హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

NIMS Admissions: నిమ్స్(NIMS) లో పలు కోర్సులల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ .. వివరాలిలా..

NIMS Admissions: నిమ్స్(NIMS) లో పలు కోర్సులల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ .. వివరాలిలా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

హైదరాబాద్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (NIMS) లో 2022 సంవత్సరానికి బీఎస్సీ నర్సింగ్, బీఎస్సీ పారా మెడికల్ సంబంధిత హెల్త్ సైన్సెస్ కోర్సులు, బ్యాచిలర్ ఆఫ్ ఫిజియో థెరపీ కోర్సుల్లో(బీపీటీ) ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. పూర్తి వివరాలు ఇలా..

ఇంకా చదవండి ...

హైదరాబాద్(Hyderabad_ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (NIMS)లో 2022 సంవత్సరానికి బీఎస్సీ నర్సింగ్, బీఎస్సీ పారా మెడికల్ సంబంధిత హెల్త్ సైన్సెస్ కోర్సులు, బ్యాచిలర్ ఆఫ్ ఫిజియో థెరపీ (బీపీటీ) కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. హెల్త్ సైన్సెస్ కోర్సులలో.. న్యూరో టెక్నాలజీ, డయాలసిస్‌, కార్డియోవాస్కులర్‌, ఎమర్జెన్సీ అండ్‌ ట్రామాకేర్‌, రేడియో థెరఫీ, మెడికల్‌ ల్యాబరేటరీ టెక్నాలజీ(Medical Laboratory Technology), అనస్థీషియా, పెర్ఫ్యూజన్‌ టెక్నాలజీ(Technology), రేడియేషన్‌ థెరఫీ, రెసిపిరేటరీ థెరఫి అండ్‌ ట్రాన్స్‌ఫ్యూజన్‌ మెడిసిన్‌ వంటి కోర్సులకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. ప్రవేశ పరీక్షలో వచ్చిన మెరిట్‌ మార్కుల ప్రాతిపదికన సీట్లు భర్తీ చేస్తామని పేర్కొన్నారు. వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌ https://nims.edu.in/ను సంప్రదించాలని తెలిపారు.

TS EAMCET Exam Instructions: రేపటి నుంచి ఎంసెట్ పరీక్షలు.. విద్యార్థులకు కీలక సూచనలు చేసిన కన్వీనర్..


సీట్ల సంఖ్య : బీఎస్సీ నర్సింగ్ – 100, బ్యాచిలర్ ఆఫ్ ఫిజియో థెరపీ – 50, పారా మెడికల్ సంబంధిత హెల్త్ సైన్సెస్ కోర్సులు -100 సీట్లు కలవు.  ఈ కోర్సుల్లో సీట్లను ప్రత్యేక ఎంట్రెన్స్ టెస్ట్ ద్వారా ఎంపిక చేయనున్నారు. ఈ మూడు విభాగాల్లో వివిధ నోటిఫికేషన్లను విడుదల చేశారు.

బీఎస్సీ నర్సింగ్ – 100

వీటిని ముఖ్యంగా మహిళలకు ఉద్ధేశించివి. సంస్థల ఉద్యోగులకు 5 సీట్లను కేటాయించారు. మిగతా 95 సీట్లు దరఖాస్తు చేసుకున్నవారికి ఎంట్రెన్స్ టెస్టు నిర్వహించి ప్రవేశాలు కల్పించనున్నారు. ప్రవేశాలు పొందిన వారికి స్టయిపెండ్ ఇవ్వబడుతుంది. మొదటి ఏడాది రూ.5వేలు, రెండో ఏడాది రూ.6వేలు, మూడో ఏడాది రూ.7వేలు , నాలుగో ఏడాది రూ.8 వేలు చెల్లిస్తారు. అర్హత ఇంటర్మీడియట్ బైపీసీ కోర్స్ చేసి ఉండాలి. డిసెంబర్ 31, 2022 నాటికి 17 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

పరీక్ష ఫీజు : రూ. 700

దరఖాస్తు ప్రారంభ తేదీ : 13 జూలై, 2022

దరఖాస్తు చివరి తేదీ : 01ఆగస్టు, 2022

హార్ట్ కాపీలను ఈ కింద చెప్పిన చిరునామాకు04August, 2022 సాయంత్రం 5 గంటలలోపు పంపించాలి. Associate Dean, Academic-2, 2nd Floor, Old OPD Block, NIMS, Punjagutta, Hyderabad-500082.

బ్యాచిలర్ ఆఫ్ ఫిజియో థెరపీ – 50

ఇంటర్ లో బైపీసీ కోర్సు తీసుకున్నవారు అర్హులు. ఒకేషనల్ లో ఫిజియోథెరపీతో పాటు.. బ్రిడ్జ్ కోర్సు చేసిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. డిసెంబర్ 31, 2022 నాటికి 25 ఏళ్లకు వయస్సు మించకూడదు.

సెప్టెంబర్ 4న పరీక్ష నిర్వహిస్తారు.

దరఖాస్తు ప్రారంభ తేదీ : 13 జూలై, 2022

దరఖాస్తు చివరి తేదీ : 01ఆగస్టు, 2022

హార్ట్ కాపీలను ఈ కింద చెప్పిన చిరునామాకు04August, 2022 సాయంత్రం 5 గంటలలోపు పంపించాలి. Associate Dean, Academic-2, 2nd Floor, Old OPD Block, NIMS, Punjagutta, Hyderabad-500082.

పారా మెడికల్ సంబంధిత హెల్త్ సైన్సెస్ కోర్సులు -100 సీట్లు

నాలుగేళ్ల వ్యవధిత ఈ కోర్సు ఉంటుంది. ఇందులోనే ఏడాది పాటు ఇంటర్న్ షిప్ ఉంటుంది. ఇంటర్ బైపీసీ అర్హత. డిసెంబర్ 31, 2022నాటికి వయస్సు 25 ఏళ్లకు మించకూడదు.

దరఖాస్తు ప్రారంభ తేదీ : 13 జూలై, 2022

దరఖాస్తు చివరి తేదీ : 01ఆగస్టు, 2022

హార్ట్ కాపీలను ఈ కింద చెప్పిన చిరునామాకు04August, 2022 సాయంత్రం 5 గంటలలోపు పంపించాలి. Associate Dean, Academic-2, 2nd Floor, Old OPD Block, NIMS, Punjagutta, Hyderabad-500082.

First published:

Tags: Admissions, Career and Courses, JOBS, Nims

ఉత్తమ కథలు