హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

NIMS Jobs 2022: తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. నిమ్స్ లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఇలా దరఖాస్తు చేసుకోండి

NIMS Jobs 2022: తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. నిమ్స్ లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఇలా దరఖాస్తు చేసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

హైదరాబాద్ లోని అత్యంత ప్రతిష్టాత్మక హాస్పటల్స్ లో నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (NIMS) ఒకటన్న విషయం తెలిసిందే. తాజాగా నిమ్స్ ఆస్పత్రి నుంచి పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

    హైదరాబాద్ లోని అత్యంత ప్రతిష్టాత్మక హాస్పటల్స్ లలో నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (NIMS) ఒకటన్న విషయం తెలిసిందే. తాజాగా నిమ్స్ ఆస్పత్రి నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాల (Jobs) భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డేటా ఎంట్రీ ఆపరేటర్, లేబొరేటరీ టెక్నీషయిన్, రిసెర్చ్ అసిస్టెంట్, సైంటిస్ట్ తదితర విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో (Job Notification) పేర్కొన్నారు అధికారులు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 12వ తేదీని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అభ్యర్థులు ఆ తేదీలోగా తమ దరఖాస్తులను సమర్పించాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.

    ఖాళీల వివరాలు:

    S.No. పోస్టు ఖాళీలు
    1.డేటా ఎంట్రీ ఆపరేటర్1
    2.లేబొరేటరీ టెక్నీషియన్2
    3.రిసెర్చ్ అసిస్టెంట్1
    4.సైంటిస్ట్-బి1
    మొత్తం: 5

    డేటా ఎంట్రీ ఆపరేటర్: సైన్స్ సబ్జెక్టుల్లో ఇంటర్ లేదా 12వ తరగతి పాసైన వారు ఈ ఖాళీలకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. కంప్యూటర్ పై స్పీడ్ టెస్ట్ ఉంటుంది. హెల్త్ కేర్ రంగంలో డేటా ఎంట్రీపై రెండేళ్ల అనుభవం ఉన్న వారికి ప్ారధాన్యం ఉంటుంది. వయస్సు 28 ఏళ్లలోపు ఉండాలి. ఎంపికైన వారికి నెలకు రూ.18 వేల వేతనం ఉంటుంది.

    లేబరోటరీ టెక్నీషియన్: ఈ విభాగంలో 2 ఖాళీలు ఉన్నాయి. టెన్త్ పాసైన అభ్యర్థులతో పాటు మెడికల్ లాబరేటరీ టెక్నాలజీలో డిప్లొమా చేసి ఉండాలి. ఎంపికైన వారికి నెలకు రూ.18 వేల వేతనం ఉంటుంది.

    రీసెర్చ్ అసిస్టెంట్: లైఫ్ సైన్సెస్ లో ఎంఎస్సీ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.31 వేల వేతనం చెల్లించనున్నారు.

    సైంటిస్ట్ బీ: మైక్రో బయోలజీ/మాలిక్యూర్ బయోలజీలో పీజీ చేసి ఉండాలి. ఇతర విద్యార్హతల వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.54,500 వేతనం ఉంటుంది.

    Govt Jobs 2022: నిరుద్యోగులకు అలర్ట్.. ఇండియన్ ఆయిల్ లో భారీగా ఉద్యోగాలు .. ఇలా దరఖాస్తు చేసుకోండి

    ఎలా అప్లై చేయాలంటే..

    Step 1: అభ్యర్థులు మొదటగా అధికారిక వెబ్ సైట్ https://nims.edu.in/index ఓపెన్ చేయాలి.

    Step 2: అనంతరం నోటిఫికేషన్స్ విభాగంలో Recruitment ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

    Step 3: అనంతరం Notification for Scientist-B - Research Assistant ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

    Step 4: తర్వాత అప్లికేష్ ఫామ్ ఓపెన్ అవుతుంది.

    Step 5: ఆ ఫామ్ లో కావాల్సిన వివరాలను నింపాలి.

    Step 6: ఆ అప్లికేషన్ ఫామ్ ను The Dean, Nizams Institute Of Medical Science చిరునామాకు పంపించాల్సి ఉంటుంది.

    Step 7: దరఖాస్తులు అక్టోబర్ 12వ తేదీ సాయంత్రం 4లోగా చేరేలా పంపించాల్సి ఉంటుంది.

    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Health jobs, JOBS, Nims, State Government Jobs, Telangana government jobs

    ఉత్తమ కథలు