హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

NIMS Jobs 2022: నిరుద్యోగులకు అలర్ట్.. ప్రముఖ నిమ్స్ సంస్థలో ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి

NIMS Jobs 2022: నిరుద్యోగులకు అలర్ట్.. ప్రముఖ నిమ్స్ సంస్థలో ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

హైదరాబాద్ లోని ప్రముఖ నిమ్స్ (NIMS) సంస్థలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ (Job Notification) విడుదలైంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  హైదరాబాద్‌ పంజాగుట్టలో అత్యంత ప్రతిష్టాత్మకమైన నిజామ్స్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ (NIMS Hyderabad) సంస్థ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. భాీరగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 200 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అయితే.. కాంట్రాక్ట్ విధానంలో ఈ ఖాళీలను (Jobs) భర్తీ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ఈ నెల 23న ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకోవడానికి వచ్చే నెల అంటే సెప్టెంబర్ 06ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆఫ్ లైన్ విధానంలో హార్డ్ కాపీలోని దరఖాస్తులను పంపించడానికి సెప్టెంబర్ 10ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు సెప్టెంబర్ 18న పరీక్ష ఉంటుంది. రాత పరీక్షలో మెరిట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.విద్యార్హతల వివరాలు:
  బీఎస్సీ నర్సింగ్ లేదా అందుకు సమానమైన విద్యార్హత కలిగిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తుదారుల వయస్సు 18 నుంచి 34 ఏళ్లు ఉండాలి. అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే సమయంలో జనరల్ అభ్యర్థులు రూ.1000 అప్లికేషన్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ. 32, 682 వేల వేతనం ఉంటుంది. ఈ ఖాళీలకు ఎంపికైన వారికి కాంట్రాక్ట్ వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ వరకు ఉంటుంది.
  దరఖాస్తు చేసుకోవడం ఎలా: అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ లింక్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
  Jobs In AOC: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. సికింద్రాబాద్ Ordnance Corpsలో 3068 పోస్టులకు నోటిఫికేషన్..


  ఇదిలా ఉంటే.. దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. భారీగా ఖాళీలను (Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు తాజాగా నోటిఫికేషన్ (SBI Job Notification) విడుదల చేసింది SBI. మొత్తం 665 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు.


  ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా.. దరఖాస్తు చేసుకోవడానికి సెప్టెంబర్ 20ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

  Published by:Nikhil Kumar S
  First published:

  Tags: Job notification, JOBS, Nims