హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

NIMS Recruitment 2022: హైదరాబాద్ నిమ్స్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. నెలకు రూ.32 వేల వేతనం.. ఇలా అప్లై చేసుకోండి

NIMS Recruitment 2022: హైదరాబాద్ నిమ్స్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. నెలకు రూ.32 వేల వేతనం.. ఇలా అప్లై చేసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

హైదరాబాద్ లోని ప్రముఖ నిమ్స్ (NIMS) సంస్థలో ఉద్యోగాల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేశారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి ఈ స్టెప్స్ ను ఫాలో కావాల్సి ఉంటుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

    హైదరాబాద్‌ పంజాగుట్టలో అత్యంత ప్రతిష్టాత్మకమైన నిజామ్స్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ (NIMS Hyderabad) సంస్థ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. భాీరగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 200 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అయితే.. కాంట్రాక్ట్ విధానంలో ఈ ఖాళీలను (Jobs) భర్తీ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ఈ నెల 23న ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకోవడానికి వచ్చే నెల అంటే సెప్టెంబర్ 06ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆఫ్ లైన్ విధానంలో హార్డ్ కాపీలోని దరఖాస్తులను పంపించడానికి సెప్టెంబర్ 10ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు సెప్టెంబర్ 18న పరీక్ష ఉంటుంది. రాత పరీక్షలో మెరిట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.


    విద్యార్హతల వివరాలు:
    బీఎస్సీ నర్సింగ్ లేదా అందుకు సమానమైన విద్యార్హత కలిగిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తుదారుల వయస్సు 18 నుంచి 34 ఏళ్లు ఉండాలి. అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే సమయంలో జనరల్ అభ్యర్థులు రూ.1000 అప్లికేషన్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ. 32, 682 వేల వేతనం ఉంటుంది. ఈ ఖాళీలకు ఎంపికైన వారికి కాంట్రాక్ట్ వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ వరకు ఉంటుంది.

    దరఖాస్తు చేసుకోవడం ఎలా: అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ లింక్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

    Railway Jobs 2022: ఇంటర్ , డిగ్రీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. రైల్వే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..


    ఇదిలా ఉంటే.. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ లో(DRDO) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. దీనిలో భాగంగా.. టెక్నికల్ కేడర్ కు సంబంధించిన పోస్టులను ఈనోటిఫికేషన్ద్వారా భర్తీ చేయనున్నారు. సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ బి మరియు టెక్నీషియన్ ఎ పోస్టులపై రిక్రూట్‌మెంట్ జరుగుతుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ drdo.gov.in ను సందర్శించడం ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.



    ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ కింద మొత్తం 1901 పోస్టులను భర్తీ చేస్తారు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ 3 సెప్టెంబర్ 2022 నుండి ప్రారంభమవుతుంది. దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీ సెప్టెంబర్ 23గా పేర్కొన్నారు.

    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: JOBS, Nims, State Government Jobs, Telangana government jobs

    ఉత్తమ కథలు