హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

NIMS Jobs 2022: నిరుద్యోగులకు శుభవార్త.. హైదరాబాద్ నిమ్స్ లో జాబ్స్.. ఈ లింక్ తో అప్లై చేసుకోండి

NIMS Jobs 2022: నిరుద్యోగులకు శుభవార్త.. హైదరాబాద్ నిమ్స్ లో జాబ్స్.. ఈ లింక్ తో అప్లై చేసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

హైదరాబాద్ లోని నిజామ్స్ ఇనిస్ట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(NIMS) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను(Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

హైదరాబాద్ లోని ప్రముఖ నిజామ్స్ ఇనిస్ట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (NIMS) ఇటీవల పలు ఖాళీల భర్తీకి వరుసగా జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదలు చేస్తోంది. తాజాగా.. మరో జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అనస్తేషియాలజీ, కార్డియాలజీ, కార్డియోథొరాసిక్ సర్జరీ, ఎండోక్రైనాలజీ, జనరల్ మెడిసిన్, హెమటాలజీ, మైక్రోబయోలజీ, మెడికల్ జెనెటిక్స్, మెడికల్ న్యూరాలజీ, న్యూరోసర్జరీ, అర్థోపెడిక్స్ తదితర విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో వెల్లడించారు. ఈ ఉద్యోగాలకు (Jobs) దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 28ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ ఉద్యోగాలకు ఆఫ్ లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

విద్యార్హతల వివరాలు..

సంబంధిత స్పెషలైజేషన్లలో మెడికల్ పీజీ డిగ్రీ (ఎండీ/ఎంస్/డీఎం/ఎంసీహెచ్/డీఎన్బీ)లో విద్యార్హత సాధించిన వారు అర్హులు. టీచింగ్/పరిశోధనలో అనుభవం ఉండాలి. ఈ ఖాళీలకు ఎంపికైన వారికి నెలకు రూ.1,68,900 వేతనంతో పాటు అలవెన్స్ లు ఉంటాయి.

Jobs in AP: ఏపీలో మరో జాబ్ మేళా.. రిజిస్ట్రేషన్ కు ఈ ఒక్క రోజే ఛాన్స్.. ఇలా రిజిస్టర్ చేసుకోండి

ఇతర వివరాలు:

-అభ్యర్థులను ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయనున్నారు.

-ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

-అభ్యర్థులు దరఖాస్తు కచేసుకునే సమయంలో రూ.500 అప్లికేషన్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.

-దరఖాస్తు చేసుకోవడానికి ఫిబ్రవరి 28ని ఆఖరి తేదీగా నిర్ణయించారు.

-అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తులను ఎగ్జిగ్యూటివ్ రిజిస్టార్, నిమ్స్, పంజాగుట్ట, హైదరాబాద్-500082 చిరునామాకు పంపించాల్సి ఉంటుంది.

ESIC Recruitment 2022: ఈఎస్‌ఐలో 3,847 ఉద్యోగాలు... తెలంగాణ, ఏపీలో ఖాళీలు

ఎలా అప్లై చేయాలంటే..

-అభ్యర్థులు మొదటగా అప్లికేషన్ ఫామ్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి.

-అనంతరం అప్లికేషన్ ఫామ్ లో సూచించిన వివరాలను పూర్తిగా నింపాలి. ఆ ఫామ్ ను పైన పేర్కొన్న చిరునామాకు ఈ నెల 28లోగా చేరేలా పంపించాల్సి ఉంటుంది.

-అసంపూర్తిగా నింపిన అప్లికేషన్ ఫామ్ లను తిరస్కరిస్తామని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.

-అర్హత కలిగిన అభ్యర్థులను ఇంటర్వ్యూలకు ఆహ్వానించనున్నట్లు నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.

-అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలకు హెచ్ ఆర్ సెక్షన్, నిమ్స్ ను 040-23489353 నంబర్ ను సంప్రదించాలని ప్రకటనలో సూచించారు.

First published:

Tags: Job notification, Nims, State Government Jobs

ఉత్తమ కథలు