పోలీసుశాఖలో 15,644, రవాణాశాఖలో 63, ఆబ్కారీశాఖలో 614 కానిస్టేబుల్ ఉద్యోగాలకు తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (TSLPRB) నోటిఫికేషన్(Notification) విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నియామకాలకు సంబంధించిన ప్రిలిమినరీ ఎగ్జామ్ ను ఈ నెల 28వ తేదీన నిర్వహించారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షను విజయవంతగా పూర్తిచేసినట్లు అధికారులు పేర్కొన్నారు. పరీక్షకు హాజరైన అభ్యర్థుల బయోమెట్రిక్ (Biometric)హాజరు, వేలిముద్రల సేకరణ, డిజిటల్(Digital) విధానంలో ఫొటోలు సేకరించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఉదయం 10 గంటలకు ప్రారంభం అయిన ఈ పరీక్ష మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరిగింది. మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 16వందల సెంటర్లలో ఎగ్జామ్(Exam) నిర్వహించారు. కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 6,61,196 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 6,03,955 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు.
మొత్తం 91.34శాతం హాజరు నమోదైంది. అత్యధికంగా వికారాబాద్ జిల్లాలో (97.41 %) హాజరు నమోదుకాగా.. తక్కువగా సత్తుపల్లి జిల్లాలో (83.30 %) నమోదైంది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు వేలిముద్రలు, డిజిటల్ ఫొటోలను పోలీసు అధికారులు సేకరించారు. దేహధారుఢ్య పరీక్షలు, తుది పరీక్షల్లో పాల్గొనే అభ్యర్థుల వేలిముద్రల ఆధారంగానే అనుమతిస్తామని అధికారులు తెలిపారు.
కానిస్టేబుల్ ప్రాథమిక రాతపరీక్షలో ఈసారి కనీస అర్హత మార్కుల్ని కుదించిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు జరిగిన పరీక్షల్లో ఎస్సీ/ఎస్టీలు 30శాతం.. బీసీలు 35శాతం.. ఇతరులు 40శాతం కనీస మార్కులు సాధిస్తేనే అర్హులుగా పరిగణించేవారు. ఈ సారి ఎలాంటి రిజర్వేషన్లతో సంబంధం లేకుండా అందరికీ ఒకే విధంగా 30 శాతం మార్కులు సాధించిన వారే అర్హులుగా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. 200 మార్కులకు జరిగిన ఈ రాత పరీక్షలో 60 మార్కులు వచ్చిన వారు క్వాలిఫై అవుతారు. రాతపరీక్షకు సంబంధించిన ప్రిలిమినరీ కీని త్వరలోనే అధికారిక వెబ్సైట్www.tslprb.inలో అందుబాటులో ఉంచనున్నట్లు బోర్డు పేర్కొంది. అంటే ఈ రోజు రాత్రి లేదా.. ఆగస్టు 30 సాయంత్రం లోపు ప్రాథమిక కీ వెలువడే అవకాశం కనిపిస్తోంది. ఇక ప్రశ్నా పత్రంలో 4 తప్పులు, మరో 4 ప్రశ్నలకు ఒకటి కంటే ఎక్కువ సమాధానాలు ఉన్నట్లు సమాచారం. దీనికి సంబంధించి తుది నిర్ణయం పోలీస్ నియామక మండలి మాత్రమే తీసుకోనుంది.
ఇక ఆగస్టు 17న నిర్వహించిన ఎస్సై ఫలితాలను సెప్టెంబర్ మొదటి వారంలో వెల్లడయ్యే అవకాశం ఉంది. అక్టోబర్ చివరి వారంలో ఈవెంట్స్ ప్రారంభం అవుతాయని అధికారులు పేర్కొన్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగానే.. ఈవెంట్స్ ప్రాక్టీస్ కు అభ్యర్థులకు కనీసం ఒక నెల సమయం ఇవ్వాలనే ఆలోచనలో అధికారులు ఉన్నట్లు సమాచారం. ఇలా సెప్టెంబర్ 15 లోపు ఎస్సై, కానిస్టేబుల్ పరీక్షల ఫలితాలు వెల్లడి కానున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, JOBS, Mana telangana, Telangana, Telangana government jobs