Home /News /jobs /

NIMS RECRUITMENT 2022 NIZAMS INSTITUTE OF MEDICAL SCIENCES RELEASED JOB NOTIFICATION FOR 4 SENIOR RESIDENT POSTS KNOW HOW TO APPLY SS

NIMS Recruitment 2022: హైదరాబాద్‌లోని నిమ్స్‌లో ఉద్యోగాలు... రూ.80,000 వరకు వేతనం

NIMS Recruitment 2022: హైదరాబాద్‌లోని నిమ్స్‌లో ఉద్యోగాలు... రూ.80,000 వరకు వేతనం
(image: NIMS)

NIMS Recruitment 2022: హైదరాబాద్‌లోని నిమ్స్‌లో ఉద్యోగాలు... రూ.80,000 వరకు వేతనం (image: NIMS)

NIMS Recruitment 2022 | నిజామ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (NIMS) పలు ఖాళీల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. అభ్యర్థులు అప్లికేషన్ ఫామ్స్‌ని పోస్టు ద్వారా పంపాల్సి ఉంటుంది. ఖాళీల వివరాలతో పాటు విద్యార్హతల వివరాలు తెలుసుకోండి.

ఇంకా చదవండి ...
    హైదరాబాద్‌లోని నిజామ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (NIMS) ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. సీనియర్ రెసిడెంట్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 4 పోస్టులు ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన eICU పైలట్ ప్రోగ్రామ్ చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ ప్రోగ్రామ్ కోసం పలు పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2022 జనవరి 28 చివరి తేదీ. ఆసక్తిగల అభ్యర్థులు ఆఫ్‌లైన్ పద్ధతిలో దరఖాస్తు చేయాలి. అంటే పోస్టులో అప్లికేషన్ ఫామ్స్ పంపాల్సి ఉంటుంది. ఈ జాబ్ నోటిఫికేషన్ వివరాలు, విద్యార్హతలు, దరఖాస్తు విధానం గురించి తెలుసుకోండి.

    NIMS Recruitment 2022: ఖాళీల వివరాలు ఇవే...









































    భర్తీ చేసే పోస్టులుసీనియర్ రెసిడెంట్
    మొత్తం ఖాళీలు4
    దరఖాస్తుకు చివరి తేదీ2022 జనవరి 28 సాయంత్రం 4 గంటలు
    ఇంటర్వ్యూఇంటర్వ్యూ తేదీ, స్థలం వివరాలను అభ్యర్థులకు ఫోన్ ద్వారా సమాచారం అందిస్తారు.
    విద్యార్హతలుఅనస్థీషియాలజీ, జనరల్ మెడిసిన్, ఎమర్జెన్సీ మెడిసిన్ లాంటి అంశాల్లో ఎండీ పాస్ కావాలి. క్రిటికల్ కేర్‌లో అనుభవం ఉండాలి.
    గడువుఒక ఏడాది
    వేతనంనెలకు రూ.80,000
    ఎంపిక విధానంఇంటర్వ్యూ
    దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్The Dean, Nizam's Institute of Medical Sciences, Panjagutta, Hyderabad-500082, Telangana.



    Post Office Jobs: పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్... ఖాళీల వివరాలు ఇవే

    ఈ జాబ్ నోటిఫికేషన్‌తో పాటు దరఖాస్తు ఫామ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

    NIMS Recruitment 2022: దరఖాస్తు విధానం


    Step 1- అభ్యర్థులు https://www.nims.edu.in/recruitment ఓపెన్ చేయాలి.

    Step 2- Recruitment of Senior Residents under the pilot program లింక్ పైన క్లిక్ చేయాలి.

    Step 3- నోటిఫికేషన్ వివరాలతో పాటు దరఖాస్తు ఫామ్ ఉంటుంది. డౌన్‌లోడ్ చేయాలి.

    Step 4- దరఖాస్తు ఫామ్ పూర్తి చేసి అవసరమైన డాక్యుమెంట్స్ జత చేయాలి.

    Step 5- దరఖాస్తు ఫామ్‌ను చివరి తేదీలోగా చేరేలా నోటిఫికేషన్‌లో వెల్లడించిన అడ్రస్‌కు పంపాలి.

    Step 6- ఎన్వలప్ పైన నోటిఫికేషన్ నెంబర్ తప్పనిసరిగా రాయాలి.

    TTD Recruitment 2022: టీటీడీ జాబ్ నోటిఫికేషన్... దరఖాస్తుకు 3 రోజులే గడువు

    తెలంగాణ ప్రభుత్వం వేర్వేరు ప్రాంతాల్లో eICU spokes ఏర్పాటు చేస్తోంది. నిమ్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌గా వ్యవహరిస్తుంది. ఈ ప్రోగ్రామ్ కోసం ప్రస్తుతం జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇవి కాంట్రాక్ట్ పోస్టులు మాత్రమే. కాంట్రాక్ట్ గడువు ఒక ఏడాది ఉంటుంది. రెగ్యులర్ అపాయింట్‌మెంట్ లభించదు. విద్యార్హతలతో పాటు అనుభవం ఉన్నవారు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలి. నోటిఫికేషన్‌లో వెల్లడించిన అనుభవం లేని అభ్యర్థులు దరఖాస్తు చేయకపోతే తక్కువ అనుభవం ఉన్నవారిని కూడా నియమిస్తారు. ఎంపికైనవారిని తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఇఐసీయూ పైలట్ ప్రోగ్రామ్‌లో నియమిస్తారు.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Govt Jobs 2022, Hyderabad, Job notification, JOBS, Nims, State Government Jobs

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు