి. ఈ అధునాతన డిజిటల్ లెర్నింగ్ ప్లాట్‌ఫామ్ దేశంలోనే మొదటిదని, దీని ద్వారా విద్యార్థులు సులభంగా నేర్చుకోగలుగుతారని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: EDUCATION, Information Technology, School