హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

NIMS Jobs 2022: నిరుద్యోగులకు శుభవార్త.. హైదరాబాద్ నిమ్స్ లో డేటా ఆపరేటర్, ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

NIMS Jobs 2022: నిరుద్యోగులకు శుభవార్త.. హైదరాబాద్ నిమ్స్ లో డేటా ఆపరేటర్, ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

హైదరాబాద్ లోని అత్యంత ప్రతిష్టాత్మక హాస్పటల్స్ లో నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (NIMS) ఒకటన్న విషయం తెలిసిందే. తాజాగా నిమ్స్ ఆస్పత్రి నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad | Vijayawada

  హైదరాబాద్ లోని అత్యంత ప్రతిష్టాత్మక హాస్పటల్స్ లలో నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (NIMS) ఒకటన్న విషయం తెలిసిందే. తాజాగా నిమ్స్ ఆస్పత్రి నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను (Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. డేటా ఎంట్రీ ఆపరేటర్, లేబొరేటరీ టెక్నీషయిన్, రిసెర్చ్ అసిస్టెంట్, సైంటిస్ట్ తితర విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో (Job Notification) పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలని ప్రకటనలో పేర్కొన్నారు అధికారులు. దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 12వ తేదీని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అభ్యర్థులు ఆ తేదీలోగా తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.

  ఖాళీల వివరాలు:

  S.No. పోస్టు ఖాళీలు
  1.డేటా ఎంట్రీ ఆపరేటర్1
  2.లేబొరేటరీ టెక్నీషియన్2
  3.రిసెర్చ్ అసిస్టెంట్1
  4.సైంటిస్ట్-బి1
  మొత్తం: 5

  డేటా ఎంట్రీ ఆపరేటర్: సైన్స్ సబ్జెక్టుల్లో ఇంటర్ లేదా 12వ తరగతి పాసైన వారు ఈ ఖాళీలకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. కంప్యూటర్ పై స్పీడ్ టెస్ట్ ఉంటుంది. హెల్త్ కేర్ రంగంలో డేటా ఎంట్రీపై రెండేళ్ల అనుభవం ఉన్న వారికి ప్ారధాన్యం ఉంటుంది. వయస్సు 28 ఏళ్లలోపు ఉండాలి. ఎంపికైన వారికి నెలకు రూ.18 వేల వేతనం ఉంటుంది.

  లేబరోటరీ టెక్నీషియన్: ఈ విభాగంలో 2 ఖాళీలు ఉన్నాయి. టెన్త్ పాసైన అభ్యర్థులతో పాటు మెడికల్ లాబరేటరీ టెక్నాలజీలో డిప్లొమా చేసి ఉండాలి. ఎంపికైన వారికి నెలకు రూ.18 వేల వేతనం ఉంటుంది.

  రీసెర్చ్ అసిస్టెంట్: లైఫ్ సైన్సెస్ లో ఎంఎస్సీ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.31 వేల వేతనం చెల్లించనున్నారు.

  సైంటిస్ట్ బీ: మైక్రో బయోలజీ/మాలిక్యూర్ బయోలజీలో పీజీ చేసి ఉండాలి. ఇతర విద్యార్హతల వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.54,500 వేతనం ఉంటుంది.

  TS Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఉద్యోగాలు .. ఖాళీలు, జీతం వివరాలివే..!

  ఎలా అప్లై చేయాలంటే..

  Step 1: అభ్యర్థులు మొదటగా అధికారిక వెబ్ సైట్ https://nims.edu.in/index ఓపెన్ చేయాలి.

  Step 2: అనంతరం నోటిఫికేషన్స్ విభాగంలో Recruitment ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

  Step 3: అనంతరం Notification for Scientist-B - Research Assistant ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

  Step 4: తర్వాత అప్లికేష్ ఫామ్ ఓపెన్ అవుతుంది.

  Step 5: ఆ ఫామ్ లో కావాల్సిన వివరాలను నింపాలి.

  Step 6: ఆ అప్లికేషన్ ఫామ్ ను The Dean, Nizams Institute Of Medical Science చిరునామాకు పంపించాల్సి ఉంటుంది.

  Step 7: దరఖాస్తులు అక్టోబర్ 12వ తేదీ సాయంత్రం 4లోగా చేరేలా పంపించాల్సి ఉంటుంది.

  Published by:Nikhil Kumar S
  First published:

  Tags: Health jobs, JOBS, Nims, Telangana government jobs

  ఉత్తమ కథలు